వైఎస్సార్‌సీపీ నేతను లాక్కెళ్లి.. | Ysrcp Leader Veeraiah Illegally Arrested In Mangalagiri | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతను లాక్కెళ్లి..

Oct 20 2026 12:52 PM | Updated on Oct 20 2026 1:12 PM

Ysrcp Leader Veeraiah Illegally Arrested In Mangalagiri

సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో పోలీసులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేత వీరయ్యను తాడేపల్లి పోలీసులు లాక్కెళ్లారు. ఎంపీపీగా పోటీ చేసేందుకు వీరయ్య సిద్ధమవ్వగా.. వీరయ్యపై పీడీ యాక్ట్‌ పెట్టిన పోలీసులు.. జైలుకు తరలించారు.

వీరయ్య భార్య దాసరి అరుణ మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం ఆరు గంటలకు పోలీసులు ఇంటికి వచ్చారు. నా భర్త వీరయ్యను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపుతున్నారు. దుగ్గిరాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాము. మంత్రి నారా లోకేష్‌కు దుగ్గిరాల్లో వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని భయం పట్టుకుంది. అందుకే నా భర్తపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపుతున్నారు. నిజంగా నారా లోకేష్‌కు దమ్ముంటే ఎన్నికలు సజావుగా జరగనివ్వాలి. లోకేష్ ఓడిపోయాడు.. నైతికంగా వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచింది’’ అని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కడపలో అర్ధరాత్రి రెచ్చిపోయిన ఎల్లో గూండాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement