Mangalagiri
-
మంగళగిరిలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేతల దౌర్జన్యం
-
‘డీజీపీ అపాయింట్మెంట్ ఇచ్చారు.. కానీ వచ్చాక కలవలేదు’
మంగళగిరి: వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది కూటమి ప్రభుత్వం కుట్రపూరిత చర్య అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో సరైన కారణం చెప్పలేదని, ఓ తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయ త్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన అంబటి మీడియాతో మాట్టాడారు. ‘వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు.. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. వంశీ టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు కక్ష గట్టారు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలిన ప్రయత్నించినా కోర్టుకు వెళ్లి ప్రొటక్షన్ తెచ్చుకున్నాడు వంశీ. ఇది తప్పుడు కేసు అని అందరికీ తెలుసు కనీసం వంశీని భార్య కలవడానికి కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు పోలీసులు.దీనిపై డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. డీజీపీ ఆఫీస్ కు అపాయింట్ మెంట్ ఇస్తే వచ్చాం.. అయినా వారిని కలవలేదు. రిప్రజెంటేషన్ఇ వ్వడానికి ఈరోజు(గురువారం) సాయంత్రం 4.35కి అపాయింట్ మెంట్ ఇచ్చారు. మేము 4.30కే డీజీపీ ఆఫీస్ కి వచ్చాం. అప్పుడు డీజీపీ ఉన్నారు.. కానీ కాసేపటికి వెళ్లిపోయారని చెప్పారు. మరి మా రిప్రంజటేషన్ ఎవ్వరూ తీసుకోలేదు. ఇదేంటో అర్థం కావడం లేదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. మేము ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి డీజీపీ ఎవరినైనా పంపిస్తారా? లేక మేమే మళ్లీ వచ్చి కలవాలా? అని అంబటి మీడియా ముఖంగా ప్రశ్నించారు. -
మంగళగిరి ఎయిమ్స్‌లో 107 అధ్యాపక పోస్టులు ఖాళీ!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎయిమ్స్‌లలో బోధనా సిబ్బంది పోస్టుల్లో భారీగా ఖాళీలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ఏడు ఎయిమ్స్‌లలో అధ్యాపక ఖాళీలు 24 శాతం నుంచి 39 శాతం వరకు ఉన్నాయని పార్లమెంట్లో ఆరోగ్య శాఖ సమాధానమిచ్చింది. పన్నెండు నగరాల్లో పాక్షికంగా పనిచేస్తున్న ఎయిమ్స్‌లు సైతం ఈ కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో 1,235 బోధనా సిబ్బందికి గాను కేవలం 810 మాత్రమే ఉండగా, 425 ఖాళీలు(34శాతం) ఉన్నాయని, నాన్ ఫ్యాకల్టీ విభాగంలో 14,343 సిబ్బందికి గాను 12,101 మంది పనిచేస్తుండగా, మరో 2,242 ఖాళీలున్నాయని వెల్లడించింది. ఇదే మాదిరి భోపాల్‌లో 24శాతం, భువనేశ్వర్‌లో 25శాతం, జో«ద్‌పూర్‌లో 28, రాయ్‌పూర్‌లో 38, పాట్నాలో 27, రిషికేశ్‌లో 39శాతం ఖాళీలున్నాయంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాక్షికంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎయిమ్స్‌లో 259 మంది బోధనా సిబ్బందికి గాను కేవలం 152 మందే ఉండగా.. మరో 107 ఖాళీలు(41శాతం) ఉన్నాయని తెలిపింది. ఇక 1,469 మంది బోధనేతర సిబ్బందిలో 1,021 మంది పనిచేస్తుండగా 448 పోస్టులు ఖాళీలుగా పేర్కొంది.తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్‌లోనూ 183 మంది బోధనా సిబ్బందికి గాను 118 మంది(36శాతం) మంది పనిచేస్తుండగా, 65 పోస్టుల్లో సిబ్బంది లేరని తెలిపింది. ఇక బోధనేతర సిబ్బందిలోనూ 1,374 మందిలో 898 మంది ఉండగా.. 476 ఖాళీలున్నట్లు తెలిపింది. -
లోకేశ్ సేవలో తరిస్తున్న ఏసీఏ
సాక్షి, అమరావతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గురించి అందరికీ తెలుసు.. మరి మంగళగిరి ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్) గురించి మీకు తెలుసా? సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రత్యేక ఆసక్తితో నిర్వహిస్తున్న లీగ్ ఇది. తన స్వామి భక్తిని చాటుకునేందుకు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ఈ లీగ్‌కు రూపకల్పన చేశారు. ఈ నెల 23న లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా 22 మ్యాచ్‌లతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ఆదివారం కేశినేని చిన్ని దీనిని ప్రారంభించారు. 22వ తేదీ వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని.. 23న ఫైనల్స్ నిర్వహించి విజేతకు అవార్డు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏసీఏ నిధులు దుర్వినియోగం!కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఏసీఏను లోకేశ్ కోటరీ తమ గుప్పెట్లోకి తీసుకుంది. కేశినేని చిన్నిని అధ్యక్షుడిగా, తన సన్నిహితుడు, లాబీయిస్టు అయిన సానా సతీశ్‌ను ప్రధాన కార్యదర్శి పీఠంపై కూర్చోబెట్టారు లోకేశ్. అప్పటి నుంచి కేశినేని చిన్ని, సానా సతీశ్ క్రికెట్ ప్రయోజనాలను పక్కనపెట్టి.. లోకేశ్ కోసమే ఏసీఏను ఉపయోగిస్తున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం కోసం ఏకంగా ప్రీమియర్ లీగ్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం గవర్నింగ్ బాడీ సమావేశంలో షెడ్యూల్‌ను రూపొందించి లీగ్‌లు నిర్వహిస్తుంటారు. కానీ కేశినేని చిన్ని అవేమీ చేయకుండా.. ఎవరినీ సంప్రదించకుండానే ఈ లీగ్‌ను ప్రకటించారు. ఏసీఏ నిధులు, వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ ఏసీఏ నిధులు ఉపయోగిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నియోజకవర్గమే ముఖ్యమా?వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు, క్రీడాకారులకు చేయూత అందించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో పోటీలు నిర్వహిస్తే కూటమి నేతలు అవాకులు, చెవాకులు పేలారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, దాదాపు అన్ని క్రీడలతో ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహిస్తే విమర్శలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు కేవలం సీఎం తనయుడి కోసం ఆయన నియోజకవర్గంలో మాత్రమే లీగ్ పెట్టడం, దానికి ఏసీఏను ఉపయోగించుకోవడం గమనార్హం. రాష్ట్రమంతటికీ ప్రాతినిధ్యం వహించి పనిచేయాల్సిన ఏసీఏ.. కేవలం ఒక నియోజకవర్గంలో ఒక నేత కోసమే పని చేయడమేమిటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
నాడు హడావుడి చేసి.. నేడు ముఖం చాటేసి!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/హనుమాన్‌జంక్షన్ రూరల్: గోడు వినలేదు.. కనికరం చూపలేదు.. కనీసం కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. నాడు హామీ ఇచ్చారు కదా.. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా.. అని ఆశతో వస్తే.. ముఖం చాటేశారు. రోజంతా ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. ఇక చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. ఇదీ మంగళవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసేందుకు వచ్చిన మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడ నిర్వాసితుల పరిస్థితి. 2019 ఎన్నికల ముందు స్వయంగా మల్లవల్లి వచ్చి భూ నిర్వాసితుల ఆందోళనకు మద్దతు తెలపటంతో పాటుగా, అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పనన్ కల్యాణ్ ఇప్పుడూ ముఖం చాటేయటంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు.అసలు విషయం ఏమిటంటే..2016లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు మల్లవల్లిలోని రీ సర్వే నంబర్–11లో 1360 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. అప్పటికే ఆ భూములను సాగు చేస్తున్న రైతులను గుర్తించేందుకు జియోకాన్ అనే సంస్థతో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 623 మంది సాగుదారులు ఉన్నట్లు నివేదిక ఇవ్వగా, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు 716.44 ఎకరాల్లో 490 మంది సాగుదారులు ఉన్నట్లుగా తుది జాబితాను ప్రకటించారు. కానీ వివిధ కారణాలతో చివరికి 443 మంది రైతులకు గానూ 615.6 ఎకరాలకు మాత్రమే రూ.7.50 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని పంపిణీ చేశారు. దీంతో పరిహారం దక్కని సాగుదారులు ఎనిమిదేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సాగుదారుల లెక్క తేల్చే విషయంలో రెవెన్యూ అధికారులపై నాటి టీడీపీ నాయకుల ఒత్తిడితోనే పలువురి పేర్లు తుది జాబితాలో గల్లంతయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయగా, 217 మంది సాగుదారులు 713 ఎకరాలకు నష్టపరిహారం దక్కలేదని అర్జీలు దాఖలు చేశారు.పవన్‌కల్యాణ్, లోకేష్ హడావుడి హామీలు..నష్టపరిహారం అందని సాగుదారులు పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టారు. ఏపీఐఐసీ ఇప్పటికే పరిశ్రమలకు భూకేటాయింపులు చేయటంతో ఆ సంస్థలు చేపట్టిన నిర్మాణాలను సాగుదారులు అడ్డుకుంటూ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఆగస్ట్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మల్లవల్లి పారిశ్రామికవాడలో పర్యటించారు. నష్టపరిహారం అందని సాగుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మల్లవల్లి గ్రామానికి వచ్చినప్పుడు బాధితులు తమ గోడును విన్నవించగా న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ హామీలను నమ్మిన భూనిర్వాసితులు ఇప్పుడు నెత్తికొట్టుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌ను కలిసి తమ కష్టాన్ని చెప్పుకునేందుకు వెళ్తే కనీసం దర్శనభాగ్యం కలగలేదంటూ వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి భూనిర్వాసితుల ఊసే పవన్ కల్యాణ్, నారా లోకేష్‌కు పట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజా పరిణామాలు ఇవి..బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో పరిహారం దక్కని రైతుల స్వాధీనంలో ఉన్న భూములను బలవంతంగా లాక్కునేందుకు కూటమి ప్రభుత్వం దౌర్జన్యకాండకు దిగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ నెల మూడో తేదీ నుంచి నాలుగురోజుల పాటు గ్రామాన్ని అదుపులోకి తీసుకుంది. భూనిర్వాసితులను గృహ నిర్బంధం చేసి, వారి భూములను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటోంది. పారిశ్రామికవాడలోకి ఇతరులను ఎవ్వరిని అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్లుగా పరిహారం కోసం కళ్లు కాయలు కాసేటట్లు ఎదురుచూస్తున్న సాగుదారులను నిర్ధాక్షిణ్యంగా ఇళ్లలో బంధించి, వారి భూములను బలవంతంగా లాక్కొంటున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.పవన్‌కల్యాణ్, లోకేష్ హడావుడి హామీలు..నష్టపరిహారం అందని సాగుదారులు పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టారు. ఏపీఐఐసీ ఇప్పటికే పరిశ్రమలకు భూకేటాయింపులు చేయటంతో ఆ సంస్థలు చేపట్టిన నిర్మాణాలను సాగుదారులు అడ్డుకుంటూ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఆగస్ట్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మల్లవల్లి పారిశ్రామికవాడలో పర్యటించారు. నష్టపరిహారం అందని సాగుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మల్లవల్లి గ్రామానికి వచ్చినప్పుడు బాధితులు తమ గోడును విన్నవించగా న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ హామీలను నమ్మిన భూనిర్వాసితులు ఇప్పుడు నెత్తికొట్టుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌ను కలిసి తమ కష్టాన్ని చెప్పుకునేందుకు వెళ్తే కనీసం దర్శనభాగ్యం కలగలేదంటూ వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి భూనిర్వాసితుల ఊసే పవన్‌కల్యాణ్, నారా లోకేష్ కు పట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్కోవటం తగదు.. మల్లవల్లి పారిశ్రామికవాడ భూముల్లో సుమారు 150 మందికిపైగా నష్టపరిహారం అందలేదు. దీనిపై ఎనిమిదేళ్లుగా పలు రకాలుగా ఆందోళనలు, పోరాటాలు చేశాం. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ కూడా వచ్చి న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా పోలీసు బలగాన్ని అడ్డుపెట్టుకుని బలవంతంగా భూములు లాక్కోవటం సబబు కాదు. – చిన్నాల వరప్రసాద్, భూ నిర్వాసితుల ఉద్యమ నేత, మల్లవల్లికోర్టు ఆదేశాలు ఉన్నా బేఖాతరు.. మల్లవల్లిలోని ఆర్ఎస్ నంబర్ 11లో మా కుటుంబానికి 15 ఎకరాల భూమి ఉంది. దశాబ్దాలుగా ఆ భూమిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. కానీ పారిశ్రామికవాడకు భూసేకరణ జరిగినప్పుడు మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ భూమిపై గతంలోనే కోర్టు ద్వారా పరి్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. అయినప్పటికీ రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు భూములు స్వా«దీనం చేసుకుంటున్నారు. – బొకినాల సాంబశివరావు, నిర్వాసితుడు, మల్లవల్లిఅలసిపోయాను.. చెట్లు, ముళ్ల పోదలతో అడవిలా ఉన్న భూమిని మా కుటుంబం అంతా కలిసి నానా కష్టాలు పడి చదును చేసుకున్నాం. ఆ భూమిలోనే పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో టీడీపీ ప్రభుత్వం పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తామని భూములు లాక్కొది. కానీ ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎన్నో సార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోయాను. ఆ మనోవేదనతో ఆరోగ్యం బాగా క్షీణించింది. – పంతం కామరాజు, నిర్వాసితుడు, మల్లవల్లి -
మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి,మంగళగిరి : ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం జరిగింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్ సర్టిఫికెట్స్ కోర్స్ పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘‘ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఇది. ప్రతి సంవత్సరం నిర్వహించాలి. పానకాల స్వామికి నా ప్రార్ధన.. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి.యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలి. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలి. ఎయిమ్స్ మొదటి బ్యాచ్‌గా మీరందరూ గుర్తుంటారు.దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలి. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలి.మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తాను. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయం.ప్రపంచపటంలో భారతదేశం మెడికల్ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివి. ప్రతీ రోగికీ సేవలందించాలి.. ప్రతీ డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి.యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాను. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలి’’ అని అన్నారు.చంద్రబాబు మాట్లాడుతూఅనంతరం రాష్ట్ర సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఇది.ప్రతి సంవత్సరం నిర్వహించాలి.కాన్వకేషన్ మీకు ఒక గుర్తింపు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాధారణ మహిళ, గిరిజన మహిళగా భారత ప్రథమ మహిళ అయ్యారు. ఉపాధ్యాయినిగా అంచెలంచెలుగా రాష్ట్రపతి అయ్యారు ’అని చంద్రబాబు అన్నారు. -
నేడు మంగళగిరికి రాష్ట్రపతి రాక
సాక్షి, అమరావతి/మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌లో మంగళవారం నిర్వహించే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు తదితరులు హాజరవుతారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మాధభానందకర్ చెప్పారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేస్తారని తెలిపారు. -
అఘోరీ హల్చల్
మంగళగిరి : మంగళగిరి – తాడేపల్లి జాతీయ రహదారిపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన మహిళా అఘోరీ సోమవారం హల్చల్ చేసింది. పుర్రెలు మెడలో ధరించి, దిగంబరంగా ఆటో నగర్‌లోని తన కారు సర్వీస్ సెంటర్‌కు వెళ్లింది. కారు సర్వీస్ చేస్తుండగా ఓ జర్నలిస్టు అఘోరీని ఫొటో తీశారు. దీంతో ఆగ్రహించిన అఘోరీ జర్నలిస్టుపై దాడి చేసి, గాయపరచింది. అతడు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతలో మరికొంత మంది జర్నలిస్టులు చేరుకుని ఫొటోలు, వీడియోలు తీయడంతో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు చేరుకుని అఘోరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ వైద్య సేవలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో డ్రోన్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం ఎయిమ్స్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రోన్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, సిబ్బందిని ప్రధాని మోదీ అభినందించారు. ముందుగా మంగళగిరి మండలం నూతక్కి పీహెచ్సీలో చికిత్స పొందుతున్న మహిళ నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రోన్ ద్వారా ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు.పరీక్ష అనంతరం మహిళకు అవసరమైన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్, సీఈవో మధుబానందకర్ మాట్లాడుతూ.. ఎయిమ్స్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి పీహెచ్‌సీకి 9 నిమిషాల్లోనే డ్రోన్ చేరుకొని.. బ్లడ్ శాంపిల్స్ సేకరించిందని చెప్పారు. తద్వారా వేగంగా చికిత్స అందించడానికి అవకాశం లభించిందన్నారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని గర్భిణులకు ఉచితంగా డ్రోన్‌తో వైద్య సేవలందిస్తామన్నారు. అత్యవసర సమయాల్లో డ్రోన్ వైద్య సేవలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎయిమ్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విచారణకు సజ్జల పోలీసుల ఓవరాక్షన్ పై పొన్నవోలు ఫైర్
-
అక్రమ కేసు.. విచారణకు సజ్జల హాజరు
సాక్షి, గుంటూరు: టీడీపీ కార్యాయలంపై దాడి చేశారంటూ అక్రమ కేసు విచారణకు హాజరు కావాలంటూ నిన్న(బుధవారం) వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, అవినాష్, నందిగం సురేష్లను పోలీసులు విచారించారు. ఈ కేసులో సజ్జలను 120వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.కాగా, సజ్జల వెంట పొన్నవోలు, అప్పిరెడ్డి, తలశిల రఘురాం ఉండగా, పోన్నవోలు సుధాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదిని అడ్డుకోవడం రాజ్యాంగం విరుద్ధం అంటూ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని.. ప్రాథమిక హక్కులను సైతం కాలరాస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.ఇదీ చదవండి: విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలకు అర్థం లేదు: వైఎస్ జగన్ -
అరాచకానికి హద్దు లేదా?.. నోటీసులపై సజ్జల రియాక్షన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విచారణకు హాజరు కావాలంటూ మంగళగిరి పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అబద్ధాన్ని అయినా చంద్రబాబు నిజంగా మల్చుతారని.. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు‘‘మాకు న్యాయ స్థానాలపై విశ్వాసం ఉంది. నేను విదేశానికి వెళ్లానని తెలిసి లుకౌట్ నోటీసు ఇచ్చారు. అక్టోబర్ 7న విదేశానికి వెళ్తే 10న నోటీసు ఇచ్చారు. 2021లో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగితే ఇప్పుడు మళ్లీ కొత్తగా మాకు నోటీసులు పంపుతున్నారు. కేసు ముగిసే సమయానికి నోటీసులు ఏంటి?. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? అరాచకానికి హద్దు లేదా?’’ అంటూ సజ్జల నిప్పులు చెరిగారు.‘‘అధికారం ఉందని తప్పుడు కేసులు పెడుతున్నారు. దానిపై మేము న్యాయం కోర్టుకు వెళ్తాం. ఎల్లోమీడియా తప్పుడు వార్తలు రాస్తోంది. మీ పెండ్యాల శ్రీనివాసరావు, ఇతర నేతల్లాగా నేనేమీ పారిపోవడం లేదు. కానీ లుకౌట్ నోటీసులు పేరుతో హడావుడి చేస్తున్నారు. ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన టీడీపీ ఆఫీసు మీద దాడి కేసును ఇప్పుడు బయటకు తీశారు. అసలు ఆ దాడి జరగడానికి కారణం ఏంటో కూడా అందరికీ తెలుసు..టీడీపీ నేతలు సీఎం జగన్ ని దారుణంగా దూషించారు. సుప్రీంకోర్టు నాకు ఇంటీరియమ్ ప్రొడక్ట్ ఇచ్చింది. అది కూడా సెప్టెంబర్ 20నే ఇచ్చినా కూడా ఇప్పుడు నాకు నోటీసులు ఎలా ఇస్తారు?. చేతిలో అధికారం ఉందని ఎలాగైనా నోటీసులు ఇస్తారా?. దీన్ని బరితెగింపు అనాలా? పొగరు అనాలా? ఇంకేమైనా అనాలా?. అసలు రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందా?. ఏమాత్రం బేస్‌లేని విషయాలలో కూడా నోటీసులు ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నారు?. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ అటాచ్మెంట్ చేసిందంటే చంద్రబాబు తప్పుడు పని చేసినట్టు నిర్ధారణ అయింది. అందుకే ఆస్తుల అటాచ్మెంట్ జరిగింది. కానీ చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎలా రాస్తారు? అంతకన్నా బరితెగింపు ఉంటుందా?’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు.ఇదీ చదవండి: ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’! ‘‘అలా తప్పుడు ప్రచారం చేసి జనాన్ని నమ్మించగలరేమోగానీ కోర్టును నమ్మించలేరు. జత్వానీ కేసులో కూడా నన్ను ఇలాగే ఇరికించారు. ఏదోలాగా కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. పట్టాభి ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్‌ని దూషించారు. అప్పుడు టీడీపీ ఆఫీస్‌పై గొడవ జరిగింది. వైఎస్ జగన్ మీద కూడా తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఎలాంటి నేరం జరగకపోయినా జరిగినట్టుగా క్రియేట్ చేసి కేసులు పెడుతున్నారు. బోట్లతో ప్రకాశం బ్యారేజిని కూల్చాలని ప్లాన్ చేశారని కూడా కేసులు పెట్టారు. అలాంటి వారికి న్యాయంతో పనిలేదు. ఏదోలా కేసులలో ఇరికించాలనే లక్ష్యంగా పని చేస్తున్నారు. పార్టీలో యాక్టివ్‌గా ఉన్న వారందరినీ టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారు. కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. -
సజ్జలకు పోలీసుల నోటీసులు
-
సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా రేపు(గురువారం) ఉదయం 10:30 గంటలకు సజ్జల హాజరు కావాలని నోలీసులు ఇచ్చారు. -
కీచకపర్వం.. మంగళగిరిలో ఏం జరుగుతోంది?
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎక్కడా చూసినా అత్యాచారాలు, హత్యలు, దాడులే కనిపిస్తున్నాయి. మొన్నటి ముచ్చమర్రి ఘటనతో మొదలైన అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం జరగడం తీవ్ర కలకలం సృష్టించింది.కాగా, ఈ ఘటనలపై వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ దారుణాలపై ట్విట్టర్లో..‘మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం. నియోజకవర్గంలోని ఆత్మకూరు, మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, బాలాజీ నగర్లో మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి యత్నించడంతో.. భయంతో వణికిపోతున్న ఆడపిల్లల తల్లిదండ్రులు. నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో శాంతి భద్రతను గాలికొదిలేసి.. కామాంధులకి లైసెన్స్ ఇచ్చేశావా నారా లోకేష్’ అని ప్రశ్నించింది. మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం నియోజకవర్గంలోని ఆత్మకూరు, మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, బాలాజీ నగర్లో మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించిన కామాంధులు24 గంటల వ్యవధిలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి కామాంధులు యత్నించడంతో.. భయంతో వణికిపోతున్న…— YSR Congress Party (@YSRCParty) September 14, 2024ఇదిలా ఉండగా.. ఏపీలో రెడ్ బుక్ పాలనలో శాంతి భద్రతల అంశం గాలిలో దీపంలా మారింది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందోననే భయంలో ప్రజలు ఉన్నారు. వరుసగా అఘాయిత్యాల ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ముచ్చుమరి ఘటన నుంచి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ దారుణాల వరకు బాధితులకు న్యాయం చేయడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
పతాకస్థాయికి టీడీపీ కక్షసాధింపు 'పార్టీ ఆఫీసు కూల్చేశారు'
సాక్షి ప్రతినిధి, గుంటూరు/మంగళగిరి: తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్డోజర్లతో కూల్చి వేసింది. దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నుంచే పొక్లయిన్లు, బుల్డోజర్లతో మోహరించారు. భవనం కూల్చివేతకు బందోబస్తు కావాలని పోలీసులను కోరగా, అసెంబ్లీ విధుల్లో ఉన్నందున తమ వద్ద తగిన సిబ్బంది లేరని వారు సమాధానం ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో శనివారం ఉదయానికి పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని సీఎంఓ నుంచి ఒత్తిడి రావడంతో శనివారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభించి ఏడున్నర గంటలలోపు పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. సీఆర్డీఏ అధికారులు, మున్సిపల్ అధికారులు ఈ కూల్చివేతను పర్యవేక్షించారు. పక్కాగా లీజున్నా దౌర్జన్యం గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలోని బోట్ యార్డు వద్ద సర్వే నంబర్ 202/ఎ–1లోని రెండు ఎకరాల స్థలాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఆదేశాలు జారీ అయ్యాయి. 2012లో రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులకు సంబంధించి విడుదల చేసిన జీవో నంబర్ 571 ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి. స్థలం కేటాయించిన మూడేళ్లలో దేనికి కేటాయించారో ఆ విధంగా ఉపయోగించని పక్షంలో రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా భూమిని ఖాళీగా ఉంచితే ఆ భూమి కేటాయింపును జిల్లా కలెక్టర్ రద్దు చేసి వెనక్కు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మార్చి 31న జీవో–52 ప్రకారం కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ భూమిని అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భూమిని కేటాయించినందుకు ప్రభుత్వానికి గత ఏడాది జూలై 26న రూ.66 వేలు చలానా కట్టారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ నెల 15న రూ.4,44,312 ఆస్తి పన్ను కూడా చెల్లించారు. ఈ మేరకు అన్ని వివరాలతో సీఆర్డీఏకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మొదటి అంతస్తు శ్లాబ్ పూర్తి అయ్యి, రెండో అంతస్తు శ్లాబ్ వేసే సమయంలో ఈ నెల 10న సీఆర్డీఏ అధికారులు నోటీసు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రొసీజర్ పాటించాలని, తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని వెంటనే సీఆర్డీఏ న్యాయవాదులతో పాటు సీఆర్డీఏ కమిషనర్‌కు వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఫోన్ ద్వారా చేరవేశారు. దీంతో కోర్టు ఆదేశాలు తమకు అందడానికి ముందే పడగొట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే అక్కడ బుల్డోజర్లను మోహరించారు. దీనిపై సీఆర్డీఏ అధికారులతో మాట్లాడటానికి వైఎస్సార్సీపీ నాయకులు ప్రయతి్నంచినా వారు అందుబాటులోకి రాలేదు. శనివారం ఉదయం 5.30 గంటలకు అధికారులు కూల్చి వేశారు. నిర్మాణ దశలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం రైతుల నుంచి లాక్కున్న భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మాణంగుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో జాతీయ రహదారిని ఆనుకుని కాలువ పోరంబోకు భూమిలో రైతులకు ఇచ్చిన పట్టా భూమిని ఆక్రమించుకుని టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఆత్మకూరులో 1974లో రైతులు బొమ్మి రామిరెడ్డి (0.65 ఎకరం), కొల్లు రాఘవరావు (1.75 ఎకరాలు), కొల్లు భాస్కరరావు (1.75 ఎకరాలు)లకు ప్రభుత్వం మొత్తం 4.15 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చింది. టీడీపీ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని, ఇది సరిపోదన్నట్టు పక్కనే ఉన్న రెండెకరాల కాల్వ పోరంబోకును ఆక్రమించుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం మొత్తంగా 6.15 ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకుంది. ఏటా ఎకరాకు రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్ల పాటు ప్రభుత్వానికి లీజు చెల్లించేలా జీవో జారీ చేయించుకుంది. ఈ భూమి ధర దాదాపు రూ.100 కోట్లకు పైమాటే. టీడీపీ భూ దందాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి తహసీల్దారు జి.వి.రామ్‌ప్రసాద్.. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై నోటీసులు జారీ చేశారు. కేవలం రోడ్డును ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్లను మాత్రమే తొలగించారు. కానీ నేడు వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న కార్యాలయం మొత్తం కూల్చేయడం చంద్రబాబు కక్షపూరిత చర్యలకు అద్దం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఓటు తెచ్చిన చేటు..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : పేద రైతులకు ముఖ్యంగా కౌలుదారులకు మొన్న జరిగిన సాధారణ ఎన్నికలు ఎక్కడాలేని కష్టం తెచ్చిపెట్టాయి. తమ యజమానులు చెప్పిన వారికి ఓటు వేయకపోవడం.. తమ మనస్సాక్షి ప్రకారం వారు నడుచుకోవడమే వారు చేసిన నేరం. తమ మాటకు విలువ ఇవ్వలేదని, తాము చెప్పినట్లు ఓట్లు వేయలేదన్న అక్కసుతో తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారు బరితెగించి ఇక నుంచి మా భూముల్లోకి అడుగుపెట్టొద్దని చెప్పేస్తున్నారు.మీకు మా భూములను కౌలుకు ఇవ్వడంలేదని తేల్చిచెప్పేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలురైతులు వ్యవసాయ సీజన్ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. తాత, తండ్రుల నుంచి ఇప్పటివరకు ఆ భూముల్లో పంటలు పండించుకుంటూ క్రమం తప్పక కౌలు చెల్లిస్తున్న తమను రావద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదనకు లోనవుతున్నారు. మాకిష్టమైన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని వాపోతున్నారు.భూమి వారిదైనప్పుడు మా ఓటు మాది కాదా అని యువ కౌలుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇలా మాలాంటి పేదలపై పెత్తందారుల దాష్టీకాలు ఇంకెంత కాలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణాలు మంగళగిరి నియోజకవర్గంలోనే చోటుచేసుకుంటున్నాయా? లేక ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించిందా అని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కౌలురైతులు ‘సాక్షి’ వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు.కౌలురైతు: బుల్లా శ్రీనివాసరావు సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - గుంటుపల్లి సరస్వతిగ్రామం - పెదపాలెంసాగుచేస్తున్న భూమి- రెండెకరాలుఎప్పటి నుంచి - 15 ఏళ్లుగాకౌలు మొత్తం (ఎకరానికి) - రూ.35 వేలుకౌలురైతు: గొడవర్తి ప్రతాప్సింగ్సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - వాసిరెడ్డి వాసుగ్రామం - పెదపాలెంసాగు చేస్తున్న భూమి - మూడెకరాలుఎప్పటి నుంచి - ఏళ్లుగా చేస్తున్నారుకౌలు మొత్తం - 22 బస్తాలుకౌలురైతు: షేక్ సద్దాం హుస్సేన్ సామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - గద్దె శ్రీనివాసరావుగ్రామం - చిలువూరుసాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - ఐదేళ్లుగా..కౌలు మొత్తం - 16 బస్తాలుకౌలురైతు: షేక్ ఖాదర్ భాషాసామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - యడ్ల హర్షవర్థన్రావుగ్రామం - తుమ్మపూడిసాగుచేస్తున్న భూమి - 10 ఎకరాలు ఎప్పటి నుంచి - 35 ఏళ్లుగాకౌలు మొత్తం - 70 వేలు (నిమ్మతోట)కౌలురైతు: చిలకా తిమోతిసామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - పాటిబండ్ల హరిప్రసాద్ గ్రామం - పెదపాలెంసాగు చేస్తున్న భూమి - ఒకటిన్నర ఎకరంఎప్పటి నుంచి - 30 ఏళ్లుగాకౌలు మొత్తం - 22 బస్తాలుకౌలురైతు: షేక్ ఖాంసాసామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - లంక గోపాలరావుగ్రామం - కంఠంరాజు కొండూరుసాగుచేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 14 ఏళ్లుగాకౌలు మొత్తం - 18 బస్తాలుకౌలురైతు: గంపల శ్రీనివాసరావుసామాజికవర్గం - బీసీ (యాదవ)భూ యజమాని - పుతుంబాక సాయికృష్ణగ్రామం - పేరకలపూడి సాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 22 ఏళ్లుగాకౌలు మొత్తం - 35,000కౌలురైతు: యలమాటి ప్రసాద్కుమార్సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - గుంటుపల్లి సరస్వతిగ్రామం - పెదపాలెంసాగుచేస్తున్న భూమి - మూడెకరాలుఎప్పటి నుంచి - 35 ఏళ్లుగా (తండ్రి నుంచి)కౌలు మొత్తం - 5 బస్తాలు మొదలు 23 బస్తాల వరకు / 30 వేలుకౌలురైతు: దేశబోయిన బాబుయాదవ్సామాజికవర్గం - బీసీ (యాదవ)భూ యజమాని - గుండిమెడ బసవయ్యగ్రామం - కంఠంరాజు కొండూరుసాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 35 ఏళ్లుగాకౌలు మొత్తం - 18 బస్తాలుమంగళగిరి నుంచి లోకేశ్ పోటీతో..టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలై, మూడు శాఖల మంత్రిగా పనిచేసిన ఆయన మరోసారి అదే స్థానం నుంచి బీసీ వర్గానికి చెందిన మురుగుడు లావణ్యతో ఈసారి పోటీపడ్డారు. చాలాకాలంగా మంగళగిరి టౌన్, రూరల్, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని తన సామాజికవర్గంపై ఆయన ప్రధానంగా దృష్టిసారించారు.ఈ నేపథ్యంలో.. పెదపాలెంకు చెందిన పాటిబండ్ల కృష్ణప్రసాద్ (కేపీ) వైఎస్సార్సీపీ నాయకుడిగా కొనసాగుతూ కొద్దినెలల కిందట లోకేశ్ పక్షాన చేరారు. అలాగే, దుగ్గిరాల మండలవాసి, మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలు, విద్య, వైద్య రంగ సంస్థల ముఖ్యులు, వ్యాపారస్తులు, ఎన్ఆర్ఐల సహకారం కూడా లోకేశ్‌కు తోడైంది. తమ వాడైన లోకేశ్‌కు మద్దతిస్తే ఇవ్వండి, లేదంటే మా సంస్థల్లో మీరు చేస్తున్న ఉద్యోగాలను వదిలేసుకోండని స్పష్టంగా చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు.. ఇళ్లలోని పెద్దలకు, మహిళలకు కూడా ఫోన్లుచేసి ఇదే విషయమై బెదిరించారని చెప్పారు.వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నామని..దుగ్గిరాల మండలంలోని వివిధ గ్రామాల్లో పెత్తందారులుగా చలామణి అవుతున్న పలువురు టీడీపీ నాయకులు, మద్దతుదారులు తమను అనేక విధాలుగా బెదిరింపులకు పాల్పడ్డారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు వాపోయారు. మండలంలోని పెదపాలెం, తుమ్మపూడి, చిలువూరు, కంఠంరాజు కొండూరు, పేరకలపూడి, శృంగారపురం, పెనుమోలి, మోరంపూడి, చిన్నపాలెం తదితర 12 పల్లెల్లోని పేద రైతులకు ఈ ఏడాది నుంచి కౌలుకు భూమి ఇవ్వడంలేదని వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు టీడీపీ సామాజికవర్గానికి రైతులు చెప్పడం పరిశీలనాంశం. ‘ఎన్నికలు జరగడం కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఎవరికిష్టమైన పార్టీకు వారు ఓట్లు వేసుకుంటున్నారు. ఆ తరువాత ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఈసారే కులాలు, మతాలు అంటూ దారుణంగా పరిస్థితులు మారాయి’.. అని వైఎస్సార్సీపీ నాయకుడు వీరయ్య వ్యాఖ్యానించారు.నియోజకవర్గ ఓటర్లకు డబ్బులు..ఇక మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని వాటితో పాటు విజయవాడ, గుంటూరు, ఇతర ముఖ్య నగరాల్లోని కార్పొరేట్ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాల్లో పనిచేసే నియోజకవర్గ ఓటర్లకు ఎన్నికల బోనస్ అందింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఆయా ఉద్యోగి స్థాయిని బట్టి 2,500 నుంచి 5,000 వరకు డబ్బులు అకౌంట్లలో పడ్డాయి. చేతికి కూడా ఇచ్చారు. అడక్కపోయినా తమకు ఎన్నికల బోనస్ అందిందని ఆయా గ్రామాలకు చెందిన ఉద్యోగుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది. పదవులు వచ్చాయని పగబట్టారు..మండలంలోని ఓ ప్రధాన సామాజికవర్గం వారు దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ (పసుపు) యార్డు చైర్మన్ పదవిని దశాబ్దాలుగా అనుభవించారు. ఆ పదవిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికిచ్చారు. అప్పటి నుంచే ఆ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది. నియోజకవర్గంలోని ఇతర పదవుల విషయంలోనూ వారిది అదే తీరు.ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు దారులకు మండలంలో సుమారు 200 ఎకరాల వరకు కౌలుకు ఇవ్వడంలేదనేది మా అంచనా. గత ఎన్నికల్లో నారా లోకేశ్ పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీసీ వర్గీయురాలిపై పోటీచేశారు. ఫలితం తేలాల్సి ఉంది. ఆయన సామాజికవర్గీయులకు చెందిన భూములు కౌలుకు ఇవ్వడంలేదంటే వారి ఆలోచనా తీరును అర్థంచేసుకోవాలి. ఆయన మంగళగిరి నియోజకవర్గ నాయకుడా? లేక రాష్ట్రస్థాయి లీడరా? అనేది ఆయనే తేల్చుకోవాల్సిన విషయం. – దుగ్గిరాల వీరయ్య, వైఎస్సార్సీపీ, దుగ్గిరాలరెడ్బుక్లో పేరు ఎక్కిందంటూ బెదిరింపులు..35 ఏళ్లుగా మా తాత తండ్రుల కాలం నుంచి మూడెకరాలను కౌలుకు చేస్తున్నాం. వాళ్ల ఇళ్లలో అన్నిరకాల పనులూ చేశాం. వైఎస్సార్సీపీ వైపు నిలిచినందుకు మాకు భూమి కౌలుకు ఇచ్చేది లేదంటున్నారు. అమరావతి భూముల అంశంలో మాట్లాడినందుకు.. ‘నీ పేరు లోకేశ్ రెడ్‌బుక్‌లో ఎక్కింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక నీ సంగతి తేలుస్తా’..మని బెదిరిస్తున్నారు. ఏం జరుగుతుందో, ఏమో! – యలమాటి ప్రసాద్‌కుమార్, పెదపాలెంఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకున్నారు..మేం ఇల్లు కట్టుకుంటున్నాం. నిర్మాణ సమయంలో పొరుగు ఇంటిపై కాస్త నీళ్లు పడినా, దుమ్ము రేగినా తట్టుకోలేకపోతున్నారు. పనిచేసే భవన కార్మికులను, పనివాళ్లను తిడుతున్నారు. కారణం మేం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచామని. – షేక్ బాజీ, చిలువూరుమీరు పార్టీ మారారని మేమూ మారాలా?‘మీరు ఎందుకు జగన్‌కు మద్దతుగా ఉంటున్నారు? ఆ పార్టీని వదిలేసి లోకేశ్‌కు ఓట్లు వేయండి’.. అని మా గ్రామ పెత్తందారు హుకుం జారీచేశారు. మేం జగన్‌ను వదిలే ప్రసక్తిలేదని నాతో పాటు మా బంధువర్గానికి చెందిన వారందరం స్పష్టంగా చెప్పాం. మీరు పార్టీ మారారని, మమ్మల్ని కూడా మారాలని ఆదేశిస్తే అంగీకరించేదిలేదన్నాం. దీంతో పదిహేనేళ్లుగా కౌలుచేస్తున్న రెండెకరాలను ఇచ్చేదిలేదన్నారు. కౌలు డబ్బులు సీజన్‌కు ముందే చెల్లిస్తాం. ఓట్లు వేయనందుకు పొలం ఇవ్వడంలేదనడం వ్యవసాయ సీజన్ మొదలయ్యే ముందు చెప్పడం ఎంతవరకు న్యాయమో వారే ఆలోచించుకోవాలి. – బుల్లా శ్రీనివాసరావు, పెదపాలెండబ్బులు వెనక్కు ఇచ్చేశారు..భూమి సత్తువ కోసం జొన్న మొదుళ్లను కట్టర్‌తో పనిచేయించాం. రూ.5వేలు ఖర్చయ్యింది. ఆ మొత్తాన్ని మా భూ యజమాని తిరిగి ఇచ్చేశారు. మూడెకరాలను ఈ ఏడాది కౌలుకు ఇచ్చేది లేనిదీ ఇరవై రోజులు తరువాత చెప్తామన్నారు. ఇక వారు చెప్పేదేంటో అర్థమైపోయింది. – గొడవర్తి ప్రతాప్‌సింగ్, పెదపాలెంమేమే సాగు చేసుకుంటామంటున్నారు..పద్నాలుగేళ్లుగా సాగుచేసుకుంటున్న నాలుగెకరాల పొలాన్ని ఈ దఫా కౌలుకు ఇచ్చేలా లేరు. మేమే సాగు చేసుకుంటామని చెబుతున్నారు. మొన్న ఎన్నికల్లో మేం ఫ్యాన్‌కు ఓట్లేశామని వారికి మాపై కోపం.– షేక్ ఖాంసా, కంఠంరాజుకొండూరుమా నాన్నకు వీడియోలు చూపించి బెదిరించారు..మీ అబ్బాయి వైఎస్సార్సీపీలో తిరుగుతున్నాడు. పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడాడు. ఇవిగో వీడియోలు చూడండని ఇంటికెళ్లి మా నాన్న ఇస్మాయిల్‌కు వాటిని చూపించారు. దీంతో.. ఐదేళ్లుగా చేస్తున్న నాలుగెకరాలను ఇక నుంచి కౌలుకు ఇచ్చేదిలేదని చెప్పారు. – షేక్ సద్దాం హుస్సేన్, చిలువూరుసర్పంచ్గా గెలిచానని..మాది తుమ్మపూడి. మా అన్న షేక్ ఖాదర్ బాషా. ప్రస్తుతం ఏడాదికి ఎకరానికి రూ.70 వేలు చొప్పున నిమ్మతోటకు కౌలు చెల్లిస్తూ వచ్చాం. పదెకరాలకు 35 ఏళ్ల పాటు ఎప్పటి కౌలు అప్పుడు ఇచ్చేవాళ్లం. నేను సర్పంచ్‌గా పోటీచేసి గెలిచినందుకు మూడేళ్ల నుంచి నిమ్మతోటను మా అన్నకు ఇవ్వలేదు. – జానీ బాషా, తుమ్మపూడి సర్పంచ్మీవి భూములైనప్పుడు మావి ఓట్లు కావా?మా బాబాయి గంపల శ్రీనివాసరావు 22 ఏళ్లుగా రెండెకరాలు కౌలుకు చేసేవారు. ఎకరానికి రూ.35 వేలు చొప్పున ముందస్తు కౌలు క్రమం తప్పక చెల్లించేవారు. ఎంబీఏ చేసిన నేను బీసీ వర్గం నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్‌గా గెలుపొందాను. అంతమాత్రాన కౌలుకు భూమి ఇచ్చేదిలేదంటే ఎలా? భూములు వారివి అయినప్పుడు ఓట్లు మావి కావా? వారికి మాత్రమే పార్టీ.. మాకు పార్టీ అంటే ఇష్టం ఉండదా? ఇదెక్కడి న్యాయమో అర్థంకావడంలేదు. – గంపల గంగాధరరావు, పేరుకలపూడి, సర్పంచ్ -
Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తనయుడు లోకేష్ రెండోసారి ఓటమికి సిద్ధమవుతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో దొడ్డిదారిన మంత్రి పదవి వెలగబెట్టిన లోకేష్ మంగళగిరిలో పునాది వేసుకోలేకపోయారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే మంగళగిరిని ఊహించనిరీతిలో అభివృద్ధి చేశారు. వైఎస్ జగన్ పాలనకు జనం జేజేలు పలుకుతున్నారు. పోలింగ్ రోజు ఉదయమే బారులు తీరిన ఓటర్లే జగన్ పాలనకు ఆమోదమనే చర్చ జరుగుతోంది.ఆర్కే చేతిలో తొలి పరాజయంగుంటూరు జిల్లా ముఖద్వారం మంగళగిరి నియోజకవర్గాన్ని మూడోసారి కూడా వైఎస్సార్సీపీ పార్టీ కైవసం చేసుకోబోతోంది. గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. 2019లో టీడీపీ తరపున అప్పటి మంత్రి, ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. తండ్రితో కలిసి హైదరాబాద్ పరార్ఓటమి తర్వాత ఏడాదికిపైగా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. కరోనా సమయంలో కరకట్ట మీది ఇల్లు వదిలి తండ్రితో కలిసి హైదరాబాద్ పారిపోయారు. దీంతో మంగళగిరిలో టీడీపీ క్యాడర్ కకావికలమైంది. లోకేష్‌ను కలవాలంటే క్యాడర్‌కు సాధ్యమయ్యేది కాదు. సీఎం జగన్ పాలనలో మారిన మంగళగిరి రూపురేఖలువైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ చేరాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 500 కోట్లతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. దీంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా 1700 కోట్లు లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్లాయి. వైఎస్ జగన్ పాలనలో మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడూ ప్రజలకు అందుబాటలో..తాడేపల్లి, మంగళగిరి కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మంగళగిరి అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటమే గాకుండా అవినీతికి తావు లేకుండా, ప్రతి అభివృద్ధి పనినీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. జగన్ పాలన పట్ల ఆకర్షితులైన నియోజకవర్గంలోని కీలక టీడీపీ నేతలు గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు వైఎస్సార్ సీపీలో చేరి మరింత బలోపేతం చేశారు. చేనేత వస్త్రాలకు పేరు గాంచిన మంగళగిరిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేనేత షెడ్లను ఏర్పాటు చేశారు. నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మార్కెట్లో అమ్ముకోవడానికి చేనేత బజారు ఏర్పాటు చేశారు. మంగళగిరిని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. మరోవైపు లోకేష్ వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు దిగజారిపోతూ వచ్చింది. లావణ్యకు వైఎస్సార్సీపీ టికెట్..మంగళగిరిలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ సీటును బీసీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. అందులో భాగంగానే వరుసగా రెండుసార్లు గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కాకుండా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు వైఎస్సార్సీపీ టికెట్‌ను కేటాయించింది. మురుగుడు లావణ్య మామయ్య మురుగుడు హనుమంతరావు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. లావణ్య తల్లి కాండ్రు కమల కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో నియోజకవర్గంపై వారిద్దరికీ మంచిపట్టుంది.సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల, మరోనేత గంజి చిరంజీవి కలిసికట్టుగా ఎన్నికల యుద్ధంలో దిగటంతో లోకేష్‌కు మైండ్ బ్లాక్ అయింది. తనకు బలం లేకపోయినా డబ్బుతో గెలవాలని నిర్ణయించుకున్న లోకేష్ కోట్లు కుమ్మరించారు.పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకే క్యూఅంతేకాదు 30 మంది డమ్మీ క్యాండెట్లను రంగంలోకి దించి ఓట్లు చీల్చడానికి, ఓటర్లను గందరగోళపరచడానికి కుట్రపన్నారు. కానీ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జగన్ పాలనకే మంగళగిరి ప్రజలు పోలింగ్ రోజు జైకొట్టారు. ఉదయం 6 గంటలకే వృద్ధులు మహిళలతో పాటు బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు గంటలకొద్దీ క్యూల్లో నిలుచుని ఫ్యాన్‌ను గిరగిరా తిప్పారు. వైస్సార్సీ ప్రభుత్వంలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన మంగళగిరి మరింత అభివృద్ధి చెందాలంటే మురుగుడు లావణ్యను గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ప్రజలు భావించారు. లోకేష్ ఎన్ని కుట్రలు చేసినా మరోసారి ఆయనకు ఓటమి తప్పదనే టాక్ మంగళగిరిలో గట్టిగా వినిపిస్తోంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఎస్సై
-
జై జగన్ నినాదాలతో మారుమోగిన మంగళగిరి
-
రూ.300 పింఛన్‌ను రూ.400 చేస్తా
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ మరోసారి నోరు జారి.. నవ్వుల పాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్ గురువారం రాత్రి మంగళగిరి పరిధిలోని కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిడమర్రులో ఆయన మాట్లాడుతూ.. రూ.300 పింఛన్‌ను రూ.400కు పెంచుతాననడంతో సభకు హాజరైనవారు అవాక్కయ్యారు. వెంటనే పక్కనే ఉన్న మరో నాయకుడు కలుగజేసుకొని.. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు అని చెప్పడంతో లోకేశ్ నాలుక కరుచుకున్నారు. -
నేనంటే భయమెందుకు బాబు
-
మంగళగిరి మారుమోగింది.. ‘జై జగన్.. సీఎం జగన్’
గుంటూరు, సాక్షి: అది మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్.. కాస్త ఎండపూట ఇసుకేస్తే రాలనంత జనం చేరారు. సంక్షేమ సారథికి మద్దతు పలికేందుకు అశేషంగా తరలివచ్చిన జన సునామే అది. ఆ అభిమానం ఇంతటితో ఆగలేదు.. సీఎం జగన్ ప్రసంగించే సమయంలో సీఎం సీఎం.. జై జగన్.. జయహో జగన్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగేలా చేశారు. మంగళగిరిలో పచ్చ బ్యాచ్ మొదటి నుంచి ఒకరమైన ప్రచారంతో ముందుకు పోతోంది. బీసీ జనాభా అత్యధికంగా ఉండే చోట.. అగ్ర కులానికి, అందునా గత ఎన్నికల్లో ఓడిన తమ చిన్నబాస్ నారా లోకేష్‌ను బరిలోకి దింపింది. బీసీ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సైతం చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ, సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి)ని తప్పించి మరీ.. బీసీ సామాజిక వర్గానికి, అందునా ఒక మహిళను వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. మురుగుడు లావణ్య ప్రచారానికి వెళ్లిన చోటల్లా.. ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. అదే సమయంలో నారా లోకేష్‌కి ఆదరణ కరువు కావడంతో.. టీడీపీకి ఏమాత్రం మింగుడు పడలేదు.దీంతో మంగళగిరిలో నారా కుటుంబం ప్రచారాన్ని.. ఐటీడీపీ అండ్‌కో పేజీలు సోషల్‌మీడియాలో జాకీలు పెట్టడం ప్రారంభించారు. అక్కడా ప్రతికూల కామెంట్లే వినిపించాయి. అప్పటికీ కూడా మంగళగిరిలో టీడీపీ జెండానే ఎగురుతుందంటూ లోకేష్ అండ్ కో ప్రచారం చేస్తూ వచ్చాయి. ఈలోపే..సీఎం జగన్ మంగళగిరి ప్రచార సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు#MemanthaSiddham, #YSJaganAgain. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు.. జయజయధ్వానాలు పలికారు. ఎటుచూసినా జన సమూహంతో పండగ వాతావరణం కనిపించింది. ‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, మీ జగన్ రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు..’ అంటూ ప్రసంగం ప్రారంభంలో సీఎం జగన్ చెప్పిన మాటలు.. ఆపై కొనసాగిన స్పీచ్ మంగళగిరి ప్రజల్లో ఉత్సాహం నింపింది. ఫ్యాన్ గుర్తుకు తమ ఓటేసి.. కూటమి నేతలను తిప్పికొడతామంటూ తమ నినాదాలతో స్పష్టం చేశారు మంగళగిరి వాసులు. ..‘‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని ఈ పెద్దమనిషి అంటుంటాడు, ఆ యన పాలనలో ఏనాడైనా ఇన్ని స్కీములు ఇచ్చా డా? ఇప్పటి మాదిరిగా ఏనాడైనా అవ్వాతాతలకు ఇంటింటికీ పింఛన్ ఇచ్చాడా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా?’’.. అంటూ సీఎం జగన్ అడిగిన ప్రశ్నలకు లేదూ.. లేదూ.. అంటూ రెండు చేతులు ఊపుతూ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తెచ్చిన పథకాలు గురించి వివరిస్తున్నప్పుడు అవునూ.. అవునూ.. అంటూ ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికారు. స్థానికంగా ఉండే లావణ్యమ్మ(మురుగుడు లావణ్య)కు ఓటేయాలన్నప్పుడు కూడా ప్రజల నుంచి.. సిద్ధం అనే సమాధానమే వినిపించింది. మొత్తంగా.. గ్రాఫిక్స్ అనే వాళ్ల గూబ గుయ్యి మనేలా.. కూటమి వెన్నులో వణుకు పుట్టేలా.. మంగళగిరి ‘జై జగన్’ నినాదాలతో మారుమోగింది. -
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..
-
చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..
-
ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు
-
సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ
-
నారా లోకేష్ కు ఈ దెబ్బతో..!
-
మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు
-
సీఎం జగన్ కాన్వాయ్ విజువల్స్
-
వాళ్లు గొంతు నొక్కేది మీ బిడ్డ ప్రభుత్వానిది మాత్రమే కాదు.. : సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాజకీయాల్లో.. పట్టపగలే ఇంతదారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్న పరిణామాలను చూస్తున్నామని, సరిగ్గా ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలకు తెర తీశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రచార సభలో అన్నారు.‘‘ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. మరి మేనిఫెస్టో పేరుతో మోసగించే చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఎలాంటి కేసులు పెడదాం?. వీళ్ల కుట్రలు ఏ స్థాయిలో ఉందంటే.. జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందనో.. అన్ని వర్గాలు ఎక్కడ జగన్‌ను తమ వాడిగా భావిస్తున్నాయో అని అసూయతో కుట్రలకు తెర తీశాయి... అవ్వాతాలకు పెన్షన్ రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు. వీళ్ల కుట్రలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయంటే.. రెండు నెల కిందట బటన్ నొక్కితే ఎన్నికల కోడ్ పేరుతో అక్కచెల్లమ్మలకు డబ్బు వెళ్తాయో అని దానిని కూడా అడ్డుకున్నారు. వీటి మీద స్వయంగా ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారంటే.. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్.. మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ పాలనలో అలాంటి దాఖలాలూ లేవు. మొదటి రోజు నుంచి ప్రతీ నెలా క్యాలెండర్ ఇస్తూ ఈ నెలల రైతు భరోసా, ఈ నెలలో ఈ పథకం ఇస్తాం అంటూ సంవత్సరం క్రమం తప్పకుండా అందరికీ మంచి చేస్తూ వస్తున్నాడు. కానీ, ఎన్నికలకు ముందే కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు... మన ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకుంటున్నారు. 57 నెలలకే ఈ ప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం గొంతు పికసడం మాత్రమే కాదు. అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతులు, పేద విద్యార్థుల గొంతుల్ని నొక్కడమే అని గమనించండి. మళ్లీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి?.. బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి.. ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి.. సింకులోనే ఉండాలి.నా చెల్లిని పరిచయం చేస్తున్నా. లావణ్యమ్మ(మురుగుడు లావణ్య) మీలో ఒకరు. మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుక బడిన వర్గాల సీటు. నేను గతంలో ఆర్కేకు ఇచ్చా. ఇప్పుడు ఆర్కేను త్యాగం చేయమని చెప్పి.. బీసీకి ఇప్పించా. కానీ, అవతల నుంచి పెద్ద పెద్ద నేతలు వచ్చి.. డబ్బు వెదజల్లుతున్నారు. మీ బిడ్డ దగ్గర పెద్దగా డబ్బు లేదు. బటన్లు నొక్కి పంచిపెట్టడమే ఉంది. చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడం.. పంచుకోవడమే. కాబట్టి చంద్రబాబు మాదిరి మీ బిడ్డ దగ్గర డబ్బు లేదు. అందుకే ఆయన గనుక డబ్బు ఇస్తే వద్దు అనకండి తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మన దగ్గరి నుంచి దోచుకుందే. కానీ, ఎవరి వల్ల మంచి జరిగింది.. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అనేది ఆలోచన చేయండి. ప్రతీ ఒక్కరూ ఓటేయండి. అలాగే ఎంపీ అభ్యర్థిగా రోశయ్య నిలబడుతున్నారు. మీ ఆశీస్సులు రోశయ్యపై కూడా ఉంచాల్సిందిగా కోరుతూ.. ఓటేయమని కోరుతున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ
-
మంగళగిరిలో సీఎం జగన్ సభ
-
మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ
-
మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!
-
లోకేష్ ఆదేశాలతో వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య ?
-
"మంగళగిరిలో మూసీనది.."
-
మంగళగిరిలో లోకేష్ అనుచరుల దాష్టీకానికి YSRCP నేత బలి
-
మంగళగిరిలో టీడీపీ హత్యా రాజకీయాలు
-
మంగళగిరి మాదే.. భారీ ర్యాలీతో నామినేషన్
-
నేతన్నకు నాయకత్వం
బుద్ధీ జ్ఞానం ఉందా? అని నిలదీయండి ‘‘చేనేతలకు అన్ని విధాలా అండగా ఉంటూ వారు రాజకీయంగా కూడా ఎదిగేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో పెద్దపీట వేశాం. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన 54 వేల ఇళ్లను చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందంటూ కేసులు వేశారు. వాళ్లు మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే.. 54 వేల మందికి జగనన్న ఇళ్ల పట్టాలు ఇస్తే నువ్వెందుకు అడ్డుకున్నావ్..! బుద్ధీ జ్ఞానం ఉందా? అని నిలదీయండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. జగన్ చేయవచ్చు, ఇంకొకరు చేయవచ్చు! బాగుపడేది పేదవాడు అయినప్పుడు అడ్డు పడాలని చూసిన ఏ నాయకుడైనా రాజకీయాలకు అనర్హుడు’’ – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, గుంటూరు: నేతన్న నేస్తం అనే ఒక్క పథకం ద్వారానే చేనేతకారులకు రూ.970 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తూ ఏకంగా 1.06 లక్షల మందికి వర్తింపజేశామని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికీ ఏటా నేతన్న నేస్తం అందిస్తూ ఏ ఒక్కరూ మిస్ కాకుండా అర్హులందరికీ పారదర్శకంగా ప్రయోజనం దక్కేలా చర్యలు తీసుకున్నామన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో చేనేతకారులతో నిర్వహించిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. బతుకులు మార్చినవాడే నాయకుడు.. బస్సు యాత్రలో భాగంగా పలు వృత్తులు, వ్యాపకాల్లో నిమగ్నమైన వారిని కలుస్తూ వస్తున్నాం. ఆ వర్గాలకు జరిగిన మంచితోపాటు ఐదేళ్లలో వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయో నేరుగా తెలుసుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇంకా మెరుగ్గా, సమర్థంగా చేయడంపై సూచనలు, సలహాలు ఈ కార్యక్రమం ద్వారా స్వీకరిస్తున్నాం. ప్రజలకు చేదు అనుభవాలను మిగిల్చిన చంద్రబాబు మాదిరిగా కాకుండా ప్రతి పేదవాడు గుండెల్లో పెట్టుకుని చూసుకునేలా 58 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఆ నాయకత్వ స్థానంలో నిలబెట్టినందుకు మన బతుకులు మారాలి. అలాంటి నాయకుడు ఆ స్థానంలో ఉంటేనే మన బతుకులు మారతాయి. ఎన్నుకునేటప్పుడు మనం పొరపాటు చేస్తే రాబోయే ఐదేళ్లు మళ్లీ మనం చేయగలిగింది ఏమీ ఉండదు. మరోసారి మోసపోయి మన బతుకులు అంధకారంలోకి వెళ్లిపోతాయి. నేతన్నకు వెన్నుపోటు.. 98 శాతం ఇంటూ గుర్తులే ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ హామీలు గుప్పిస్తున్న చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు మేనిఫెస్టో 21, 22వ పేజీల్లో చేనేతలకు కాస్తంత స్థలం కేటాయించారు. ఇప్పటి మాదిరిగానే కూటమిగా ఏర్పడి దత్తపుత్రుడు, ప్రధాని మోదీ ఫొటోలతో హామీలిచ్చి 98 శాతం ఎగ్గొట్టారు. నూటికి 2 మార్కులు కూడా రాలేదు. అదీ చంద్రబాబు ట్రాక్ రికార్డు. ఆ హామీలు ఒక్కసారి గమనిస్తే చేనేత సహకార సంఘాల భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది సున్నా. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు గతంలోనే ఇచ్చారు. జరీపై వ్యాట్ రద్దు చేయలేదు. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.లక్ష మేర సంస్థాగత రుణ సౌకర్యం కల్పించలేదు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ఏటా రూ.1,000 కోట్లు కేటాయించలేదు. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పిస్తామంటూ ఆప్కోకే బకాయిలు పెట్టాడు. జిల్లాకో చేనేత పార్కు ఏర్పాటు చేయలేదు. వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆస్పత్రులు, ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు కాలేదు. సగం ధరకే జనతా వస్త్రాలు, జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ హామీ అమలు చేయలేదు. కేంద్రం ఇస్తోంది కాబట్టి చేనేత సొసైటీలకు 20 శాతం రాయితీపై ముడి సరుకుల సరఫరా కొద్దో గొప్పో జరిగింది. ఉచితంగా ఇల్లు, మగ్గం, షెడ్డు ఏర్పాటు ఒక్కరికన్నా ఇచ్చారా? ఇలా 98 శాతం ఇంటూ గుర్తులే ఉంటే రెండు శాతం మాత్రమే టిక్కులు కనపడతాయి. ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి మళ్లీ ఈరోజు ఎన్నికలు రావడంతో మరోసార వంచనకు తయారయ్యాడు. 58 నెలల్లో రూ.3,706 కోట్లు నేతన్నల సంక్షేమం కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా 58 నెలల వ్యవధిలో రూ.3,706 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నా. ఇవన్నీ పారదర్శకంగా కనిపిస్తున్నాయి. మీ బ్యాంకు ఖాతాలకు గత 58 నెలల్లో ఎన్ని డబ్బులు జమ అయ్యాయి? చంద్రబాబు హయాంలో ఎన్ని డబ్బులు పడ్డాయో ఒక్కసారి ఖాతాలను పరిశీలిస్తే తేడా మీకే తెలుస్తుంది. మన ప్రభుత్వం వచ్చాక నేతన్న నేస్తం ద్వారానే రూ.970 కోట్లు 1.06 లక్షల మందికి అందచేశాం. 94,410 చేనేత కుటుంబాలు ఆత్మగౌరవంతో ఇంటివద్దే పెన్షన్ అందుకున్నాయి. నేతన్నలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తున్న పరిస్థితి వచ్చిందంటే దివంగత నేత వైఎస్సార్ చలువే. తొలిసారిగా చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది మన ప్రభుత్వమే. అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, మీరా, పేటీయం లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వారి ఫ్లాట్‌ఫామ్స్‌లో మన వస్త్రాలను చేర్చాం. మనం రాకముందు ఆప్కో బకాయిలే రూ.120 కోట్లు ఉంటే వాటిని క్లియర్ చేయడమే కాకుండా రూ.469 కోట్లు ఆప్కోకు ఇచ్చి చేనేతలకు ఆదుకున్నాం. విద్యాకానుక ద్వారా 44 లక్షల మంది స్కూలు పిల్లలకు యూనిఫాం అందిస్తుండగా తొలి ప్రాధాన్యతగా చేనేతకారులకే ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించాం. బీసీల కోటలో బాబు కుటుంబం తిష్ట చేనేతకారులు అధికంగా ఉండే మంగళగిరి ప్రాంతంలో వారికి రాజకీయంగా కూడా పెద్దపీట వేశాం. స్థానిక ఎమ్మెల్యే ఆర్కేను పిలిచి మాట్లాడి నా చేనేత చెల్లెమ్మకు సీటు ఇచ్చేందుకు సహకరించాలని కోరా. ఆర్కే కూడా మంచి మనసుతో తాను సిద్ధంగా ఉన్నానంటూ ముందుకొచ్చాడు. లావణ్యమ్మకు మంగళగిరిలో, బుట్టమ్మకు ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం. సునీతమ్మ, హనుమంతన్న ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ప్రొద్దుటూరు, రాయదుర్గం, వెంకటగిరి, ఎమ్మిగనూరు, జగ్గయ్యపేట, చీరాల, ధర్మవరం, పెడన లాంటి 8 చోట్ల మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నది నేతన్నలే. దీనికి కారణం మీ బిడ్డ రూల్ తెచ్చాడు కాబట్టే. ఒకవైపు మీ బిడ్డ చేనేతకారులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తూ అడుగులు వేస్తుంటే మరోవైపు చంద్రబాబు ఆయన కుమారుడు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్నచోట్ల కూడా వారికి సీట్లు ఇవ్వకుండా ఆ స్థానాల్లో తిష్ట వేసి రూ.కోట్లు వెదచల్లుతున్నారు. కుప్పంలో బీసీలే ఎక్కువ. చంద్రబాబు బీసీల కోటలో పాగా వేసి డబ్బులతో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నాడు. మీ బిడ్డ మాత్రం కుప్పంలో బీసీనే నిలబెట్టాడు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు కలిపి మొత్తం 200 స్థానాలకుగానూ 50 శాతం అంటే 100 సీట్లు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకే కేటాయించి సామాజిక సాధికారతపై చిత్తశుద్ధి చాటుకున్నాం. మంగళగిరికి మంచి జరిగిందిలా.. మంగళగిరి నియోజకవర్గంలో 1,20,187 ఇళ్లు ఉండగా 1,08,408 ఇళ్లు అంటే 90.1 శాతం గృహాలకు లబ్ధి చేకూర్చాం. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.1,530 కోట్లు జమ చేశాం. మంగళగిరి నియోజకవర్గంలో నెలకొల్పిన 83 సచివాలయాల్లో ఈ వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాం. ఇక నాన్ డీబీటీతో మరో రూ.735 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం. అంటే మొత్తం రూ.2,265 కోట్లు మేర మేలు చేశాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మన అభ్యర్థి లావణ్యమ్మ దగ్గర చంద్రబాబు కుమారుడి వద్ద ఉన్నంత డబ్బులు లేవు. ఎన్నికలొచ్చేసరికే ఆయన ఓటుకు రూ.4 వేలు, రూ.5 వేలు, రూ.6 వేలు అంటాడు. ఇస్తే తీసుకోండి. ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మళ్లీ ప్రతి ఏడాది నేతన్న నేస్తం ఇచ్చే వారికే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లల చదువులు, బడులు, హాస్పిటళ్లు బాగుంటాయో వారికే ఓటేయండి. ఎవరు ఉంటే పేదవాడు అప్పులపాలు కాకుండా వైద్యం అందుతుందో, మన ఇంటికే పెన్షన్ డబ్బులు నడుచుకుంటూ వస్తాయో ఆలోచించి ఓటేయండి. ఎవరు ఉంటే అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తాయో వారికే ఓటు వేయాలని కోరుతున్నా. చేయగలిగిందే చెబుతాం.. మన ప్రభుత్వం ఏదైతే చేయగలుగుతుందో అది మేనిఫెస్టోలో క్లియర్‌గా చెబుతాం. అబద్ధాలాడటం తప్పు. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం నెరవేర్చి ఈరోజు మళ్లీ మీ ఆశీస్సులు కోరుతున్నాం. నేతన్నలకు ఏటా రూ.24 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు అందిస్తున్నాం. ఈ డబ్బులతో ఎవరైనా మగ్గం కొనుక్కోవచ్చు. ఇంట్లో మగ్గం పెట్టుకోవచ్చు. మీరు కోరుతున్నట్లుగా అద్దె మగ్గందారులకూ ప్రయోజనాలు అందించాలని నాకూ ఉంది. కానీ అలా చేయగలుగుతామా? ఎందుకంటే అద్దె మగ్గంలో ఎవరు ఉంటున్నారో, ఎవరు వాడుకుంటున్నారో ఎలా చెప్పగలం? ఈరోజు ఒకరు ఉంటారు.. రేపు మరొకరు ఉండవచ్చు. ఏది చేసినా పారదర్శకంగా ఉండాలి. మన పాలసీ ఏమిటంటే.. ఏ పార్టీవారైనా సరే అర్హత ఉంటే పారదర్శకంగా లబ్ధి చేకూర్చాలి. ఆదుకుని ఆదరించారు... చేనేత వృత్తిని గత ప్రభుత్వాలు గుర్తించలేదు. దివంగత వైఎస్సార్ మాత్రమే చేనేతకారులకు 50 ఏళ్లకే పెన్షన్ సదుపాయం, ఆప్కోస్ ద్వారా సబ్సిడీలు కల్పించారు. సీఎం జగనన్న ఎక్కడా లేనివిధంగా చేనేతలకు ఏటా రూ.24 వేలను సాయంగా అందిస్తున్నారు. నవరత్నాల సంక్షేమాల్లో అగ్రభాగం అందుకుంటున్నది మన చేనేతలే. టీడీపీ హయాంలో చేనేతలను నట్టేట్లో ముంచితే ఆప్కోను ఆదుకుని రూ.180 కోట్లు అందించారు. కరోనా కష్టకాలంలో రెండుసార్లు రూ.24 వేలు ఇచ్చారు. మనకు జగనన్న లాంటి నాయకుడు ఉండటం ఎంత అవసరమో అందరూ ఆలోచన చేయాలి. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మశాలి సోదరి లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. – జింకా విజయలక్ష్మి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ మంగళగిరిలో తయారయ్యే చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్యను, నన్ను పిలిచి చేనేత పరిశ్రమ గురించి ఆరా తీశారు. రంగులు, రసాయనాల వల్ల త్వరగా వృద్ధాప్యం బారిన పడుతున్న చేనేతకారులకు 50 ఏళ్లకే పెన్షన్ అందించేలా నిర్ణయం తీసుకున్నారు. మేం కోరిన మరో 17 డిమాండ్లు కూడా నెరవేర్చారు. చేనేతల క్రిఫ్ట్ ఫండ్‌ను రెట్టింపు చేసి 16%కి పెంచారు. చంద్రబాబు ప్రభుత్వం రిబేట్‌ను తొలగిస్తే వైఎస్సార్ పునరుద్ధరించారు. డైస్, కెమికల్స్‌పై సబ్సిడీ ఇచ్చారు. రూ.100 కోట్లు ఆప్కోకి విడుదల చేయడంతో చేనేత పరిశ్రమ నిలబడింది. మంగళగిరిలో ఇళ్లులేని చేనేత కార్మికుల కోసం 25 ఎకరాలు ఇచ్చారు. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక 150 మంది మగ్గాలకు షెడ్లు వేశాం. నవరత్నాల్లో భాగంగా చేనేతకారులకు ఏటా రూ.24 వేలు చొప్పున అందిస్తున్నారు. చేనేత కార్మికుల జీవితాలను బాగుచేసింది నాడు వైఎస్సార్ అయితే నేడు వైఎస్ జగన్ మాత్రమే. ఆప్కోకి రూ.100 కోట్లు రిలీజ్ చేశారు. మంగళగిరిలో మార్కెటింగ్ సౌకర్యం కోసం రూ.3 కోట్లతో 40 షాపులను నిర్మించారు. – మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ జగనన్న మా చేనేతలకు షెడ్లు వేశారు. నాకు చేయూత వస్తోంది. మావారికి పెన్షన్ ఇస్తున్నారు. నేతన్న నేస్తం ఇప్పిస్తామని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న చెప్పారు. – నందం దుర్గ, చేనేత మహిళ అధైర్యపడవద్దు.. అండగా ఉంటా అనారోగ్య సమస్యలు విన్నవించుకున్న బాధితులకు సీఎం భరోసా పెదకాకాని: మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ శనివారం తనను కలిసిన పలువురు బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. ‘అధైర్యపడవద్దు.. అండగా ఉంటా’నంటూ వారి కన్నీళ్లు తుడిచారు. గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ పార్వతి తన కుమార్తె డింపుల్‌తో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. తన కుమార్తె వినికిడి లోపంతో బాధపడుతోందని.. మాటలు కూడా రావని.. చికిత్సకు సాయమందించాలని పార్వతి కోరగా.. సీఎం జగన్ ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. పాపకు దివ్యాంగ పింఛన్ వస్తుందా అని ఆరా తీశారు. సర్జరీ చేయించడంతో పాటు వినికిడి మిషన్ ఉచితంగా అందజేస్తానని భరోసా ఇచ్చారు. రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.. ‘నా బిడ్డకు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.. ఆదుకోండయ్యా’ అంటూ గుంటూరు జిల్లా కొప్పురావూరుకు చెందిన గోపాలం సుజాత తన కుమార్తె సౌజన్యతో కలిసి నంబూరు అడ్డరోడ్డు వద్ద సీఎం వైఎస్ జగన్‌ను కలిసింది. సీఎం జగన్ వారిని ఓదార్చి.. ప్రభుత్వం నుంచి పింఛన్ అందుతుందా అని ఆరా తీశారు. సమస్య తెలిసి నాలుగు నెలలవుతుందని వారు బదులివ్వగా.. వెంటనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలిసిన వారు ఎవరైనా కిడ్నీ ఇస్తామంటే ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చారు. కిడ్నీ దానం చేసిన వారికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలి చేనేత కార్మికులకు 100 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఎంతో మేలు జరుగుతుంది. రత్నాల చెరువు ప్రాంతంలో చాలామంది అద్దె మగ్గాలతో నేత పనులు చేస్తున్నారు. వారికి కూడా సాయం చేయాలని కోరుతున్నా. మాకూ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. – కొండేటి కుమారి, చేనేత మహిళ, రత్నాలచెరువు, మంగళగిరి సీఎం వైఎస్ జగన్ దీనికి సమాధానం ఇస్తూ... ‘మంగళగిరి నియోజకవర్గంలో లే అవుట్లు రూపొందించి 54 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఆ అక్కచెల్లెమ్మలు జగన్‌ను ఎక్కడ గుండెల్లో పెట్టుకుంటారో అనే భయంతో చంద్రబాబు, లోకేష్ కోర్టుకు వెళ్లి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందంటూ కేసులతో అడ్డుపడ్డారు. మీ బిడ్డ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ పోరాటం చేయడంతో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు కూడా శాంక్షన్ చేయించాం. కట్టడం ప్రారంభించే సమయానికి చంద్రబాబు మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లి కేసు వేయడంతో మేటర్ హియరింగ్ కోసం పోస్ట్ పోన్ చేస్తోంది. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువ చేసే ఆస్తిని పెడుతుంటే అడ్డుకున్నది చంద్రబాబు, లోకేషే’ అని పేర్కొన్నారు. చేనేతల కోసమే లావణ్యకు టికెట్ సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: బీసీలు ఎక్కువ ఉన్న చోట్ల కూడా చంద్రబాబు, ఆయన కుమారుడే పోటీ చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. మంగళగిరిలో చేనేతలు ఎక్కువ కనుక.. తాము మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చామని చెప్పారు. ఈ తేడాను గమనించాలని ప్రజలను కోరుతూ సీఎం జగన్ శనివారం ట్వీట్ చేశారు. ‘మంగళగిరిలో చేనేతలు ఎక్కువ.. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చాం. మరోవైపు చంద్రబాబు, ఆయన కొడుకు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి రూ.కోట్లకు కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు. కుప్పంలోనూ బీసీలు ఎక్కువ. అయినా అక్కడ కూడా ఇదే పరిస్థితి. తేడా గమనించాలని కోరుతున్నాను’ అంటూ శనివారం సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. -
అందుకే మంగళగిరిలో చేనేత మహిళకు టికెట్.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: మంగళగిరిలో చేనేతలు ఎక్కువ.. అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘మరో వైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘కుప్పంలోనూ బీసీలు ఎక్కువగా ఉన్నా అక్కడ కూడా ఇదే పరిస్థితి. తేడా గమనించమని కోరుతున్నాను’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ‘‘చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారు. 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు. గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు. గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు. ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అములు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది’’ అని సీఎం జగన్ వివరించారు. మంగళగిరిలో చేనేతలు ఎక్కువ. అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చాం. మరోవైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు. కుప్పంలోనూ బీసీలు… pic.twitter.com/kB1XDL6mOQ — YS Jagan Mohan Reddy (@ysjagan) April 13, 2024 -
సీఎం జగన్‌తో చేనేత కార్మికులు ఏమన్నారంటే?
సాక్షి, గుంటూరు జిల్లా: మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. బస్సుయాత్రలో భాగంగా మంగళవారం.. చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తాము పొందిన లబ్ధిని వివరిస్తూ సీఎంతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు వేసి మాలాంటి వారికి చంద్రబాబు అన్యాయం చేశారని, జగనన్న మళ్లీ మీరే రావాలి.. మాకు స్థలాలు ఇప్పించి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నామని.. మీరే మా నమ్మకమన్నారు. సీఎం జగన్ స్పందిస్తూ.. మొత్తం 54 వేల మందికి ఇంటి స్థలాలు ఎవరెవరికైతే ఇవ్వడం జరిగిందో.. చంద్రబాబు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో.. వాళ్లందరికీ కూడా చెబుతున్నాను ఏదైనా గానీ సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడటం కూడా ఎవరూ ఆపలేరు. మళ్లీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉన్నా.. నాకు చేయూత వస్తోంది. నా సొంత మగ్గంతో నా సొంతింటిలోనే ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉన్నాను. నాకు మగ్గం డబ్బులు కూడా వచ్చాయి -చేనేత మహిళ సీఎం జగన్‌కు ధన్యవాదాలు.. నాకు మగ్గం షెడ్డులో ఇచ్చారు. నేతన్న నేస్తం కూడా వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు -గుండు కమల, మంగళగిరి సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం.. యావత్ చేనేత కుటుంబాలు సీఎం జగన్‌కు రుణపడి ఉంటాయి. రేపు జరగబోయే ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత అంశాన్ని ఒకటి.. సహకార సంఘాలు, కార్మికులు, పవర్ లూమ్స్ విషయంలో గానీ చాలా గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. చేనేతల పిల్లలు ఈరోజు టోఫెల్ అంటే.. 4 లక్షల మంది జగన్ లు తయారవుతారు రాబోయే 10 ఏళ్లలో. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఈ ప్రజానీకానికి తెలిస్తే 2030 వరకు ఉన్న విజన్ ను గుర్తించాలి. చేనేత బ్యాంక్ ను ఏర్పాటు చేసి యువతకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను -పి.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా చేనేత విభాగ అధ్యక్షుడు నేతన్న నేస్తం వస్తోంది.. నాకు రాజీవ్ గృహకల్పలో ఇళ్లు వచ్చింది నాన్నగారి టైమ్ లో. 2009 నుంచి అక్కడే ఉంటున్నాం ఆ చిన్న ఇంట్లోనే మగ్గం పెట్టుకుని. నేతన్న నేస్తం వస్తోంది, పింఛన్ కూడా వస్తోంది బాగానే ఉంది మాకు.. కవుతరపు రాఘవమ్మ, చేనేత మహిళ. మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా.. నమస్తే జగనన్న మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరు చేకూరుస్తున్న పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. వృద్ధులకు ఉదయాన్నే ఇంటివద్దనే పిలిచి పెన్షన్లు ఇవ్వడం చాలా బాగుంది. ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఎక్కడికి వెళ్లాలి? ఏంటి? అని గంటల తరబడి క్యూలో నిల్చున్న తర్వాత కూడా సరైన సమాధానం వచ్చేది కాదు. కానీ ఈరోజు వాలంటీర్లు ఇంటికే వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటివద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుని తీర్చే ఈ వాలంటీర్ల వ్యవస్థ మాకు నచ్చింది. చాలామంది చదువుకోవడానికి అమ్మఒడి, విద్యాదీవెన ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల కూలీనాలీ చేసుకునే ప్రతిఒక్కరు కూడా తమ పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. ప్రతి మనిషికి కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షలు ఇవ్వడం వల్ల చాలామంది కూడా చూపించుకోగలుగుతున్నారు. ఆరోగ్యపరంగా చాలా మేలు కలుగుతోంది. మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక సీఎం. ఆయన చెప్పిన నవరత్నాలన్నీ కూడా అమలు పరిచిన సీఎం కాబట్టి మళ్లీ జగనన్నే రావాలి, మనమందరం కూడా జగనన్నకే ఓటు వేయాలి. చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు గానీ చేసింది లేదు. జగనన్న వచ్చిన తర్వాత డ్వాక్రా రుణమాఫీ డబ్బులు మా అకౌంట్లో పడుతున్నాయి. మా పిల్లలకు అమ్మఒడి వస్తోంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు ఈ పథకం రాలేదు అన్నవాళ్లు ఎవరూ లేరు. రాలేదు అని చెబుతున్నారంటే వాళ్లు కావాలని చెబుతున్నట్టే. కులమతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పథకాలు వచ్చాయి. -విజయలక్ష్మి, మంగళగిరి.. అదే జగనన్న నినాదం.. అదే జగనన్న విధానం.. ప్రాణదాత, విద్యాదాత రాజశేఖర్ రెడ్డి గారైతే మరో విద్యాదాత మా జగనన్న. చేనేత వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రూ.81 కోట్ల గ్రాంట్ కూడా వస్తే ట్రెజరీలో ఉంటే ఆ డబ్బులను చేనేతలకు ఇవ్వకుండా వేరే వ్యవస్థలకు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు. తమరు వచ్చిన తర్వాత దేశంలోనే చేనేతలకు ప్రప్రథమంగా రూ.24 వేలను నేతన్న నేస్తంగా ప్రకటించారు. రూ.3 వేల పెన్షన్ లెక్క ఇస్తూ సుమారు రూ.1000 కోట్లను చేనేత కార్మికులకు ఇస్తున్నారు. ఆప్కోకు కూడా రూ.108 కోట్ల బకాయిలను చెల్లించి చేనేత కార్మికుల జీవితాలు బాగు చేశారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఒక వ్యక్తి ప్రాణాలు పోశాడు అదే జగనన్న నినాదం.. అదే జగనన్న విధానం.. -శ్రీనివాసరావు, మంగళగిరి జగనన్న మళ్లీ మీరే రావాలి నాకు ఇద్దరు ఆడపిల్లలకు జగనన్న. పిల్లలకు అమ్మఒడి, విద్యాదీవెన వస్తోంది. నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. డ్వాక్రా రుణమాఫీ కూడా అయ్యింది. జగనన్న ప్రభుత్వంలో పేదవాళ్లకు ఇంటి స్థలం వస్తోందని వాలంటీర్లు ఇంటికి వచ్చి చెప్పి మరీ నాకు ఇంటి స్థలం ఇప్పించారు. కానీ ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు వేసి మాలాంటి వారికి అన్యాయం చేశారు. చంద్రబాబు ఇలా చేయడం కరెక్ట్ కాదు. జగనన్న మళ్లీ మీరే రావాలి, మాకు స్థలాలు ఇప్పించి, ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరే మా నమ్మకం -హేమలత, మంగళగిరి సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు: సీఎం జగన్ మొత్తం 54 వేల మందికి ఇంటి స్థలాలు ఎవరెవరికైతే ఇవ్వడం జరిగిందో.. చంద్రబాబు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో.. వాళ్లందరికీ కూడా చెబుతున్నాను ఏదైనా గానీ సూర్యోదయాన్ని ఎవరూ ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడటం కూడా ఎవరూ ఆపలేరు. మళ్లీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున మీ బిడ్డ చేయలేకపోతే ఒక ఆర్నెళ్లు చూస్తాడు, దాని తర్వాత అవసరమైతే మళ్లీ కొత్త స్థలాలు కొని ఇచ్చైనాసరే వీళ్లందరికీ కూడా అక్కడే ఇచ్చే కార్యక్రమం చేస్తాను కచ్చితంగా చేస్తామని చెబుతున్నాను. మనమందరం ఆలోచించుకోవాలి.. నేను యూట్యూబ్‌లో చూశాను. లోకేష్ మా గవర్నమెంట్ వస్తే మేం చెప్పినవాళ్లకే పథకాలు, ఇళ్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇస్తామని చెప్పడం నేను విన్నాను. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే సీఎం కావాలా? ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడా అనే సీఎం కావాలా? అని మనమందరం ఆలోచించుకోవాలి. -మేరీ పాల్ పద్మావతి దేవి, హరిజన క్రైస్తవ, వెనుకబడిన తరగతుల సేవాసంఘం అధ్యక్షురాలు ఇదీ చదవండి: బాబు బ్యాచ్ ఇళ్ల పట్టాలు ఆపారు.. ఓట్లకు వస్తే నిలదీయండి: సీఎం జగన్ -
చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి
-
చంద్రబాబు గతంలో హామీలిచ్చి మోసం చేశారు : సీఎం జగన్
-
చేనేతలకు వరం జగనన్న...
-
సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయాలు...చేనేత బతుకులు మారాయి
-
బైక్ ర్యాలీతో సీఎం జగన్ కు ఘన స్వాగతం...
-
నేడు చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి
-
లోకేష్ ఓటమికి మంగళగిరి సిద్ధం
-
Jana Sena Clash: ‘దక్షిణ’ నాదంటే నాదే!
సాక్షి, విశాఖపట్నం: జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు రసకందాయంలో పడింది. ఈ టికెట్ నాదంటే నాదని ఇద్దరు నాయకుల మధ్య వార్ జరుగుతోంది. ఈ సీటును కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజులతో పాటు మూగి శ్రీనివాస్‌లు ఆది నుంచీ ఆశిస్తున్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. జనసేన అభ్యర్థుల జాబితాల్లో విశాఖ దక్షిణ అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అయినా ఈ సీటును తనకే ఖరారు చేశారంటూ వంశీకృష్ణ స్వయంగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. వంశీ అభ్యర్థిత్వంపై దక్షిణం సీటును ఆశిస్తున్న ఈ ముగ్గురు నేతలూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. ‘వంశీ వద్దు.. స్థానికులే ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. కొద్దిరోజుల క్రితం ఒక మేకను తీసుకొచ్చి వంశీతో పోలుస్తూ ఈ సీటును బలి చేయొద్దని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో వంశీ వర్గీయులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జనసేన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో జనసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. వంశీ ఎన్నికల ప్రచారానికి వ్యతిరేక వర్గీయులు దూరంగా ఉంటున్నారు. మరోపక్క వంశీకృష్ణకు టికెట్ కేటాయింపు ప్రకటన వట్టిదేనని, అంతా బూటకమని కందుల బహిరంగంగానే చెబుతున్నారు. పవన్ ఆ సీటును తనకే ఖరారు చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. మంగళగిరికి కందుల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిసి విశాఖ దక్షిణ సీటు తనకే కేటాయించాలని కోరేందుకు కందుల నాగరాజు గురువారం మంగళగిరికి పయనమయ్యారు. వంశీకృష్ణకు సీటిస్తే ఓడిపోతారని, తనకిస్తే గెలుస్తానని చెప్పడానికి వెళ్లారు. సీటు ఇస్తారన్న హామీతోనే గతంలో జనసేనలో చేరానని, ఒకవేళ తనకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి గుడ్‌బై చెబుతానని పవన్‌కు స్పష్టం చేయనున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. మంగళగిరి పంచాయతీలో దక్షిణ టికెట్‌పై ఏం తేలుస్తారోనని జనసేన శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇవి చదవండి: ‘సైకిల్’ దొంగ దొరికాడోచ్! -
ఘనంగా మంగళగిరి శ్రీ పానకాల నరసింహ స్వామి రథోత్సవం (ఫోటోలు)
-
Mangalagiri : ఒకరిది ధీమా.. మరొకరిది ఆందోళన
ఒకరిది ప్రజా జీవితం.. మరొకరిది తెరవెనుక మంత్రాంగం.. ఒకరిది ధీమా.. మరొకరిది ఆందోళన.. ఒకరిది జనంతో మమేకమైన ప్రచారం.. మరొకరిది కార్పోరేట్ ప్రచారం. ఈ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎం. లావణ్య. మరొకరు నారా లోకేష్. వైఎస్సార్సీపీ నుంచి మంగళగిరి నియోజకవర్గం నుంచి లావణ్య పోటీకి దిగుతుండగా, అక్కడ టీడీపీ తరఫున నారా లోకేష్ బరిలో ఉన్నారు. వీరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అయిన లావణ్య తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లతో మమైకమవుతున్నారు. సామాన్యులతో కలిసిపోతూ ఎన్నికల ప్రచార హెరులో ముందు వరుసలో ఉన్నారు. జనంతో కలివిడిగా కలిసిపోతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వపు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు లావణ్య. వంద శాతం గెలుపు ధీమాతో ప్రచారాన్ని సాగిస్తున్న లావణ్య.. ప్రస్తుతం మెజార్టీ ఎంత అనే దానిపైనే కన్నేశారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌లో మాత్రం రోజు రోజుకు ఆందోళన ఎక్కువ అవుతోంది. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన లోకేష్‌కు మరొకసారి ఓటమి భయం వెన్నాడుతోంది. మంగళగిరిలో లోకేష్ జనంలోకి వెళ్లేదానికంటే ప్రైవేట్ మీటింగ్‌లతో సరిపెడుతున్నారు. ఓటర్లను గ్రూపులుగా విభజించడం, డబ్బులతో ఏ రకంగా కొనేయాలన్నదానిపై లోకేష్ సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. ఒకటి రెండు సార్లు జనంలోకి వెళ్లినా.. ప్రచారం మాత్రం సప్పగా సాగుతోందని స్థానికులంటున్నారు. కేవలం కార్పోరేట్ తరహా సమావేశాలు పెడుతూ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈ సారి విషమ పరీక్షే చంద్రబాబు నాయుడు కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్.. ఇప్పటివరకు ఏ ఎన్నికలోనూ గెలిచింది లేదు. గత ఎన్నికల్లో మంగళగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు లోకేష్. రాజకీయంగా ఆయన ఇప్పటికి సాధించిన అద్భుతాలు లేవు. లోకేష్‌ను ఏ రకంగానైనా ప్రమోట్ చేయాలన్న తాపత్రయంలో చంద్రబాబు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశాడు. అదేంటో గానీ.. జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం కాస్తా.. లోకేష్ సారథ్యంలో కనీసం తెలంగాణలో పోటీ కూడా చేయలేదు. మరే రాష్ట్రంలో పోటీ చేసే సత్తా గానీ, మద్ధతు గానీ లేదు. అయినా తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చెప్పుకోవడం, దానికి జాతీయ కార్యదర్శిగా లోకేష్‌ను ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకే చెల్లింది. ఈసారి బోలెడు అపశకునాల మధ్య మంగళగిరిలో భవిష్యత్తు కోసం లెక్కలేసుకుంటున్నాడు. తేడా వచ్చిందా.? హెరిటేజ్ పాలమ్ముకోవడం తప్ప మరో దారి లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. -
YSRCPలో చేరిన 100 కుటుంబాలు
-
మంగళగిరిలో టీడీపీ ‘కోడ్’ ఉల్లంఘన
మంగళగిరి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఓటర్లకు తాయిలాల రూపంలో బల్ల రిక్షాలు, తోపుడు బండ్లు, కుట్టుమిషన్లను పంపిణీ చేస్తోంది. ఈ పంపిణీ తతంగంపై అధికారులకు అనుమానం రాకుండా టీడీపీ నాయకులు వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. తయారు చేయించిన బల్ల రిక్షాలు, తోపుడు బండ్లను ఏదో ఒక ప్రాంతంలో ఉంచుతారు. ఆ ప్రాంతాన్ని ఓటర్లకు చెప్పి అక్కడకు వెళ్లి వాటిని తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పలువురు ఓటర్లు బండ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లి వాటిని తీసుకెళుతున్నారు. కుట్టుమిషన్లను టీడీపీ కార్యకర్తలే బైక్‌లపై పెట్టుకుని ఓటర్ల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తుండటం విశేషం. ఎన్నికల అధికారులు మరింత నిఘా పెంచి టీడీపీ ప్రలోభాలపర్వాన్ని అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
మహిళల శక్తి.. ఈ ముగ్గురికి మూడినట్టే
-
ప్చ్.. ఊరేదైనా మారని తీరు
-
ప్చ్.. ఊరేదైనా మారని తీరు
సాక్షి, గుంటూరు: ఊరేదైనా తీరు మాత్రం మారడం లేదు. సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు.. ఆ కుర్చీల్లో వచ్చి కూర్చోవాలంటూ జనాలకు నేతలు మైకుల్లో విజ్ఞప్తి చేయడాలు.. రిపీట్ అవుతున్నాయి. టీడీపీ సభలకు జనం పల్చగా వస్తుండడంతో.. తెలివిగా జనసేనతో కలిసి ఉమ్మడి సభల ప్లాన్ వేశారు చంద్రబాబు. కానీ, అక్కడా అదే ఫలితం కనిపిస్తోంది. మొన్న తాడేపల్లిగూడెం.. ఇవాళ మంగళగిరిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభకు జనం కరువయ్యారు. మూడు గంటలకు మీటింగ్ ప్రారంభం కాగా.. జనం లేక ఆరు గంటల దాకా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎదురు చూశారు. ఈలోపు ఇరు పార్టీల నేతలు మైకుల్లో జనాలు వచ్చి కుర్చీల్లో కూర్చోవాలంటూ బతిమిలాడుకున్నారు. అయినా జనం తరలిరాకపోవడంతో హాజరైన జనంతోనే సభను ప్రారంభించాల్సి వచ్చింది ఆ ఇద్దరు. మంగళగిరి సభలో.. చంద్రబాబు బుద్ధి బయటపడింది. పేరుకే అది బీసీ మీటింగ్ తప్ప.. నిర్వహణ మొత్తం పెత్తందారులకే అప్పగించారు. అందుకే చంద్రబాబు బుద్ధిని ముందే పసిగట్టిన బీసీ నేతలు.. ఆయన మోసాలు నమ్మేదీ లేదంటూ ఆ మీటింగ్ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అట్టర్‌ఫ్లాప్ దిశగా మంగళగిరి టీడీపీ-జనసేన సభ పరుగులు తీస్తోంది. -
మంగళగిరిలో రెండోసారి లోకేష్ ఓటమి పక్కా.. ఇదీ లెక్క
మంగళగిరి నియోజకవర్గంలో రెండోసారి ఓడిపోయేందుకు నారా లోకేశం రెడీ అవుతున్నారు. వైనాట్ 175లో మొదటి, రెండవ స్థానాల్లో ఉండేవి కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలే అని వైఎస్సార్సీపీ శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. కుప్పంలో చంద్రబాబును, మంగళగిరిలో లోకేష్‌ను ఓడించి తీరుతామని ఛాలెంజ్ చేసి చెబుతున్నారు. మంగళగిరి పార్టీ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యను వైఎస్ జగన్ నియమించారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక మంగళగిరి ముఖం చూడని లోకేష్ ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఎన్నికలు ప్రకటించకముందే లోకేష్ ఓటమి ఎందుకు కన్ఫర్మ్ అయిపోయింది? గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండోసారి ఓడిపోవడానికి రెడీ అవుతున్నారనే టాక్ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యను పార్టీ అధినేత వైఎస్ జగన్ నియమించారు. మంగళగిరి రాజకీయాల్లో రెండు ముఖ్యమైన కుటుంబాలకు వారసురాలైన లావణ్య విజయం ఖాయం అయిపోయిందని పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. లావణ్య తల్లి కాండ్రు కమల, మామయ్య మురుగుడు హనుమంతరావులు గతంలో మంగళగిరి ఎమ్మెల్మేలుగా గెలిచినవారే. మురుగుడు హనుమంతరావు దివంగత నేత వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. హనుమంతరావు, కమల ఇద్దరూ కూడా మంగళగిరి మున్సిపల్ చైర్ పర్సన్స్‌గా కూడా పనిచేశారు. దీంతో వీరిద్దరికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ, మంగళగిరి పట్టణంలోనూ పూర్తి స్థాయిలో పట్టు ఉంది. పైగా నియోజకవర్గం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుంచి పటిష్టంగా నిర్మాణమైంది. రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. మంగళగిరిని మున్సిపాలిటీ స్థాయి నుంచి తాడేపల్లితో కలిపి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడంలో ఆళ్ల కీలకపాత్ర పోషించారు. మంగళగిరిలో చేనేత సామాజికవర్గం బలంగా ఉండటంలో ఈసారి బీసీకి ఇక్కడి సీటు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ నిర్ణయించారు. నియోజకవర్గంలో దాదాపు లక్ష వరకు చేనేత వర్గం ఓట్లు ఉన్నట్లు అంచనా. ఈ విషయం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ముఖ్యమంత్రి తెలియచేశారు. వైఎస్ జగన్ నిర్ణయంతో కొంత మనస్తాపానికి గురైన ఆళ్ల ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా సమర్పించారు. కేవలం వ్యక్తిగత కారణాలవల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొద్ది రోజులకే ఆయన పరిస్థితులు అర్థం చేసుకుని తిరిగి వైఎస్ జగన్ చెంతకు వచ్చేశారు. మంగళగిరి సీటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున బీసీ అభ్యర్థిని గెలిపిస్తానని ప్రకటించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇదిలా ఉంటే గత డిసెంబర్లో మంగళగిరి సమన్వయకర్తగా ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవిని నియమించారు. కాని చిరంజీవి కంటే మురుగుడు లావణ్య అభ్యర్థిత్వం బెటర్ అని తేలడంతో ఆయనకు నచ్చచెప్పి లావణ్యను సమన్వయకర్తగా ప్రకటించారు. నారా లోకేష్‌ను ఓడించి లావణ్యను గెలిపించి తీరుతామని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి ప్రకటించారు. నారా లోకేష్ ఇక మంగళగిరి నుంచి సామాన్లు సర్దుకుని వెళ్లిపోవచ్చంటూ సెటైర్లు పేలుతున్నాయి. రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆళ్ల ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం నియోజకవర్గం అంతా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయిన తర్వాత టీడీపీ నేత నారా లోకేష్ ఇటీవల వరకు నియోజకవర్గం ముఖం చూడలేదు. కోవిడ్ సమయంలో లోకేష్ భయపడి హైదరాబాద్‌కు పారిపోయారు. రెండేళ్ల పాటు అసలు మంగళగిరి రానేలేదు. అప్పుడు, ఇప్పుడూ కూడా లోకేష్ ఏనాడూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే అసంతృప్తి టీడీపీ శ్రేణుల్లో గట్టిగా ఉంది. పైగా తాను లేనపుడు మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతల్ని తన సామాజికవర్గ నేతలకే అప్పగించారు గాని..నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీ వర్గాలను పట్టించుకోలేదు. కాని కమ్మ నేతలు ఎప్పుడూ బీసీ, ఎస్సీ నేతలను లెక్కచేయరని, వారు కూడా కమ్మ నేతలనే దగ్గరకు రానిస్తారనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. దీంతో మంగళగిరిలోని టీడీపీ కార్యకర్తల్లో లోకేష్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తాను పోటీ చేయదలచుకున్న నియోజకవర్గం గురించి సీరియస్‌గా లేకపోవడం, బీసీ నేతలకు అందుబాటులో లేకపోవడం, ఇటీవలవరకు అసలు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించుకోలేకపోవడంతో మంగళగరిలోని టీడీపీ కేడర్ క్రమంగా పార్టీకి దూరం అవుతోంది. కొద్ది రోజుల క్రితమే మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తున్నట్లు టీడీపీ, జనసేన తొలి జాబితా ద్వారా వెల్లడైంది. మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం సభల ఉత్సాహంతో ప్రజల్లో దూసుకుపోతున్నారు. నియోజకవర్గం నలుదిక్కులా పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారు. తాజా పరిణామాలతో ఇక నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడానికి మానసికంగా సిద్ధం కావాలని సూచిస్తున్నారు. -
సీఎం జగన్ అధ్యక్షతన ‘మేం సిద్ధం.. మా పోలింగ్ బూత్ సిద్ధం’ మీటింగ్ (ఫొటోలు)
-
మంగళగిరిలో వైఎస్సార్సీపీ కీలక సమావేశం
-
సీఎం జగన్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం
-
క్లీన్ స్వీపే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు వేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు మంగళవారం దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ‘మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం’ పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయ కన్వీనర్లు సహా 2,700 మందికిపైగా నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. సీకే కన్వెన్షన్ సెంటర్లో ఈ సమావేశం ఏర్పాట్లను సోమవారం వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతరులు కూడా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ దూకుడు రాష్ట్రంలో గత 58 నెలలుగా రాష్ట్రంలోని ప్రతి పేదింటి భవిష్యత్తును గొప్పగా మార్చేలా సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తుండటంతో వైఎస్సార్సీపీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఇది ప్రతిబింబించింది. సుపరిపాలన వల్ల ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్లీన్ స్వీపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని 2022 మే 11న ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి వైఎస్సార్సీపీ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతోంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పట్టారు. గత నెల 27న భీమిలి వేదికగా ఎన్నికలకు ‘సిద్ధం’ అంటూ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల శంఖం పూరించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూకుడు మరింత పెంచాయి. వచ్చే నెల 3న పల్నాడు ప్రాంతంలో పిచ్చికలగుడిపాడు ‘సిద్ధం’ చివరి సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు సిద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. గత 58 నెలలుగా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలనను ప్రతి గడపకూ తీసుకెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా మేం సమర్థవంతమైన టీమ్‌ను సిద్ధం చేసుకున్నాం. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం చేసిన మంచిని మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టడం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం నిర్వహించే కీలక సమావేశంలో నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. మేం సమన్వయకర్తలను నియమించేటప్పుడు ఏదో జరిగిపోతున్నట్లుగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. కానీ.. సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న నమ్మకంతో వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. టీడీపీ–జనసేన కూటమి అతుకులబొంత అని సీట్ల సర్దుబాటులోనే స్పష్టమైంది. పవన్‌ను అనుసరిస్తున్న శ్రేణులను ఘోరంగా అవమానిస్తూ చంద్రబాబు జనసేనకు 24 సీట్లు పడేశారు. ఆ రెండు పార్టీల్లో అసంత్పప్తి పెల్లుబుకుతోంది. టీడీపీ, జనసేన అసంతృప్త నేతలు గంపగుత్తగా వైఎస్సార్సీపీలో చేరుతామంటున్నారు. కానీ.. మేం ఎవరిని పడితే వారిని చేర్చుకోం. వారి వల్ల అనవసరమైన తలనొప్పులు. అవకాశం ఉన్న చోట మాత్రమే ఆ పార్టీల నేతలను చేర్చుకుంటాం. -
మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్(ఎయిమ్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు భారతి ప్రవీణ్ పవార్, ప్రహ్లాద్ జోషి, మంత్రి విడదల రజని, ఎంపీ జీవీఎల్ నరసింహరావు పాల్గొన్నారు. రూ.1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌తో పాటు రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రధాని ప్రారంభించారు. అలాగే ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌లో భాగంగా రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిలో ప్రధానంగా వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో రూ.23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్ కేర్ బ్లాకుల్ని నిర్మించనున్నారు. మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌తో పాటు రాజ్‌కోట్ (గుజరాత్), రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్), బఠిండా (పంజాబ్), కల్యాణి (పశ్చిమబెంగాల్) నగరాల్లో ఎయిమ్స్ ఆస్పత్రులను కూడా ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఇదీ చదవండి: అసలు ముద్రగడ, పవన్ మధ్య ఏం జరిగింది? -
నేడు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్(ఎయిమ్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు. రూ.1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌తో పాటు రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌లో భాగంగా రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. వీటిలో ప్రధానంగా వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో రూ.23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్ కేర్ బ్లాకుల్ని నిర్మించనున్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకోండి స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు ఎయిమ్స్ పరిపాలన భవన్లో శనివారం అధికారులతో సమీక్షించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, డాక్టర్ భారతీప్రవీణ్ పవార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ పాల్గొంటారని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని కృష్ణబాబు సూచించారు. అనంతరం ఎయిమ్స్ ప్రాంగణంలోని సభా వేదికను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్షలో ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ (ట్రైనింగ్–నేకో) నిధి కేసర్వాని, ఎయిమ్స్ డైరెక్టర్, సీఈవో డాక్టర్ మధబానందకర్ తదితరులు పాల్గొన్నారు. -
మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపుకు నేను పనిచేస్తా: ఎమ్మెల్యే ఆర్కే
-
సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు
-
చీరాల టీడీపీలో లోకేష్ చిచ్చు !
చీరాల: నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చీలికలు, పేలికలుగా మారింది. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు ప్రత్యేక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓ వర్గానికి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న ఏలూరి సాంబశివరావు పరోక్షంగా మద్దతు తెలపడంతో విభేదాలు కాస్త వేరు కుంపట్లకు దారితీసింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి ఎంఎం కొండయ్య రెండేళ్లు అవుతుంది. ఆయన పార్టీ కార్యక్రమాలు ఇన్చార్జి హోదాలో చేస్తున్నప్పటికీ పోటీ కార్యక్రమాలు, కుల సమావేశాలు చేస్తుండడంతో తాను పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టి పార్టీని నిలబెడుతున్నానని, కాని అధినేతతో పాటు పార్టీ అధిష్టానం చీరాలలో ఎటూ తేల్చకుండా వర్గ విభేదాలను ఫుల్స్టాప్ పెట్టకపోడంతో ఆయన పార్టీ నాయకుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంత సామాజిక వర్గం నుంచి.. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీకి చెందిన సొంత సామాజికవర్గం రంగంలోకి దిగింది. చీరాల సీటు కారంచేడుకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎన్ఆర్ఐకు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. దీనిలో అసలు పార్టీ క్యాడర్ దూరమై సతమతమవుతుంటే పోటీ కార్యక్రమాలు టీడీపీని అతలాకుతలం చేస్తున్నాయి. అలానే చీరాలలో టీడీపీ సీటు ఆశిస్తున్న ఆశావహులకు పొన్నూరుకు చెందిన ఓ వ్యక్తి లోకేష్‌కు అంతరంగికుడినంటూ లోకేష్ ద్వారా సీటు ఇప్పిస్తానని చీరాలలోని ఆశావహుల వద్ద కోటి రూపాయల వరకు వసూలు చేశారు. ఆశపడిన ఆశావహులు అతడికి ఎక్కువ మొత్తంలో నగదు ముట్టజెప్పారు. పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో జరిగే ‘రా కదిలిరా..’ కార్యక్రమంలో చీరాల సీటుపై చర్చ జరిగే అవకాశం ఉంది. చీరాల సీటుపై లోకేష్ చిచ్చు.. చీరాల, మంగళగిరి సీట్లుకు లింకు కాస్త చీరాలలో టీడీపీలో కులాల కుమ్ములాట్లకు దారితీసింది. లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండడంతో అక్కడ చేనేతలు అధికంగా ఉండడంతో అక్కడ ఎలాగైనా గట్టెక్కేందుకు లోకేష్ చీరాల సీటును ఎరగా వేస్తున్నారు. తాను మంగళగిరిలో పోటీ చేస్తుండడంతో చేనేతలలోనే దేవాంగులకు గాని, పద్మశాలీయులకు గాని ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు లోకేష్‌ను కలుస్తున్న చేనేత నాయకులకు భరోసా ఇస్తున్నారు. పార్టీ అధినేత మాత్రం ప్రస్తుతం బీసీలకు ఇవ్వాలని అనుకుంటుండగా చీరాలలో చేనేతలకు సీటు ఇస్తే తాను మంగళగిరిలో బయటపడతానని లోకేష్ అంటున్నట్లుగా సమాచారం. దీంతో కొంత కాలంగా చీరాలలో చేనేత వర్గానికి చెందిన డాక్టర్ సజ్జా హేమలత, మునగపాటి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ మాజీ గుద్దంటి చంద్రమౌళి, మంగళగిరి ప్రాంతానికి చెందిన కాండ్రు శ్రీనివాసరావు, చాట్రాసి రాజేష్, చీరాలలో ఇప్పటికే తమ సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. లోకేష్‌ను తరచూ కలుస్తున్నారు. సీటు నాకంటే నా అంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే డీఎస్పీగా పనిచేస్తూ ప్రస్తుతం సెలవులో ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన కొమ్మనబోయిన నాగేశ్వరరావు గత రెండు నెలలుగా చీరాల నియోజకవర్గంలో తిరుగుతూ యాదవ గ్రామాల్లో పర్యటిస్తూ తానే పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఈ తతంగం జరుగుతున్నప్పటికీ పార్టీ అధిష్టానం చీరాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఇన్చార్జిగా ఉన్న ఎంఎం కొండయ్య కూడా పూర్తి అసహనంగా ఉంటున్నారు. ఇక లాభం లేదని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. -
మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళన
గుంటూరు, సాక్షి: మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. తాడికొండ అసెంబ్లీ సీట్లు మాదిగలకే కేటాయించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఒకవేళ తాడికొండ(గుంటూరు) సీటును మాదిగలకు ఇవ్వకపోతే తగిన బుద్ధి చెప్తామని మాదిగ నాయకులు టీడీపీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్‌ను టీడీపీ అధిష్టానం ఈ మధ్యే నిర్ణయించింది. అయితే అది ఏకపక్షంగా జరిగిన ప్రకటన అంటూ మాదిగ నేతలు రంగంలోకి దిగారు. ఆ సీటు తమ సామాజిక వర్గానికే ఇవ్వాలంటూ నిరసనకు దిగడం చంద్రబాబుకు ఊహించని షాక్ అనే చెప్పాలి. సీనియర్ నేత టీడీ జనార్ధన్ ప్రస్తుతం వాళ్లను బుజ్జగించే యత్నం చేస్తున్నారు. -
మంగళగిరిలో లోకేశ్ ఓటమి తథ్యం
మంగళగిరి/తాడేపల్లి రూరల్: గడిచిన రెండు దఫాలుగా మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ సీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నారా లోకేశ్ ఓటమి తథ్యమన్నారు. మంగళగిరిలో వైఎస్సార్ సీపీ నుంచి వెనుకబడిన సామాజిక వర్గానికి (చేనేత) చెందిన వ్యక్తి పోటీలో నిలబడుతున్నారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు వైఎస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గంలో బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించుకుంటారని, అలాగే రాబోయే ఎన్నికల్లో ఆయా వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌ను మరోమారు ముఖ్యమంత్రి చేస్తారని నమ్మకంగా చెప్పారు. మంగళగిరిలో మిద్దే సెంటర్లో నిర్వహించే సామాజిక సాధికార యాత్ర మహాసభకు ముందు పెద్దఎత్తున పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. ఈ పాదయాత్రలో కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు, దళిత సోదర సోదరీమణులు పాల్గొనాలని, మహాసభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కాంగ్రెస్ చనిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడో చనిపోయిందని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విడగొట్టి, ఏపీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని అన్నారు. రాబోయే తరాలకు సైతం ఆ పార్టీ తీరని ద్రోహం చేసిందన్నారు. ఆ పార్టీ ఏపీకి చేసిన ద్రోహాన్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ క్షమించరని, కాంగ్రెస్ పార్టీ చరిత్రపుటల్లో కలిసిపోయిందని అన్నారు. ఈ బస్సుయాత్ర ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ పరిశీలకుడు రాపాక శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలసి విజయసాయిరెడ్డి పరిశీలించారు. 24 గంటల్లో సమస్య పరిష్కారం విజయసాయిరెడ్డి చొరవతో తెనాలి–మంగళగిరి రహదారికి ఆర్అండ్బీ శాఖ అధికారులు మంగళవారం మరమ్మతులు చేపట్టారు. విజయసాయిరెడ్డి సోమవారం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న తెనాలి–మంగళగిరి రహదారి విషయాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి చొరవ తీసుకోవడంతో అధికారులు 24 గంటల్లోనే రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఐదారు రోజుల్లో మరమ్మతు పనులు పూర్తవుతాయని ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించిన ఎంపీ విజయసాయిరెడ్డికి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
మంగళగిరిలో వైఎస్సార్ సీపీదే విజయం
తాడేపల్లి రూరల్ : మంగళగిరిలో వైఎస్సార్ సీపీదే విజయం అని, మరింత మెజార్టీ వచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు ఒక లక్ష్యంగా పని చేయాలని రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శనివారం ఎంటీఎంసీ అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి అధ్యక్షతన దుగ్గిరాల మండలంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. ఇక్కడ పెత్తందార్లు ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి బీసీ వర్గానికే సీటు కేటాయించాలని నిర్ణయించి వారినే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మరోసారి విజయం సాధించడమే కాకుండా అత్యధిక మెజార్టీ వచ్చే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. గతంలో కొంతమంది పార్టీ నాయకులకు న్యాయం జరగలేదని, వారిని సైతం కలుపుకోవాలని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కార్యాచరణ రూపొందించుకుని రాబోయే మూడు నెలల్లో పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వడ్డేశ్వరపు రజనీకాంత్, జిల్లా డైరెక్టర్ పిల్లి రాఘవులు, జమ్ముల లోకేష్, దుగ్గిరాల వైఎస్సార్సీపీ నాయకుడు ఆళ్ల మహేష్, సర్పంచులు గంగాధరరావు, యస్‌కె. బాషా, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పోటీలో మెరిసిన మంగళగిరి చీర
-
చేనేత కార్మికుడు నాగరాజుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అరుదైన కానుక అందింది. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ది అందని అర్హులకు.. లబ్ది చేకూర్చే కార్యక్రమంలో సీఎం జగన్‌కి మంగళగిరికి చేనేత కార్మికుడు మురుగుడు నాగరాజు పట్టు వస్త్రాలు అందించారు. తాను స్వయంగా నేసిన చేనేత చీరను సీఎం జగన్ చేతికి అందించారు. ఈ కానుకను ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతికి అందించాలని నాగరాజు కోరారు. ఈ సందర్భంగా నాగరాజు నైపుణ్యాన్ని చూసి సీఎం జగన్ అభినందించారు. -
లోకేష్‌కూ అనుమానమే.. మంగళగిరి నుంచి పోటీకి దూరమేనా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది. సీట్ల కేటాయింపులపై ఇప్పటికీ ఏమీ తేల్చకపోవడం, మరోవైపు వైఎస్సార్సీపీలో జరిగిన మార్పులతో తాము కూడా అభ్యర్థులను మార్చాలని అధిష్టానం ఆలోచన చేస్తుండటంతో సీటు ఆశిస్తున్న నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాలో పొన్నూరు తప్ప అన్ని నియోజకవర్గాలలో అస్పష్టత కొనసాగుతోంది. పొన్నూరులో కూడా ధూళిపాళ్లను ఎంపీగా పంపిస్తారనే ప్రచారం సాగుతోంది. గుంటూరు నగరానికి వస్తే మూడు వర్గాలు, ఆరు గ్రూపులుగా పార్టీ చీలిపోయింది. రెండు నియోజకవర్గాలలో ఇన్చార్జులను కాదని కొంతమంది నేతలు సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం, వారు బహిరంగంగానే గొడవలకు దిగడం పరిపాటిగా మారింది. లోకేష్‌కూ అనుమానమే మంగళగిరిలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కే స్థానంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్చార్జిగా ప్రకటించడంతో తెలుగుదేశం ఆలోచనలో పడింది. నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని చెబుతున్నా, చివరి నిముషంలో ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చని మంగళగిరి పార్టీ నేతలు చెబుతున్నారు. పశ్చిమలో కోవెలమూడి వర్సెస్ ఉయ్యూరు గుంటూరు పశ్చిమలో నియోజకవర్గ ఇన్చార్జిగా కోవెలమూడి రవీంద్ర(నానీ) ఉండగా, అతనికి పోటీగా ఎన్ఆర్ఐలు మన్నవ మోహనకృష్ణ, ఉయ్యూరు శ్రీనివాస్, నియోజకవర్గ నేతలు డాక్టర్ నిమ్మల శేషయ్య, తాళ్ల వెంకటేష్ యాదవ్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో తమ సొంత ప్రచారం సాగిస్తున్నారు. చివరి నిముషంలో పొత్తులో తెనాలి జనసేనకు ఇస్తే మాజీ మంత్రి ఆలపాటి రాజాను రంగంలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి గుంటూరు పశ్చిమ బాధ్యతలు వైఎస్సార్ సీపీ అప్పగించడంతో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి బదులుగా గుంటూరు పశ్చిమలో పోటీ చేయిస్తారన్న ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం–జనసేన మధ్య ‘తెనాలి’ రగడ తెనాలిలో తెలుగుదేశం–జనసేన మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. ఈ సీటు తమకే కావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా పట్టుపడుతున్నారు. జనసేన తరపున తాను తెనాలి నుంచి పోటీ చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ ఇప్పటికే పలుమారు ప్రకటించుకున్నారు. ఆలపాటి రాజా పేద యువతుల వివాహానికి మంగళసూత్రం ఉచితంగా ఇస్తున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మిచాంగ్ తుఫాన్ బాధిత రైతుల పరామర్శ కోసం చంద్రబాబునాయుడు వచ్చినప్పుడు ఆయన బలప్రదర్శన చేశారు. మరోవైపు రోజు మార్చి రోజు నాదెండ్ల మనోహర్ ఇక్కడే ప్రెస్‌మీట్ పెడుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. రైతు సమస్యలు, వ్యాపారుల సమస్యలపై నేరుగా వెళ్లి వారిని కలుస్తున్నారు. తాడికొండలో శ్రావణ్‌కు పొగ రాజధాని ప్రాంతమైన తాడికొండలో ప్రస్తుతం ఇన్చార్జిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న తెనాలి శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా తొలినుంచి ఓ వర్గం పావులు కదుపుతుంది. అందులో భాగంగా గత ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు ఎదుట వారు శ్రావణ్‌కుమార్‌కు సీటు ఇవ్వకుండా శతవిధాలా అడ్డుపడ్డారు. దీంతో శ్రావణ్‌కుమార్‌ను బాపట్ల ఎంపీగా, అక్కడ ఎంపీగా పోటీ చేసిన మాల్యాద్రిని ఇక్కడకు సీటు కేటాయించగా శ్రావణ్‌కుమార్ వర్గం కూడా గట్టిగా పట్టుబట్టడంతో తిరిగి ఎక్కడ వారిని అక్కడే ఉంచేశారు. ఇప్పుడు కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన గేరా రవిబాబు, తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామానికి చెందిన తోకల రాజవర్థన్‌లు సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజవర్ధన్‌కు రాయపాటి వర్గం అండగా నిలబడింది. ప్రత్తిపాడులో ఆర్.ఆర్. రగడ ప్రత్తిపాడులో ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ బి.రామాంజనేయులును పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయనకు మద్దతుగా ఉన్న మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య పెత్తనాన్ని కూడా వారు వ్యతిరేకించడంతోపాటు బహిరంగంగానే తమ అసమ్మతిని బయటపెడుతున్నారు. పెదనందిపాడు, గుంటూరు రూరల్‌లో కూడా రామాంజనేయులు అనుకూల, వ్యతిరేకవర్గాలు బాహాబాహీకి దిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రత్తిపాడు, తాడికొండలలో ప్రస్తుతం ఇన్చార్జులుగా ఉన్న వారి సామాజిక వర్గాలకు చెందిన నేతలనే వైఎస్సార్సీపీ ఇన్చార్జులుగా ప్రకటించడంతో ప్రత్తిపాడు, తాడికొండలలో కూడా అభ్యర్థులను మార్చేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తూర్పులో హెచ్చరికలు, కొట్లాటలు గుంటూరు తూర్పులో నియోజకవర్గ ఇన్చార్జిగా మహ్మద్ నసీర్ ఉండగా, అతనికి పోటీగా గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, సయ్యద్ ముజీబ్ సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. నసీర్, ముజీబ్ గ్రూపుల మధ్య గొడవలు పెరిగి పోలీసు స్టేషన్ మెట్లెక్కే పరిస్థితి ఇరుగ్రూపుల మధ్య నెలకొంది. మరోవైపు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జిగా నసీర్ అహ్మద్ తీరుపై కార్యకర్తలు, నాయకుల్లో పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎంపీ అభ్యర్థి కోసం వెతుకులాట ఇక ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ అసలు పూర్తిగా నియోజకవర్గాన్ని వదిలిపెట్టేశారు. నియోజకవర్గానికి వచ్చి కూడా సంవత్సరాలు దాటిపోతుండటం, మళ్లీ పోటీ చేసే ఉద్దేశం లేకపోవడంతో ఎంపీ అభ్యర్థి కోసం కూడా వెతుకులాటలో ఉంది. ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్ నేతలు ఎంపీగా రావడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బయట వ్యక్తులను తీసుకువచ్చే ప్రయత్నాలలో ఆ పార్టీ ఉంది. -
మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
సాక్షి, గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా చేశారు. సోమవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ‘‘స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖను ఇచ్చా. నా రాజీనామాను ఆమోదించాలని కోరాను. వ్యక్తిగత కారణాలతోనే వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నా. 2014 నుంచి రెండుసార్లు మంగళగిరి నుంచి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. నీతి నిజాయితీతో ధర్మంగా శాసనసభ్యుడిగా పనిచేశా’’ అని తెలిపారాయన. .. 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నా అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ కోసం పనిచేశా. 2004లో కాంగ్రెస్ నుంచి సత్తెనపల్లి సీటు ఆశించాను. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వలేదు. 2009లో పెదకూరపాడు సీటును ఆశించాను. కానీ దక్కలేదు. రెండు సార్లు సీటు రాకపోయినా కాంగ్రెస్ కోసం పనిచేశా’’ ఆయన గుర్తు చేసుకున్నారు. పర్సనల్‌గా మాట్లాడతా.. స్పీకర్ తమ్మినేని ఆర్కే రాజీనామా పరిణామంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఆర్కే రాజీనామా లేఖ అందిందని, అ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని తెలిపారు. అలాగే ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సి ఉందని, ఆపై రాజీనామా లేఖ సరైన ఫార్మట్‌లో ఉందా? లేదా? అనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారు. అలాగే.. అసంతృప్తితోనే ఆర్కే రాజీనామా చేశారన్న ప్రచారాన్ని స్పీకర్ తమ్మినేని ఖండించారు. అలా అసంతృప్తితో ఉంటే సీఎం జగన్‌తో సన్నిహితంగా ఎందుకు ఉంటారని ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారాయన. -
ఒక రైతు గా చెప్తున్నా.. ఎవరు బాధపడకండి..ఎమ్మెల్యే ఆర్కే భరోసా
-
సాహితీ కన్స్ట్రక్షన్ కంపెనీ భారీ మోసం
మంగళగిరి: సినీ నటులతో బ్రోచర్లు ప్రారంభం.. కార్పొరేట్ తరహాలో ప్రకటనలు.. సినీ నటుల సమక్షంలోనే ప్లాట్ల కేటాయింపు.. ఇంధ్రభవనాలను తలపించేలా గ్రాఫిక్స్ తదితర ప్రచారా్రస్తాలతో హోరెత్తించిన ఓ సంస్థ కొనుగోలుదారులకు భారీ ఎత్తున శఠగోపం పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో 15 వందల మంది కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఈ సంస్థ.. గుంటూరు జిల్లా కాజా వద్ద కూడా వెంచర్ వేసి మోసం చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన వెలుగుజూచింది. వివరాల్లోకి వెళితే.. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బూదాటి లక్ష్మీ నారాయణ హైదరాబాద్‌లోనూ, మంగళగిరి మండలం కాజా వద్ద వెంచర్ వేశారు. పలువురు సినీ నటులతో ప్రచారం చేయడం, సినీ నటులు ప్లాట్లు కొన్నట్లుగా చెప్పడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలు, హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కొనుగోలుదారులు ప్లాట్లు, విల్లాస్‌ను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ముప్పు తిప్పలు.. హైదరాబాద్‌కు చెందిన పి. శ్రీధర్ అనే వ్యక్తి తన కుమార్తెల కోసం రెండు విల్లాలు కొనుగోలు చేసేందుకు రూ.కోటీ 80 లక్షలు చెల్లించారు. త్వరలోనే విల్లాలు పూర్తి చేసి అప్పగిస్తామని డబ్బులు తీసుకునేటప్పుడు చెప్పిన లక్ష్మీనారాయణ కనీసం స్థలాలను కూడా కొనుగోలు దారుల పేరిట రిజిస్టర్ చేయలేదు. 2020జూన్‌లో బాధితులు లక్ష్మీనారాయణను కలిసి రిజి్రస్టేషన్ అన్నా చేయాలని.. లేనిపక్షంలో డబ్బులు తిరిగి చెల్లించాలని కోరగా.. రెండు ప్రామిసరీ నోట్లు, రూ.90 లక్షల చొప్పున రెండు యూనియన్ బ్యాంకు చెక్కులను ఇచ్చి 2022 అక్టోబర్‌లో బ్యాంకులో వేసుకోమని చెప్పారు. అయితే ఆ రెండు చెక్కులు బౌన్స్ కావడంతో బాధితులు లక్ష్మీనారాయణ కోసం హైదరాబాద్ వెళ్లారు. అయితే ఇలానే పలువురిని మోసగించిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అప్పటికే లక్ష్మీనారాయణను అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇస్తానంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. సాహితీ సంస్థకు చెందిన వెంచర్‌ను ఆయన బంధువు బుచ్చిబాబు హాలాయుధా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో నడుపుతున్నట్లు తెలుసుకున్న బాధితులు అతనిని సంప్రదించారు. గతంలో జరిగిన లావాదేవీలకు తనకు సంబంధం లేదంటూ సమాధానం ఇవ్వడంతో బాధితులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కాగా, ఈ సంస్థ ప్రతినిధులు గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు తెలుగుదేశం నేతలకు వాటాలు ఇవ్వడంతో పాటు 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేశ్ ఎన్నికలకు సైతం భారీ మొత్తంలో చందాలిచ్చినట్లు తెలుస్తున్నది. -
స్కిల్ స్కామ్ కేసులో వెలుగు చూసిన మరిన్ని వాస్తవాలు
-
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు
-
టీడీపీ ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, గుంటూరు: మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి నేర దర్యాప్తు విభాగం(CID) నోటీసులు జారీ చేసింది. పార్టీ అకౌంట్లో జమ అయిన నగదు వివరాల్ని కోరుతూ సీఐడీ ఆ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు టీడీపీ జనరల్ సెక్రటరీతో పాటు ట్రెజరర్ పేరిట సీఐడీ ఆ నోటీసుల్ని జారీ అయినట్లు సమాచారం. పార్టీ అకౌంట్లోకి వచ్చిన రూ. 27 కోట్ల వివరాలు కావాలి అని నోటీసుల్లో పేర్కొంది సీఐడీ. ఈ నెల 18వ తేదీన సీఐడీ కార్యాలయానికి వివరాలతో రావాలంటూ ఆ ఇద్దరికి నోటీసుల్లో సీఐడీ సూచించింది. ఇదిలా ఉంటే.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి మళ్లిందనే అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను సీఐడీ, ఏసీబీ కోర్టుకు ఇంతకు ముందే సమర్పించింది కూడా. అంతేకాదు.. ఈ కేసులో టీడీపీ అడిటర్‌ను విచారించాల్సిన అవసరమూ ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది కూడా. -
వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్.. స్లోవేనియాకు వెళ్లనున్న గుంటూరు అమ్మాయి
స్లోవేనియా వేదికగా జరగనున్న వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్ పోటీల్లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మస్ పాల్గోనుంది. కాగా అల్మస్ 57 కేజీ విభాగంలో పోటీ పడనుంది. ఈ ఈవెంట్ కోసం ఆమె ఆదివారం(ఆక్టోబర్29) స్లోవేనియాకు పయనం కానుంది. ఈ విషయాన్ని అల్మస్ కోచ్ ఎస్కే సందాని తెలియజేశారు. ఈ ఛాంపియన్ షిప్లో అల్మస్ కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. కాగా ఈ వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్ పోటీలలో భారత్ నుంచి నలుగురు లిఫ్టర్స్ పాల్గోనున్నారు. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు వెళ్తున్న సాదియా అల్మస్కు ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మద్ది ప్రభాకారరావు, కార్యదర్శి సకల సూర్యనారాయణ ఆల్‌ది బెస్ట్ తెలియజేశారు. ఈ సందర్భంగా షేక్ సాదియా మాట్లాడుతూ..వరల్డ్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొనటానికి అర్హత సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. అవకాశం కల్పించిన పవర్ లిఫ్టింగ్ ఇండియా అధ్యక్షులు సతీష్ కుమార్ గారికి , కార్యదర్శి పీజీ జోసప్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారికి, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పోటీలో పతకం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తానని ఆమె పేర్కొంది. చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. సిరాజ్‌కు నో ఛాన్స్! జట్టులోకి సీనియర్ ఆటగాడు -
నవులూరు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రెడీ
మంగళగిరి: గుంటూరు జిల్లా నవులూరు అమరావతి టౌన్షి ప్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు రెడీ అయ్యింది. మూడేళ్ల కిందట నిర్మాణం పూర్తి చేసుకున్నా నిధుల కొరతతో ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు తదితర తుదిదశ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బీసీసీఐ నుంచి నిధులు విడుదల కావడంతో తొలి విడతగా రూ.15 కోట్లతో స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు వేగంగా పూర్తి చేయించి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడుగులు వేస్తోంది. ఈలోపు ఈ సీజన్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు ట్రోఫీల నిర్వహణకు బీసీసీఐ అనుమతులు ఇవ్వగా, మ్యాచ్‌ల నిర్వహణకు అన్ని రకాల వసతులు కల్పించారు. ఈ నెల 12 నుంచి పురుషుల అండర్–19 వినూ మన్కడ్ ట్రోఫీ జరుగనుంది. ఇక్కడ 15 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, ఉత్తరాఖండ్, మేఘాలయ జట్లు తలపడనున్నాయి. అలాగే ఈ ఏడాది డిసెంబర్లో విజయ్ మర్చంట్ ట్రోఫీ నిర్వహించనున్నారు. 15 మ్యాచ్‌ల ఈ ట్రోఫీలో ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్ జట్లు తలపడనున్నాయి. అలాగే 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో మహిళల అండర్–23 వన్ డే ట్రోఫీ కోసం 21 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఉత్తరాఖండ్, బరోడా, విదర్భ, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి జట్లు తలపడనున్నాయి. మూడు ట్రోఫీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి అనంతరం అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణకు ఏసీఏ సన్నాహాలు చేస్తోంది. త్వరలో అంతర్జాతీయ మ్యాచ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ నెల 12 నుంచి రానున్న ఆరు నెలల కాలంలో మూడు ట్రోఫీలకు సంబంధించిన 51 మ్యాచ్‌లు ఇక్కడ జరగనున్నాయి. త్వరలోనే బీసీసీఐ బృందం పర్యటించి అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణకు అవసరమైన సూచనలు చేసే అవకాశం ఉంది. – ఎస్ఆర్ గోపీనాథ్‌రెడ్డి, ఏసీఏ కార్యదర్శి -
వైఎస్ఆర్సీపీ నాయకురాలు కృష్ణవేణి దంపతులపై దాడి
-
మంగళగిరిలో బరి తెగించిన టీడీపీ, జనసేన నేతలు
-
వైఎస్ఆర్సీపీ నాయకురాలు కృష్ణవేణి దంపతులకు లోకేష్ టీం వార్నింగ్
-
ఆఫీసర్లు వద్దన్నా కడుతున్నారు లోకేష్ హోర్డింగ్‌లు
-
పవన్ కొత్త కలరింగ్.. చంద్రబాబు కూడా అదే దారిలో..
ప్రవాసాంధ్రుడు పవన్ కల్యాణ్ సరికొత్త నాటకానికి తెరలేపారు. ఎపీవాసినని చెప్పుకోవడానికి జనసేన ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి మంగళగిరికి తరలించారు. తాను ఏపీలోనే ఉంటున్నట్లు కలరింగ్ ఇవ్వడం కోసమే ఆఫీస్‌ను మార్చారని జనసేన వర్గాలే చెబుతున్నాయి. ప్రవాసాంధ్రుడి ముద్ర చెరిపేసుకోవడానికే ఈ తిప్పలని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏపీలో పవన్ నివాసం ఎక్కడ?.. రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్‌లో.. ఉండేది హైదరాబాద్‌లో అనే విమర్శలు ఇకపై రాకుండా ఉండేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి మార్చేశారు. షూటింగ్‌లు హైదరాబాద్‌లో చేసుకుంటూ.. అప్పుడప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు లారీ మీద ఏపీలో పర్యటిస్తూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడం పవన్‌కు అలవాటుగా మారింది. ఆయన నివాసం ఒక చోట, రాజకీయాలు మరోచోట అంటూ అధికార వైఎస్ఆర్సీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తన నివాసం, పార్టీ ప్రధాన కార్యాలయం ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి జూన్ 12న పవన్ భూమిపూజ నిర్వహించారు. రెండు నెలల్లో ఆఫీస్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. మంగళగిరి ఆఫీస్‌కు హైదరాబాద్ నుంచి సామాన్లు కూడా తరలించేశారు. మీడియాకు లీకులు.. ఆఫీస్ తరలించడమే గాదు.. ఇక పవన్ కళ్యాణ్ మంగళగిరిలోనే నివాసముంటారని చెబుతూ మీడియాకి లీకులిచ్చారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేశారు. ఎన్నికల సమయంలో రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యాలయం కోసం ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. ఎన్నికలలో గెలిచినా.. ఓడినా ప్రజలతోనే ఉంటానని మాటిచ్చారు. భీమవరంలో పోటీ సమయంలో తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి అని.. నర్సాపురం పుట్టిల్లుగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక గాజువాకలో అయితే రెల్లి కులప్రస్తావన చేసి సెంటిమెంట్ ని పండించాలని ప్రయత్నించారు. కానీ, పవన్ వేస్తున్నది కుప్పిగంతులని గ్రహించిన ప్రజలు రెండు చోట్లా ఓడించారు. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చి నెల తిరక్కుండానే గాజువాక, భీమవరంలలో జనసేన జెండా పీకేశారు. ఇళ్ళు ఖాళీ చేసేశారు. ఆ తర్వాత ఆ రెండు చోట్లా జనానికి ముఖం చాటేశారు. మళ్లీ ఎన్నికలవేళ ఏపీలోనే నివాస ముంటున్నట్లుగా ప్రజలని నమ్మించడానికే మంగళగిరికి మకాం మార్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అలా.. ఇకపై షూటింగ్‌ల సమయంలోమాత్రమే హైదరాబాద్ వెళ్తారని.. ఫుల్ టైం మంగళగిరి ప్రధాన కార్యాలయం నుంచే రాజకీయాలు చేస్తారని పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. గత పదేళ్లగా జనసేన పార్టీని నడుపుతున్న పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్‌లో సొంతిల్లు కట్టుకోవాలనే ఆలోచన మాత్రం చేయలేదు. దాదాపు మూడు టర్మ్‌లు ముఖ్యమంత్రిగా ఉండి.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో సొంతిల్లు కట్టుకునే ప్రయత్నం చేయలేదు. విభజన అనంతరం ఏపీ సీఎంగా ఉన్నప్పటికీ చంద్రబాబు హైదరాబాద్‌లో పెద్ద బంగ్లా నిర్మించుకున్నారే గాని సొంత ఊరిలో గాని.. అమరావతిలో గానీ ఇల్లు నిర్మించే ఆలోచన చేయలేదు. కృష్ణా నది కరకట్ట మీద అక్రమంగా కట్టిన ఇంట్లోనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన రాజకీయాలు, భవిష్యత్ అంతా ఏపీతోనే అని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగానే విభజన తర్వాత తాడేపల్లిలో సొంతిల్లు సైతం కట్టుకున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఇపుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి ఏపీలో సొంతిల్లు నిర్మించుకోవాలనే ఆలోచనలు వచ్చాయి. ఇందులో భాగంగానే ఎన్నికల ముందు ప్రజలని మభ్యపెట్టేందుకు పవన్ మంగళగిరి మకాం అంటుంటే.. కుప్పంలో సొంతిల్లు కట్టుకుంటానంటూ చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో జనం చెవిలో పువ్వు పెట్టడమంటే ఇదే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: రేపు, ఎల్లుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన -
నేడు మంగళగిరిలో ప్రపంచ చేనేతల సదస్సు
మంగళగిరి/నాతవరం (అనకాపల్లి జిల్లా): చేనేత కేంద్రంగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన మంగళగిరిలో ప్రపంచ చేనేతల సదస్సు ఆదివారం నిర్వహించనున్నారు. నగరంలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న ఆర్ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించే సదస్సు ఏర్పాట్లను ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి శనివారం పరిశీలించారు. వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సదస్సు నిర్వహించనున్నట్లు చిరంజీవి తెలిపారు. చేనేత సామాజిక వర్గాలకు చెందిన ఎన్నారైలు సభ్యులుగా ఏర్పడిన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్‌లో చేనేత కుటుంబాల అభివృద్ధి కోసం వివిధ అవగాహనా శిబిరాలు నిర్వహిస్తామన్నారు. సదస్సుకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు చిరంజీవి తెలిపారు. చేనేత కార్మికులకు రూ.3700 కోట్ల లబ్ది.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు వివిధ పథకాల రూపంలో రూ.3700 కోట్ల లబ్ధి చేకూర్చిందని రాష్ట్ర ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. అనకాపల్లి జిల్లాలోని గునుపూడిలో శనివారం చేనేత కారి్మకులు మగ్గాలపై తయారు చేస్తున్న పట్టుచీరలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆప్కో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 900 సొసైటీలు ఉన్నాయని,గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉంచిన బకాయిలను రూ.40 కోట్లు చెల్లింపులు చేసి సొసైటీలను ఆరి్థకంగా బలోపేతం చేశారని చెప్పారు. కొత్తగా మరో 50 షోరూమ్‌లు ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించామన్నారు. చేనేతలకు రెండు ఎమ్మెల్సీలు, ఎంపీ పదవులిచ్చి జగన్ రాజకీయంగా పెద్దపీట వేశారన్నారు. పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నర్సాపూర్-ధర్మవరం రైలుకు తప్పిన ప్రమాదం -
‘మంగళగిరిలో లోకేష్ ఓటమి.. అందుకే పేదల ఇళ్ల నిర్మాణాలను టీడీపీ అడ్డుకుంటోంది’
సాక్షి, అమరావతి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు.. తండ్రి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి వాటి నిర్మాణాలకి శ్రీకారం చుట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఇళ్లు లేని వాళ్లు ఎవరూ ఉండకూడదని సీఎం జగన్ సంకల్పించారని.. అందుకే రాష్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే నిరుపేదల దశాబ్దాల సొంతింటి కల నెరవేరబోతోందన్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో 53 వేల మంది నిరుపేదలకి సీఎఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాలకి ఈ నెల 24 న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయబోతున్నారని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో పేదలకి ఇళ్ల స్ధలాలు ఇవ్వకుండా టీడీపీ న్యాయస్ధానాలను ఆశ్రయించింది.. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి మాత్రం రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణాలకి శ్రీకారం చుడుతున్నారన్నారు. డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి రాజధానిలో పేదల సొంతిళ్ల గృహప్రవేశాలు జరగాలని భావిస్తున్నామన్నారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడనే కక్షతోనే పేదల ఇళ్ల నిర్మాణాలని టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. చదవండి ‘ఎంతమంది కలిసొచ్చినా సీఎం జగన్‌కే ప్రజలు మద్దతు’ -
మంగళగిరిలో 500 ఏళ్ల నాటి పుష్కరిణికి పూర్వవైభవం..
-
విలువలే ‘ఇల్లు’వెత్తు ఆస్తి
మంగళగిరి: విలువలే నిలువెత్తు ఆస్తి అని ఆ మహిళ నిరూపించారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థల పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. తనకు ఇప్పటికే ఇల్లు ఉందని, ఈ స్థలం పేదలకు దక్కేలా చూడాలని కోరారు. ఆమె నిజాయితీని అధికారులు, పేదలు ప్రశంసిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. నగర పరిధిలోని యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గ 2019లో సొంతింటి కోసం దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం అర్హురాలిగా గుర్తించింది. ఆ తర్వాత ఆమె భర్త సుబ్రమణ్య శర్మ పేరుతో 100 చదరపు గజాల స్థలం కొని బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా ఎంపికైన కనకదుర్గ పేరుతో అధికారులు ఇంటిస్థల పట్టాను మంజూరు చేశారు. ఇటీవల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందించారు. అయితే తనకు సొంతిల్లు ఉందని, పేదలకు చెందాల్సిన సెంటు స్థలం తాను పొందడం భావ్యం కాదని భావించిన కనకదుర్గ ఆ పట్టాను వెనక్కి ఇస్తూ అధికారులకు లేఖ రాశారు. అనర్హులైనా.. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం స్థల పట్టాలు మంజూరు చేస్తోంది. అయితే వీటిని అనర్హులూ తీసుకుంటున్నారు. అప్పటికే తమ పేరు మీద ఆస్తులు, స్థలాలను ఇంట్లో వేరేవారి పేరు మీదకు మార్చి ఇంటిస్థలం, టిడ్కో గృహ పట్టాలు పొందుతున్నారు. ►నగరంలోని ఇందిరానగర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఇప్పటికి మూడు పారీ్టలు మారి ప్రస్తుతం టీడీపీ కండువా కప్పుకున్నాడు. ఆయనకు అనేక ఆస్తులున్నా తల్లి పేరున ఏ ఆస్తి లేకుండా చేసి టిడ్కో ఇల్లు పొందాడు. ఈ ఉదంతం నగరంలో చర్చనీయాంశమవుతోంది. ► కమర్షియల్ కాంప్లెక్స్‌తోపాటు నగరంలో మరో రెండు ఇళ్లు ఉన్న ఓ వ్యక్తి తన భార్య పేరున టిడ్కో ఇల్లు పొందడం గమనార్హం. ► యర్రబాలెంలో రెండు అంతస్తుల డాబాలో ఉండే ఓ మహిళ తనకు నెలకు రూ.25వేల వరకు అద్దెల రూపంలో ఆదాయం వస్తున్నా.. ఇంటిస్థల పట్టాను పొందారు. ఇలా అనేక మంది తమ పేర్ల మీద ఆస్తులు లేకుండా చేసుకుని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే స్థలాలను అర్హులకు దక్కకుండా కాజేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా నిబంధనల వల్ల అధికారులూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కనకదుర్గను ఆదర్శంగా తీసుకుని అనర్హులు పొందిన ఇంటిస్థల పట్టాలను వెనక్కి ఇవ్వాలని అధికారులు, ప్రజలు కోరుతున్నారు. అనర్హులు ఉంటే పట్టాలు రద్దుచేస్తాం పేదల ఇళ్ళ స్థలాలను అనర్హులు పొంది ఉంటే కచ్చితంగా పట్టా రద్దు చేసి చర్యలు తీసుకుంటాం. అనర్హులను ఎంపిక చేసిన సిబ్బందిపైనా చర్యలు తప్పవు. అనర్హులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పట్టాలు వెనక్కి ఇచ్చి పేదలకు దక్కేలా సహకరించాలి. ఇంట్లో ఎవరికైనా స్థలం, ఆస్తి ఉండి స్థలాలు పొందిన అనర్హులు వెంటనే పట్టాలు వెనక్కి ఇవ్వాలి. – జీవీ రామ్‌ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి -
ఇల్లు కొనుక్కున్నా.. పట్టా వెనక్కి తీసుకోండి
మంగళగిరి: రాష్ట్రంలో ఇల్లులేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం పట్టాలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా యర్రబాలెంకు చెందిన దండిభొట్ల నాగసీత కనకదుర్గను అధికారులు అర్హురాలిగా గుర్తించి ఇటీవల ఆమెకు పట్టాను అందజేశారు. నిజానికి.. 2019లో తనకు సొంతిల్లు లేకపోవడంతో కనకదుర్గ అందుకోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తాజాగా అర్హురాలిగా గుర్తించింది. కానీ, 2019 అనంతరం తన భర్త దండిభొట్ల సుబ్రహ్మణ్య శర్మ పేరుతో వున్న వంద చదరపు గజాల స్థలాన్ని విక్రయించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఈ ఏడాది మార్చి 23న రిజిస్ట్రేషన్ చేయించుకుని అందులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. అప్పటికే ఇంటి స్థలానికి అర్హురాలిగా కనకదుర్గను ఎంపిక చేసిన అధికారులు ఆమె పేరున పట్టాను మంజూరుచేసి ఇటీవల అందరితో పాటు అందజేశారు. కానీ, తనకు సొంతిల్లు ఉండగా పేదలకు చెందాల్సిన సెంటు స్థలాన్ని తాను పొందకూడదని కనకదుర్గ గ్రహించి ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటి స్థలాన్ని రద్దుచేసి వేరొక అర్హురాలికి ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులకు ఆదివారం ఆమె లేఖ రాశారు. -
బడా నాయకుల్ని వెంట బెట్టుకుని రాజకీయం చేస్తున్నారు..
పశ్చిమ గోదావరి: గోపాలపురం నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి గళం వినిపిస్తున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మద్దిపాటి వెంకట్రాజు వ్యవహార శైలి, ఒంటెద్దు పోకడను వ్యతిరేకిస్తూ మండలంలోని గుణ్ణంపల్లి పంచాయతీ, కప్పలకుంటలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సంకురాత్రి శ్రీను, ఆయన సోదరుడు సంకురాత్రి రాంబాబు ఇంటి సమీపంలోని తోటలో మంగళవారం రాత్రి నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ మద్దిపాటి వెంకట్రాజు తీరుపై ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో కొంత మంది బడా నాయకుల్ని వెంట బెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, గ్రామాల్లో యువకులకు పెత్తనమిచ్చి, నాయకులను అసమర్థులను చేశారని, కులచిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. మంగళగిరి కార్యాలయంలో 200 మంది నాయకులు, కార్యకర్తలు మద్దిపాటి నాయకత్వాన్ని వ్యతిరేకించినా అర్ధరాత్రి 12 గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అతనినే ఇన్చార్జిగా ప్రకటించడం దారుణమన్నారు. నాయకులందరూ నిర్ణయించాల్సిన మండల అధ్యక్ష పదవిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారని, ఇది టీడీపీ సంప్రదాయం కాదన్నారు. డబ్బు తగలేసుకుని పార్టీని నిలబెట్టుకుంటున్నామని అన్నారు. ఈనెల 27న రాజమండ్రిలో జరిగే మహానాడు తరువాత మళ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇన్చార్జి విషయంలో తుది నిర్ణయం తీసుకుందామని నిర్ణయించారు. నాయకులను పార్టీ పట్టించుకోవడం లేదని, ఇన్చార్జి నియామకం విషయంలో నాయకులందరికీ అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ అధిష్టానానికి తెలిపి పార్టీ పరిగణలోకి తీసుకుంటే కష్టపడి పనిచేయాలని, లేకుంటే ఆరోజే తగు నిర్ణయం తీసుకుందామని నిర్ణయించారు. -
రాజధానిలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు కుట్ర: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంగళగిరిలో 23 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించబోతున్నామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే, కోర్టుల ద్వారా టీడీపీ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కోర్టులో పేదలకు న్యాయం జరిగింది.’’ అని ఆర్కే అన్నారు. ‘‘పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం. సీఎం జగన్ పేదలకు అండగా నిలిచారు. రాజధానిలో పేదలు ఉండొద్దంటూ టీడీపీ దుర్మార్గంగా వ్యవహరించింది. రాజధానిలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు కుట్ర. దీపావళి కల్లా మంగళగిరిలో కూడా జగనన్న కాలనీలు పూర్తవుతాయి. ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్నదే సీఎం జగన్ ఆకాంక్ష’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: సీఎం జగన్ గొప్ప మనసు.. గంటల వ్యవధిలోనే.. -
ఆసియా పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన సాధియా ఆల్మస్
కేరళలో జరుగుతున్న ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్ సాధియా ఆల్మస్ సత్తా చాటింది. మంగళగిరికి చెందిన సాధియా 57 కేజీల జూనియర్ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్‌తో పాటు ఒక కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని సాధియా కోచ్, తండ్రి ఎస్కే సందాని పేర్కోన్నాడు. కాగా పోటీల్లో ఆల్మస్ స్వ్కాట్లో 57 కేజీల విభాగంలో 190 కేజీల బరువు ఎత్తి వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఈ సందర్భంగా సాధియా ఆల్మస్ను రాష్ట్ర పవర్ లిఫ్గింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ సెక్రటరీ సూర్యనారాయణ తదితరులు అభినందించారు. చదవండి: ఐపీఎల్లో 16 సీజన్లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
ఆ భూములు బాగు చేయొద్దు.. క్లియరెన్స్‌ను అడ్డుకున్న టీడీపీ నేతలు..
మంగళగిరి: పేదలకు అమరావతి (సీఆర్డీఏ) పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రైతుల ముసుగులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పేదలకు ఇచ్చేందుకు సీఆర్డీఏ కేటాయించిన స్థలాలను బాగు చేయవద్దని పనులు నిర్వహిస్తున్నవారితో గొడవకు దిగారు. దీంతో శుక్రవారం కృష్ణాయపాలెంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఆర్డీఏ పరిధిలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, నిడమర్రు, మందడం, ఐనవోలు ప్రాంతాలను కలిపి ప్రభుత్వం ఆర్–5 జోన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ భూములను కేటాయించింది. ఆ భూముల్లో భారీగా కంపచెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆర్–5 జోన్లో కేటాయించిన భూముల్లో ముళ్లకంపను తొలగించి మెరక చేసి లే అవుట్ వేయాలని సీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధంచేసింది. ఇందులో భాగంగా జంగిల్ క్లియరెన్స్, మెరక చేసే పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. కృష్ణాయపాలెంలో కేటాయించిన భూముల్లో శుక్రవారం జంగిల్ క్లియరెన్స్ నిర్వహించేందుకు కాంట్రాక్టర్ జేసీబీలను తీసుకువెళ్లి పనులు ప్రారంభించే సమయంలో రైతుల ముసుగులో ఉన్న పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మంగళగిరి రూరల్ సీఐ భూషణం, ఎస్ఐ రమేష్‌బాబు వచ్చి సర్దిచెప్పారు. సీఆర్డీఏ ఇచ్చిన వర్క్ ఆర్డర్ కాపీని కాంట్రాక్టర్ చూపించి జంగిల్ క్లియరెన్స్ పనులు చేయాలని చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: సామాజిక న్యాయమే పరమావధి -
ఆరోగ్య శ్రీ సేవలకి ఎక్కడా అంతరాయం కలగలేదు
సాక్షి, విజయవాడ: మంగళగిరి(గుంటూరు)లోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందంటూ వస్తున్న కథనాలపై ట్రస్ట్ స్పందించింది. జరిగింది స్వల్ప ప్రమాదమేనని, ఆ ఘటనతో ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రి హెల్త్ కేర్ ట్రస్ట్. మంగళగిరి డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కాలి పొగలు వ్యాపించడంతో ఉద్యోగులని బయటకి పంపించాం. దీని వలన ఎటువంటి నష్టం వాటిల్లలేదు. అగ్నిమాపక శాఖ సకాలంలో స్పందించి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. సేవలకి ఎక్కడా అంతరాయం కలగలేదు అని ఆ ప్రకటనలో పేర్కొంది. -
వైఎస్సార్సీపీకి నన్ను దూరం చేయలేరు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, గుంటూరు: ‘‘రాజకీయాల్లో ఉన్నంత కాలం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే కొనసాగుతా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరూ నన్ను దూరం చేయలేరు’’.. కీలక సమావేశానికి గైర్హాజరు కావడంతో తనపై ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఒక్క స్టేట్మెంట్తో కొట్టిపాడేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. సోమవారం జరిగిన ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం ఉంది. పంటికి సర్జరీతో పాటు ఇంట్లో శుభకార్యం ఉండటం వల్ల మీటింగ్‌కి వెళ్లలేకపోయా. దానికి ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు పిచ్చిపిచ్చి రాతలు రాసింది. ఒక వర్గం మీడియా పనికట్టుకుని విష ప్రచారం చేసింది. వ్యక్తులు, కులాల మధ్య చిచ్చులు పెట్టి మనిషి మనిషిని విడదీసి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నాడు అంటూ ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. అసలు చంద్రబాబు మీటింగ్ పెడితే ఎవరెవరు వచ్చారో.. ఎవరెవరు రాలేదో యెల్లో మీడియా ఎందుకు రాయదు. గత ప్రభుత్వంలో మూడు శాఖల మంత్రిగా పనిచేసిన నారా లోకేష్.. ఏనాడైనా మంగళగిరి మున్సిపల్ సమావేశానికి వచ్చాడా?. జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చాడా?. మరి లోకేష్ గురించి ఎందుకు ఎల్లో మీడియా ప్రస్తావించిందా? అని నిలదీశారాయన. చంద్రబాబు నాయుడు-ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ నుంచి పేదల్ని విడదీయలేరని, మంగళగిరిలో మళ్లీ గెలిచేది వైఎస్సార్సీపీనే అని ఎమ్మెల్యే ఆర్కే ఘంటా పథంగా చెప్పారు. -
మంగళగిరిలో భూకబ్జా.. రూ.15 కోట్ల భూమిపై రియల్టర్లు, టీడీపీ నాయకుల కన్ను
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద జాతీయరహదారి వెంట ఖాళీగా ఉన్న భూములపై కబ్జాదారులు పంజా విసురుతున్నారు. నకిలీ పత్రాలు తయారుచేసి ఆ భూముల్ని అమ్మేస్తున్నారు. తాజాగా నకిలీ పత్రాలతో భూమి అమ్ముతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై భూమి యజమాని పోలీసుల్ని ఆశ్రయించారు. నగరంలో జాతీయరహదారి వెంబడి ఉన్న శ్రీకృష్ణచైతన్య వృద్ధాశ్రమానికి దగ్గరలో 123/1 సర్వే నంబరులో 67 సెంట్ల భూమి కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. సుమారు రూ.15 కోట్ల విలువైన ఈ భూమిపై మంగళగిరికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నాయకుల కన్ను పడింది. నగరానికి చెందిన చంద్రమౌళి పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి అమ్మకానికి పెట్టారు. రూ.4.50 కోట్లకు కొనుగోలు చేసిన టీడీపీ నాయకుడు విశాఖపట్నం కి చెందిన తన అనుచరుడు కోటేశ్వరరావు పేరిట అగ్రిమెంట్ రాయించారు. అగ్రిమెంట్ అయిన వెంటనే భూమిని చదును చేసి మట్టి తోలసాగారు. దీంతో మంగళగిరికి చెందిన సాంబశివరావు ఆ భూమిని తాను కొనుగోలు చేశానని, తనకు అగ్రిమెంట్ ఉందని బయటకొచ్చారు. మొత్తం రూ.2.50 కోట్లు ఇస్తానని, భూమి ఖాళీ చేయాలని కోటేశ్వరరావుతో బేరాలాడసాగారు. ఈ విషయం తెలియడంతో ఆ భూమి అసలు యజమాని విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన గిరీశ్ మంగళవారం రాత్రి ఆ భూమి వద్దకు చేరుకున్నారు. ఈ భూమి మీదేననే ఆధారాలు తీసుకురావాలని కోటేశ్వరరావు అనడంతో గిరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలు ఆధారాలు తీసుకురావాలని పోలీసులు సూచించారు. తాను గురువారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నానని, తహసీల్దారుతోను, రిజిస్ట్రార్‌తోను మాట్లాడానని కోటేశ్వరరావు చెప్పారు. ఈ విషయమై తహసీల్దారును, రిజిస్ట్రార్‌ను అడగగా.. తమను రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించలేదని తెలిపారు. దస్తావేజులు, లింకు దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు పరిశీలించి, పోలీసులు విచారణ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఐ అంకమ్మరావును అడగగా.. స్థల వివాదంపై ఫిర్యాదు అందిందని తెలిపారు. తాను సెలవులో ఉన్నానని, విధులకు వచ్చి న తరువాత విచారించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
వధూవరులను ఆశీర్వదించిన గవర్నర్ నజీర్
మంగళగిరి(గుంటూరు జిల్లా): జస్టిస్ కుంభజడల మన్మథరావు కుమారుడు కౌషిక్ వివాహ రిసెప్షన్‌కు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. గుంటూరు జిల్లా చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో కౌషిక్ వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి జరిగింది. వధువు ఉదయ, వరుడు కౌషిక్లను గవర్నర్ ఆశీర్వదించారు. కాగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: రెట్టించిన వృద్ధి -
ఇంతై.. ‘ఇంతి’oతై..
ఈమె పేరు కొండా ఉషారాణి.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కికి చెందిన ఈమెకు తన 13వ ఏట వివాహమైంది. పెళ్లయిన మూడున్నరేళ్లకే భర్త చనిపోవడంతో తల్లితో పాటు తనకున్న ఇద్దరు పిల్లలను పెంచుకునేందుకు పొగాకు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా చేరింది. వచ్చే జీతం సరిపోకపోవడంతో రుణం తీసుకొని ఇంట్లోనే బట్టల దుకాణం ప్రారంభించింది. అయితే దొంగలు పడి బట్టలన్నీ దోచుకెళ్లారు. దీంతో కొన్నాళ్లు దిగాలు పడ్డ ఉషారాణి తన బిడ్డలను పోషించుకోవడానికి పడి లేచిన కెరటంలా నిలబడింది. కంపెనీల నుంచి బయో ఎరువులను తీసుకొని మార్కెటింగ్‌కు శ్రీకారం చుట్టింది. 10 ఏళ్ల పాటు ఊరూరా తిరుగుతూ వాటిని అమ్ముతూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. అంతేకాకుండా గోశాల నుంచి సేకరించిన గోమూత్రం, పేడ వ్యర్థాలతో స్వయంగా బయో ఎరువులు తయారు చేస్తూ రైతులకు విక్రయించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సొంతంగా పాడి గేదెలను కొనుగోలు చేసి బయో ఎరువుల తయారీ యూనిట్ పెట్టింది. తాను స్వయంశక్తితో నిలదొక్కుకోవడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతటితో ఆగకుండా తనకున్న 1.40 ఎకరాలతో పాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని ప్రకృతి సాగు చేపట్టింది. వరితో పాటు మిరప, మునగ, పసుపు, కాలీఫ్లవర్ పంటలను సాగు చేస్తోంది. ఇటీవల స్త్రీ (శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం) అవార్డును అందుకుంది. మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లా.. రెండో అబ్బాయి పుట్టిన మూడు నెలలకే భర్త చనిపోయారు. ఏం చేయాలో పాలుపోలేదు. జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లా – కొండా ఉషారాణి, మహిళా రైతు, నూతక్కి, గుంటూరు జిల్లా -
'జన ఔషధి దుకాణాల్లో తక్కువ ధరకే 1,759 రకాల మందులు'
సాక్షి, గుంటూరు: జనరిక్ మందులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వైద్య ఆరోగ్య విభాగానికి చెందిన వారంతా ఈ విషయంపై చొరవచూపాలని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సూచించారు. మంగళగిరిలోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో ప్రభుత్వం అధికారికంగా జనఔషధి దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని కంపెనీలు మార్కెటింగ్, పర్సంటేజీల ఆశచూపుతూ మందులను అధిక ధరలకు విక్రయించే ప్రయత్నం చేస్తుంటాయని, వీరి మాయలో ఎవరూ పడకూడదని కోరారు. మందుల చీటిలపై రోగానికి సంబంధించిన ఔషధం పేరే రాయలని పేర్కొన్నారు. జన ఔషధి దుకాణాల్లో అత్యంత చౌక ధరకే మందులు దొరుకుతాయని తెలిపారు. నేరుగా కంపెనీ నుంచి వచ్చిన ఔషధాన్ని ప్రజలకు అందజేస్తారని చెప్పారు. చాలా చౌకగా, అత్యంత నాణ్యమైన మందులు జన ఔషధి దుకాణాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. రోగులంతా ఈ దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ అధికారులదేనని చెప్పారు. జగనన్న లక్ష్యాలు నెరవేర్చాలి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమున్నత లక్ష్యంతో పనిచేస్తున్నారని విడదల రజిని తెలిపారు. పేదలందరికి అత్యంత సులువుగా, వేగంగా నాణ్యమైన వైద్యం పూర్తి ఉచితంగా అందాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య శాలలన్నింటినీ నాడు-నేడు కార్యక్రమం కింద పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందజేస్తున్నామన్నారు. జగనన్న లక్ష్యాలు, ప్రభుత్వ సంకల్పం నెరవేర్చేలా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థలు నడిచేలా చూడాలన్నారు. ఎవరైనా కంపెనీల పేర్లతో మందుల చీటిలు రాస్తున్నా, వాటిని ఏ మందుల దుకాణాలైనా ప్రోత్సహిస్తున్నా చర్యలకు వెనుకాడొద్దన్నారు. అప్పుడే జన ఔషధి దివాస్ కార్యక్రమాల లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. జన ఔషధి దుకాణాల్లో 1,759 రకాల మందులు జన ఔషధి దుకాణాల్లో ఏకంగా 1,759 రకాల మందులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. 280 సర్జికల్ డివైజెస్ కూడా దొరుకుతాయని చెప్పారు. ఇవన్నీ అత్యంత తక్కువ ధరకే లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ దుకాణాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని, వీరంతా ఔషధి దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత వైద్యులు, డ్రగ్ విభాగం అధికారులదేనని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 145 జనఔషధి కేంద్రాలు ఉన్నాయని, వీటి సంఖ్యను మరింతగా పెంచబోతున్నామని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఔషధ నియంత్రణ శాఖ డీజీ రవిశంకర్ నారాయణన్, డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్, నిర్మల కళాశాల అధ్యక్షురాలు మరియా సుందరి, కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.. -
మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం ప్రారంభం
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రతి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఇంత గొప్ప పరిపాలన ఎప్పుడూ చూడలేదన్నారు. నేను 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడూ రాలేదంటూ పొగడ్తలు కురిపించారు. చంద్రబాబు, పవన్‌లు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఎవరెన్ని మాట్లాడినా ప్రజల అండతో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. చదవండి: (యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్) -
మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం ప్రారంభం
-
మంగళగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి రోజా
-
ఏపీ జ్యూడిషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ చంద్రచూడ్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. మంగళగిరి మండలం ఖాజాలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. అనంతరం సీజేఐ మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగింది. సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. న్యాయవాదులు నల్లకోటు ధరించి తిరగడం చూస్తుంటాం. అందులోని తెలుపు, నలుపు రంగులను ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణగా పరిగణిస్తారు. న్యాయమూర్తులు నిత్య విద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టులు వివాదాల పరిష్కారమే కాదు, న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలి. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించాలి. న్యాయవ్యవస్థను పరిరక్షించడానికి అందరి సహకారం అవసరం. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి. జడ్జిలకు సొంత సామర్ధ్యాలపై విశ్వాసం ఉండాలి. ముఖ్యమైన కేసుల్లో త్వరగా న్యాయం జరిగేలా చూడాలి. న్యాయవ్యవస్థలో కేసుల సంఖ్య కంటే తీర్పుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి అని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్
మంగళగిరి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్.. నూతన వధూవరులు లలిత నాగదుర్గ, సాయి సూర్యతేజలను ఆశీర్వదించారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. ఆ జంటకు బొకేను అందజేశారు. అనంతరం అక్కడ ఉన్న అభిమానులతో ముచ్చటించారు. సీఎం జగన్. వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యే క్రమంలో తిరిగి బయల్దేరే క్రమంలో ఆ ప్రాంగణమంతా అభిమానులు హర్షాతిరేకలతో సందడిగా మారిపోయింది. -
మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి వివాహ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులు ఆదిత్య వర్మ, సాయి సంజనలను సీఎం జగన్ ఆశీర్వదించారు. చదవండి: ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. ఎవరూ అలక్ష్యం చేయొద్దు: సీఎం జగన్ -
వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. బుధవారం మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహ వేడకకు సీఎం ముఖ్య అతిథిగా విచ్చేశారు. నూతన వధూవరులు సాయి అశ్విత, మంచుకొండ చక్రవర్తిలను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, రాహుల్లా, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉన్నారు. చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్) -
పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇకపై ఎయిమ్స్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలందనున్నాయి. ఈ మేరకు గురువారం మంగళగిరిలోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఎయిమ్స్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం అందించాలనే సీఎం జగన్ ఆలోచనల మేరకు ఎయిమ్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 100 మందికి పైగా రోగులకు ఎయిమ్స్‌లో ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించామన్నారు. 30 మందికి పైగా రోగులకు చికిత్సలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ట్రయల్ రన్ పూర్తవ్వడంతో అధికారికంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. 24 గంటలూ ఆరోగ్యశ్రీ సేవలందేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్యాన్సర్‌కు నాణ్యమైన వైద్యం అతి త్వరలో ఎయిమ్స్‌లో పెట్ సిటీ స్కాన్ అందుబాటులోకి రానుందని మంత్రి విడదల రజిని చెప్పారు. శరీరంలో ఎక్కడ క్యాన్సర్ అవశేషాలున్నా సరే.. ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. క్యాన్సర్‌కు అంతర్జాతీయ స్థాయి వైద్యం ఏపీలోనే అందించాలనే సీఎం జగన్ ఆలోచనకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎయిమ్స్‌కు ప్రస్తుతం రోజుకు ఆరు లక్షల లీటర్ల నీటిని అందిస్తున్నామన్నారు. వచ్చే జూన్ కల్లా పైపులైను పనులు పూర్తవుతాయని చెప్పారు. ఎయిమ్స్ నుంచి రోగులను మంగళగిరికి చేర్చేందుకు ఉచిత వాహన సౌకర్యం కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ త్రిపాఠి, ఎయిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ వంశీకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి నవీన్‌కుమార్, కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: స్మార్ట్ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!?) -
NRI మెడికల్ కళాశాల సోదాలపై ఈడీ ప్రకటన
-
NRI ఆస్పత్రిలో.. డబ్బు రోగం.
-
ఎన్నారై ఆస్పత్రిలో 27 గంటలపాటు ఈడీ సోదాలు
-
మంగళగిరిలోని NRI ఆస్పత్రిలో ఈడీ సోదాలు
-
పవన్ కళ్యాణ్.. ఈ 39 మంది ఎవరు?
సాక్షి, అమరావతి: మంగళగిరిలో నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామానికి చెందిన 39 మందికి రూ.లక్ష చొప్పున ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పవన్ చెక్కులు అందజేసిన 39 మందిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములు ఇచ్చిన వారెవరూ లేకపోవడం విశేషం. ఇప్పటంలో రోడ్డు ఆక్రమించుకున్నారని అధికారులు 53 మందికి నోటీసులిచ్చారు. ఒకరు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో మిగతా 52 మంది ప్రహరీలను మాత్రమే కూల్చివేశారు. ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. అయితే మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములిచ్చినందునే ఇళ్లు కూల్చి వేశారని పవన్ నానా యాగీ చేస్తున్నారు. ఇప్పుడు బాధితుల పేరుతో పవన్ చెక్కులు ఇచ్చిన 39 మందిలో ఆ రోజు సభకు భూములిచ్చిన వారిలో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. జనసేన ఆవిర్భావ సభను ఇప్పటంలో 6.70 ఎకరాల్లో నిర్వహించామని ఆ పార్టీ నేత నాదండ్ల మనోహర్ చెప్పారు. వింటా సాంబిరెడ్డి, తిరుమలశెట్టి సామ్రాజ్యం, ఎల్.ఆదినారాయణ, గాజుల సాంబయ్య, శంకరశెట్టి శ్రీనివాసరావు, శంకరశెట్టి పిచ్చయ్య, శంకరశెట్టి రాయుడు, ఉమామహేశ్వరరావు, గాజుల నరసయ్యల భూమి అది. (క్లిక్ చేయండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా?) ఇందులో 8 మంది పేర్లు ఆక్రమణల జాబితాలోనే లేవు. వాళ్లలో ముగ్గురు అసలు ఆ గ్రామంలోనే ఉండరు. ఇంకొకరు ఆక్రమణల పరిధిలోకి వచ్చినా, అతడు ముందే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో అతని ప్రహరీని తొలగించలేదు. అయితే ఆదివారం పవన్ చెక్కులు పంపిణీ చేసిన వాళ్లలో వీళ్లెవరూ లేరు. ప్రహరీలు తొలగించిన రోడ్డులో ఇల్లు లేని వారికి, నోటీసులు కూడా అందుకోనివారికి చెక్కులు పంపిణీ చేశారని ఇప్పటం గ్రామస్తులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: జన సైనికులే 420లు.. న్యాయస్థానమే తప్పు పట్టినా మారరా?) -
ఎంఐజీ ప్లాట్ల బుకింగ్‌కు గడువు పెంపు
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’లో ప్లాట్ల కొనుగోలు కోసం ఆన్లైన్లో బుకింగ్‌కు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–వేలంలో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు శనివారంతో ముగిసిందని, అయితే, కొనుగోలుదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగించినట్లు వివరించారు. ఇక్కడి ఎంఐజీ లే అవుట్–2లో 200 చ.గ. ప్లాట్లు 68, 240 చ.గ. ప్లాట్లు 199, మొత్తం 267 ఉన్నాయని తెలిపారు. చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించామని, కొనుగోలుదారులకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 10% ప్లాట్లు రిజర్వు చేయడంతోపాటు 20% రాయితీ ఇస్తున్నామని, స్థానిక విశ్రాంత ఉద్యోగులకు 5% ప్లాట్లను రిజర్వు చేసినట్లు తెలిపారు. ఈ–వేలంలో ప్లాట్లు పొందినవారు సులభ వాయిదాల్లో డబ్బులు చెల్లించే సౌకర్యం కూడా ఉందన్నారు. ఆన్లైన్ బుకింగ్ అనంతరం ఈ–వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం మరో మంచి అవకాశం కల్పిస్తోందని, ప్లాట్ నికర అమ్మకపు ధరలో 60% మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయని, మిగిలిన 40 శాతం మీద మినహాయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు https://migapdtcp.ap.gov.in, https://crda. ap. gov. in వెబ్సైట్, లేదా 0866– 2527124 నంబర్లో గానీ సంప్రదించవచ్చు. -
సూపర్‌స్టార్ కృష్ణకు మంగళగిరితో అనుబంధం మరువరానిది
మంగళగిరి: సినీనటుడు సూపర్‌స్టార్ కృష్ణకు మంగళగిరితో అనుబంధం మరుపురానిది. కృష్ణ చిన్నతనం నుంచే మంగళగిరిలో వేంచేసిఉన్న లక్ష్మీనృసింహస్వామి తిరునాళ్లకు ప్రతి ఏడాది తన స్నేహితులతో కలసి వచ్చి సరదాగా గడిపేవారు. ఈ నేపథ్యంలో నృసింహుని ఆలయం పక్కనేగల రమణమూర్తి నివాసం వద్ద ఇంటి ముందు అరుగులపై నిద్రించేవాడని రమణమూర్తి గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో నటించడం ప్రారంభమైన తరువాత కూడా మంగళగిరిని మర్చిపోని కృష్ణ తన నాలుగు చిత్రాలకు సంబంధించి షూటింగ్ మంగళగిరిలో నిర్వహించారు. సావాసగాళ్లు, పట్నవాసం, పల్నాటి సింహం, రక్త తర్పణం సినిమాల షూటింగ్ మంగళగిరి కేంద్రంగా ఎన్నో రోజులు జరిగింది. ఆలయ ఆవరణలో సావాసగాళ్లు, పల్నాటి సింహం సినిమాలకు సంబంధించిన పాటల చిత్రీకరణ జరిగింది. కృష్ణకు మంగళగిరికి చెందిన వీరాభిమానులు ఎంతో మంది ఉన్నారు. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరికి చెందిన ఫేవరెట్ టైలర్ మహ్మద్‌అలీ కృష్ణకు బట్టలు కుట్టి అందించేవారు. కృష్ణ మృతి వార్తతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పలువురు నివాళులరి్పంచేందుకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. -
ఈ ఆనందం వెలకట్టలేనిది!
(నానాజీ అంకంరెడ్డి), సాక్షి, అమరావతి: మంగళగిరి వైఎస్సార్ జగనన్న నగర్ (టిడ్కో)లో వందల కుటుంబాల వారు తమ సొంతింటి ఆనందాన్ని పంచుకున్నారు. ఇక్కడ నిర్మించిన 1,728 టిడ్కో ఇళ్లల్లో దాదాపు 400 మంది ఉంటున్నారు. డిసెంబర్లో మంచి ముహూర్తాలు ఉండడంతో మిగిలిన వాళ్లు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లుచేసుకుంటున్నారు. ఇళ్లు పొందిన వారి పిల్లలు చిల్డ్రన్స్ డే సందర్భంగా సోమవారం టిడ్కో ప్రాంగణంలోని తమ ఫ్లాట్లలో కలియదిరుగుతూ గదుల్లోని గోడలను తడిమి చూసుకుని ఆనందంగా గడిపారు. విశాలమైన 60, 40 అడుగుల రోడ్లు.. చక్కటి డ్రైనేజీ వ్యవస్థ, ప్రతిబ్లాక్‌కు 20 అడుల సెట్‌బ్యాక్, ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన 0.8 ఎంఎల్డీ సామర్థ్యమున్న ఎస్టీపీతో చక్కటి ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించింది. సిరామిక్ టైల్స్‌తో ప్రతి గదినీ ముచ్చటగా తీర్చిదిద్దారు. ‘ఇలాంటి చోట ఇంతమంచి ఇల్లు మా జీవితంలో కట్టుకోలేం’ అని లబ్ధిదారులు అంటున్నారంటే వారెంత ఆనందంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘దగ్గర్లోనే పట్టణ ఆరోగ్య కేంద్రం ఉంది, ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మంచిగా వైద్యం చేస్తున్నారంటూ స్థానిక మహిళ జ్యోతి చెప్పారు. ఇక పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట స్థలం సిద్ధమవుతోంది. అందరికీ ఉపయోపడేలా పార్కును కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడే కాదు.. రాష్ట్రంలో 88 స్థానిక సంస్థల్లో నిర్మిస్తున్న 163 జీ+3 టిడ్కో అపార్ట్మెంట్లను ఇదే రీతిలో తీర్చిదిద్దుతున్నట్లు టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. పచ్చదనం కోసం త్వరలో మొక్కలు విశాలమైన ఈ ఇళ్ల ప్రాంగణంలోని ప్రతి అపార్ట్మెంట్ సెట్బ్యాక్లోను పళ్ల మొక్కలు, రోడ్లకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు నాటనున్నారు. నివాసితుల అవసరాలకు అనుగుణంగా దుకాణాల నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించారు. వైఎస్సార్ జగనన్న నగరాల నిర్వహణకు సంక్షేమ సంఘాలను కూడా ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లల్లో ఇన్ని వసతులు ఉంటాయని ఊహించలేదని, ఇక్కడి నిర్మాణాలు చూశాక జగనన్న ప్రభుత్వం తమకెంత మేలుచేసిందో తెలిసిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేశారు. ‘జగనన్న మాకు సొంతిల్లు ఇచ్చి ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. ఇప్పుడు అందులో ఆనందంగా అడుగుపెట్టాం. బయటి వారు ఎవరో వచ్చి మా ఆనందాన్ని నాశనం చేయాలని చూస్తే ఎలా సహిస్తాం!’ అంటూ గుంటి రాజలక్ష్మి (బి–6 బ్లాక్) అన్నారు. చిన్న రేకుల షెడ్డులో ఉండేవాళ్లం తెనాలి రోడ్డులోని రేకుల షెడ్డులో ఉండేవాళ్లం. చిన్నపాటి వర్షానికి కారిపోయేది. మా నాన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషిస్తారు. మాకు ఇక్కడ బి–21 బ్లాక్‌లో ఫ్లాట్ ఇచ్చారు. ఇప్పుడు సొంతింట్లో ఉంటున్నాం. దగ్గర్లోనే ప్లేగ్రౌండ్ కూడా ఉంది. చాలా ఆనందంగా ఉంది. – ఎండీ యాకూబ్ బేగ్, 8వ తరగతి అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా అమ్మ షాపులోను, నాన్న టైలర్గాను పనిచేస్తారు. చిన్న గది, ఇంటికి ఎవరొచ్చినా ఉండేందుకు అవకాశం ఉండేదికాదు. నా స్నేహితుల సొంతిళ్లను చూసినప్పుడు అలాంటి ఇల్లు మేం కొనుక్కోగలమా అని అనిపించేంది. జగన్నన పుణ్యమా అని ఇప్పుడు మాకూ ఇల్లు వచ్చింది. – గుమ్మడి జ్యోతిక, ఇంటర్ సెకండియర్ మాటల్లో చెప్పలేని ఆనందం ప్రైవేటు ఆస్పత్రిలో క్లర్క్‌గా పనిచేసే నేను సొంతిల్లు సంపాదించడం అసాధ్యం. చిన్న గదిలో అద్దెకుండేవారం. బంధువులొస్తే ఉండే అవకాశంలేదు. ఇప్పుడు అన్ని వసతులతో ఇల్లు ఇచ్చారు. మా అబ్బాయి ఎంతో మురిసిపోతున్నాడు. జగనన్న పుణ్మమాని అద్దె ఇంటి కష్టాలు తప్పాయి. – షేక్ పర్హీన్, ప్రైవేట్ ఉద్యోగి చిత్రంలో కనిపిస్తున్నామె పేరు షేక్ షహీనా. మంగళగిరి ఇస్లాంపేటలో అద్దె ఇంట్లో ఉండేవారు. ఈమె తల్లిదండ్రులు, అత్తమామలకు కూడా సొంతిల్లు లేదు. ఇప్పుడు మంగళగిరిలో నిర్మించిన వైఎస్సార్ జగనన్న నగర్‌లోని బి–16 బ్లాక్‌లో ఫ్లాట్ పొందారు. ఇద్దరు పిల్లలతో సరైన ఇల్లులేక ఏడ్చిన సందర్భాలను ఈమె గుర్తుచేసుకున్నారు. ‘నా భర్త నిస్సార్ చెప్పుల దుకాణంలో పనిచేస్తారు. అరకొర జీతం. బంధువులు రాకూడదని షరతు. దీంతో ఎన్ని ఇళ్లు మారానో అల్లాకే తెలుసు. ఇప్పుడు నా సొంతిట్లో ఉంటున్నాను. ఇదంతా జగనన్న చలవే’ అని చెమర్చిన కళ్లతో చెప్పారు. ఇక షహీనా తల్లి ఫైజాన్ మాట్లాడుతూ.. ‘అద్దె ఇంట్లో నీరు ఎక్కువ వాడుతున్నారని తిట్టేవారు. దాంతో మనవలను చూడాలన్న ఆశ ఉన్నా వెళ్లడానికి ఉండేది కాదు. ఇప్పుడు నా బిడ్డకు జగన్‌బాబు ఇల్లిచ్చారు. నేను ఇక్కడకు ఎప్పుడైనా రావొచ్చు. ఆయన మా పాలిట అల్లాహ్’.. అన్నప్పుడు కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. – ఈ తల్లీ బిడ్డల ఆనంద బాష్పాలకు ఖరీదుకట్టే షరాబు ఉన్నాడా? నేను స్వేచ్ఛగా ఆడుకోవచ్చు.. ఇక్కడ చిత్రంలోని తల్లి జె.రాజ్యలక్ష్మితో కనిపిస్తున్న పిల్లాడి పేరు మోక్షజ్ఞ. ఏడో తరగతి. వీరు గతంలో చిన్న గదిలో అద్దెకుండేవారు. కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తల్లి తెచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఇల్లు గడిచేది. ఇప్పుడు వీరికి టిడ్కో ప్రాజెక్టులో ఏ–7 బ్లాక్‌లో ఇల్లిచ్చారు. దీనిపై మోక్షజ్ఞ స్పందిస్తూ.. ‘ఇంతకుముందు ఆడుకునేందుకు ఏమీ ఉండేది కాదు. ఇప్పుడిక్కడ ప్లేగ్రౌండ్ ఉంది. పార్కు కూడా కడతారట’.. అన్నప్పుడు బాబు కళ్లల్లో కనిపించిన మెరుపు వెలకట్టలేం. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘జగనన్న వచ్చాక నాకుంటూ సొంతిల్లు వచ్చింది’ అని చెప్పింది. – ఈ తల్లీకొడుకుల్లో సంతోషం, ధీమా కనిపించాయి. ఇరుకు గది నుంచి విశాల ప్రపంచానికి.. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు కరిష్మా. నాలుగో తరగతి చదువుతోంది. నాన్నలేని ఈ బిడ్డకు ఓ తమ్ముడు ఉన్నాడు. వంట పనిచేసి తల్లి తెచ్చే కొద్దిపాటి సంపాదనతో మంగళగిరి ఐదో వార్డులోని చిన్నరేకుల షెడ్డులో వీరుంటున్నారు. ఇక్కడ బి–37లో ఫ్లాట్ ఇచ్చారు. ఈ చిన్నారిని పలకరించినప్పుడు ‘మేం అద్దెకుండే రేకుల ఇల్లు వర్షం వస్తే కారిపోయేది. ఇక్కడ ఇల్లు వచ్చిందని తెలియగానే అమ్మ ఎంతో సంతోషపడింది. అమ్మను అంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు’. – ఆ చిన్నారి కళ్లల్లో వెలకట్టలేని వెలుగు కనిపించింది. మా పిల్లలకు గర్వంగా చెబుతున్నా.. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న షేక్ జానీది కష్టాల కథే. పదుల సంఖ్యలో ఇళ్లు కట్టిన ఈ మేస్త్రీకి నిన్నా మొన్నటిదాకా సొంత గూడులేదు. ‘మనం సొంతిల్లు కట్టుకోలేమా నాన్నా.. అని నా పిల్లలు అడిగినప్పుడు మనసు చివుక్కుమనేది. ఎన్నో ఇళ్లు కట్టిన నేను నా పిల్లలకు సమాధానం చెప్పలేకపోయేవాడిని. జగనన్న చలవవల్ల ఇప్పుడు నాకు పది లక్షల విలువైన ఇల్లు (బి–5)వచ్చింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇదంతా జగన్ బాబు పుణ్యమే’ అంటున్నప్పుడు మేస్త్రీ జానీ కళ్లలో కృతజ్ఞత కనిపించింది. -
రాజకీయాలు చేయడానికే మా ఇళ్లకు వచ్చారా?.. జనసేన నాయకులపై లబ్ధిదారుల ఫైర్
సాక్షి, గుంటూరు: మంగళగిరిలో జనసేన నాయకులపై టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లను పరిశీలించడానికి జనసేన కార్యకర్తలు మంగళగిరిలోని జగనన్న నగర్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులను లబ్ధిదారులు అడ్డుకున్నారు. ప్రభుత్వం మాకు అన్ని సదుపాయాలతో టిడ్కో ఇళ్లు అందిస్తుంటే.. మీరెందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాలు చేయడానికే మా ఇళ్లకు వచ్చారా అంటూ జనసేన నాయకులను లబ్ధిదారులు నిలదీశారు. జగనన్న నగర్ నుంచి జనసేన నాయకులు వెంటనే వెళ్లిపోవాలని లబ్ధిదారులు నినాదాలు చేశారు. చదవండి: (ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్) -
జనసేన నాయకులను అడ్డుకున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు
-
ఇళ్లన్నీ భద్రం.. విద్వేషాలను రగిల్చేందుకు పవన్ పథకం
ఇప్పటం నుంచి సాక్షి ప్రతినిధులు మేడికొండ కోటిరెడ్డి, నానాజీ అంకంరెడ్డి: ఆక్రమణల తొలగింపు సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటంలో స్థానిక వైఎస్సార్ సీపీ నేత ఇంటి ప్రహరీని సైతం అధికారులు తొలగించారు. పార్టీలు, కుల మతాలనే వివక్ష లేకుండా మానవత్వంతో విధులు నిర్వర్తించారు. విపక్షాలు బురద చల్లుతున్నట్లుగా ఏ ఒక్క ఇంటినీ కూల్చలేదు. సాధారణ పాలన ప్రక్రియలో భాగంగా ఆక్రమణలను గుర్తించి కేవలం ప్రహరీలను మాత్రమే తొలగించారు. వాస్తవాలు ఇలా ఉండగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మాత్రం శనివారం నానా హంగామా చేస్తూ ఇప్పటం వెళ్లి విద్వేషాలను రేకెత్తించారు. రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం ఇళ్లను కూల్చి వేస్తోందంటూ అడ్డగోలు విమర్శలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వైషమ్యాలను రగిల్చేందుకు పథకం వేశారు. ఈ నేపథ్యంలో నిజానిజాలను పరిశీలించేందుకు ‘సాక్షి’ ప్రతినిధి బృందం ఆదివారం ఇప్పటం గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడింది. ఇంటి ముందు ఉండే ప్రహరీ గోడలు మాత్రమే తొలగించారని, ఏ ఒక్క నివాసాన్నీ కూల్చి వేయలేదని స్పష్టంగా వెల్లడైంది. రాజకీయ చిచ్చే.. గౌడులు, నాయుళ్లు, రెడ్లు నివసించే ఇప్పటంలో ఎన్నికలప్పుడు ఎవరి రాజకీయాలు వారు చేసుకున్నా గ్రామస్తులంతా సామరస్యంగా జీవిస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో జనసేన ఆవిర్భావ సభను అక్కడ నిర్వహించాలని భావించినప్పుడు ఇప్పటంలో మూడు ప్రధాన కులాల పెద్దల సమావేశం నిర్వహించి చర్చించారు. జనసేన సభ జరిగిన వేదిక ఆ పార్టీ సానుభూతిపరుల పొలం ఉండే ప్రాంతంలోనే ఉన్నా ఆ చుట్టు పక్కల పొలాల యజమానుల్లో అన్ని పార్టీల వారున్నారు. ఇప్పటం అభివృద్దికి రూ.50 లక్షల విరాళం ఇస్తామని జనసేన ప్రకటించడంతో ఆ డబ్బుతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై గ్రామంలోని మూడు సామాజిక వర్గాలు మరోసారి సమావేశమై చర్చించాయి. ఈ ఏడాది జూన్‌లో కూడా మూడు సామాజిక వర్గాలు కలసి రూ.2.50 లక్షల చందాలు సేకరించి ఉమ్మడిగా పోతురాజు ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. అలాంటి ప్రశాంత ఇప్పటంలో జనసేనాని రగిల్చిన చిచ్చుతో విద్వేష వాతావరణం నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 31నే గ్రామానికి వచ్చి వెళ్లిన నాదెండ్ల.. ఇప్పటంలో రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇంటి ప్రహరీలు, షెడ్లు నిర్మించుకున్న వారికి మంగళగిరి– తాడేపల్లి నగర కార్పొరేషన్ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో రెండు విడతలు నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు ఫిబ్రవరిలోనే ఆక్రమణలకు సంబంధించి మార్కింగ్ చేశారు. తొలగింపుపై జూన్‌లో మైక్ ద్వారా ప్రచారం చేశారు. రూ.25 లక్షలతో సైడు కాలువల నిర్మాణం సమయంలోనే ఆక్రమణల పరిధిలోకి వచ్చిన 8 ఇళ్ల ప్రహరీ గోడలను ఆగస్టులోనే తొలగించి పనులు పూర్తి చేశారు. తాజాగా రూ.1.65 కోట్లతో రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి అక్టోబరులో టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. ఈ నెల 2వతేదీతో టెండర్ల గడువు ముగియగా పనులను సంబంధిత కాంట్రాక్టరుకు అప్పగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఇళ్లకు సంబంధించిన ప్రహరీ గోడల అక్రమణలను నాలుగో తేదీన తొలగించనున్నట్లు గత నెల 31, ఈ నెల 1వతేదీన ఇప్పటంలో పంచాయతీ మైక్ ద్వారా ప్రచారం కూడా చేశారు. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ గత నెల 31న గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో కరెంట్ పోవడంతో కావాలనే ప్రభుత్వం విద్యుత్తు నిలిపి వేసిందంటూ చిందులు తొక్కారని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. అనంతరం నాలుగో తేదీన ఆక్రమణల తొలగింపు సమయంలో అత్యధికులు ఎలాంటి అభ్యంతరం చెప్పకున్నా జనసేన మద్దతుదారులు కొందరు అడ్డుకునే యత్నం చేయడం, ఆ మరుసటి రోజే పవన్‌కళ్యాణ్ పర్యటించడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటంలో ఇన్నాళ్లూ టీడీపీ మద్దతుదారులే కాంట్రాక్టు పనుల్లో పెత్తనం చలాయించారు. వీరంతా ఇప్పుడు జనసేన ముసుగు కప్పుకున్నారు. ఇప్పటంలో గత మూడేళ్లలో రూ.2.85 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఇప్పటికే పూర్తి చేయగా మరో రూ.6 కోట్ల పనులు మంజూరై టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. పచ్చని పల్లెలో పవన్ చిచ్చు ప్రశాంతంగా ఉన్న ఇప్పటంలో బయటి నుంచి వచ్చిన కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం చిచ్చు రేపారు. సుమారు 2 వేల మంది జనాభా, 1,350 ఓటర్లున్న ఈ గ్రామం మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. రెండేళ్ల క్రితమే కార్పొరేషన్లో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పటంలోనూ రోడ్ల విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. 53 నివాసాలు, ఒక పంచాయతీ భవనం (మొత్తం 54) ఆర్ అండ్ బీ రోడ్డు స్థలాన్ని ఆక్రమించినట్లు గుర్తించి మార్కింగ్ చేశారు. ప్రతి ఇంటికీవెళ్లి తొలగింపుపై అవగాహన కల్పించారు. చట్ట ప్రకారం ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవాలని స్థానికులు సైతం కోరారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ రాకతో గ్రామంలో ప్రశాంతత భగ్నమైంది. సగం దూరం తగ్గుతుంది.. దుగ్గిరాల మండలంలోని ఐదు ఊర్లను వడ్డేశ్వరం వద్దనున్న హైవేతో ఇప్పటం కలుపుతుంది. దుగ్గిరాల ప్రాంతం నుంచి విజయవాడ రావాలంటే ప్రధాన మార్గంలో వెళ్తే 14 కి.మీ ప్రయాణించాలి. అదే ఇప్పటం మీదుగా ప్రయాణిస్తే 7 కి.మీ దూరం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటంలో ఆర్ అండ్ బీ రోడ్డు విస్తరణకు సంబంధిత శాఖ అధికారులు పనులు చేపట్టారు. మురుగు అంతా రోడ్డుపైకి.. ఇప్పటం మీదుగా వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు ఆక్రమణలతో ఇరుకుగా మారిపోవడం, సరైన డ్రైనేజీ లేకపోవడంతో మురుగు అంతా రోడ్డుపైనే చేరుతోంది. దీంతో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణానికి అధికారులు అనివార్యంగా చర్యలు చేపట్టారు. టెండర్లు పిలిచి 350 మీటర్ల పరిధిలో రోడ్డు నిర్మించేందుకు రూ.1.65 కోట్లతో పనులు చేపట్టారు. ఇళ్లకు నష్టం లేకుండా.. ఇప్పటంలో ప్రధాన రోడ్డు అంతా ఒకే వెడల్పుతో లేదు. ఒకచోట 60 అడుగులు, మరో చోట 75 అడుగులు.. ఇంకోచోట 118 అడుగులు చొప్పున ఉంది. దీంతో అధికారులు మార్కింగ్ చేసిన ప్రాంతాల్లో ఒకచోట ఎక్కువ ఆక్రమణలు, మరోచోట తక్కువ తొలగించే పరిస్థితి తలెత్తింది. అందరికీ ఒకేలా తొలగింపు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరడంతో బ్రిటిష్ హయాంలో వేసిన సర్వే రాళ్ల ఆధారంగా ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. సరిహద్దు రాళ్ల ఆధారంగా తొలగింపు చేపట్టగా కొన్ని నివాసాలు దెబ్బతినే ప్రమాదం ఉండడంతో అధికారులు ఇళ్లకు నష్టం జరగకుండా కేవలం ప్రహరీలు, అదనంగా నిర్మించిన షెడ్లను మాత్రమే తొలగించారు. రెండు నెలల క్రితం ఇలా ఆక్రమణలను తొలగించిన చోట డ్రైనేజీ నిర్మాణం చేయడంతో నివాసితులు తమ ఇళ్లకు మార్పులు సైతం చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితమే.. ఇప్పటంలో ఆక్రమణల గుర్తింపు మార్కింగ్ ఫిబ్రవరిలో చేపట్టడమే తొలిసారి కాదని స్థానికులు వెల్లడించారు. 30 ఏళ్ల క్రితం ఒకసారి, 15 ఏళ్ల క్రితం మరోసారి మార్కింగ్ చేశారని చెప్పారు. తాము ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన మాట వాస్తవమేనని, అందువల్ల సహకరించామని తెలిపారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియ రెండు నెలలుగా సాగుతున్నా ఈనెల 2వ తేదీన కొందరు అలజడికి తెర తీశారని గ్రామస్తులు పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలు కలసి మెలసి జీవించే తమ గ్రామానికి ఇప్పటిదాకా పోలీసులు వచ్చిందే లేదని పేర్కొంటున్నారు. వైఎస్సార్ కల్యాణ మండపం.. ఇప్పటంలో ప్రజల చందాలతో ప్రభుత్వ స్థలంలో కల్యాణ మండపాన్ని నిర్మించారు. గతంలో ఈ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు రూ.11 లక్షలు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో రూ.30 లక్షలు ఇవ్వగా ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్థలం సరిపోకపోవడంతో మరో కొంత ప్రభుత్వ స్థలాన్ని అదనంగా తీసుకున్నారు. స్థానిక పెద్దలు ఈ భవనానికి ‘డాక్టర్ వైఎస్సార్ కల్యాణ మండపం’ అని నామకరణం చేయాలని తీర్మానించగా జనసేన వర్గం కోర్టుకు వెళ్లగా వారి పిటిషన్‌ను కొట్టివేసింది. రికార్డుల ప్రకారం తీసుకున్నారు.. 2014లో ఇల్లు కట్టా. ఆక్రమణల తొలగింపులో మొదట తొలగించింది మా ఇంటి ప్రహరీనే. రోడ్డు పక్క ఖాళీగా ఉండడంతో గోడ కట్టా. గతంలో రెండుసార్లు మార్కింగ్ చేసినా చర్యలు తీసుకోలేదు. ఫిబ్రవరిలోనూ మార్కింగ్ చేసినా తొలగించరనుకున్నాం. అధికారులు రెండుసార్లు నోటీసులిచ్చి ప్రతి ఇంటికీ వచ్చి పరిస్థితిని వివరించారు. రికార్డుల్లో ఉన్నట్లుగానే తొలగించాలని వారిని కోరాం. దీంతో మా ఇంటి ప్రహరీ తొలగించారు. ఇదంతా రెండు నెలల క్రితమే జరిగింది. అందరివీ ప్రహరీలు, చిన్నచిన్న షెడ్లు మాత్రమే తొలగించారు. ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. – పొన్నంగి శివారెడ్డి, ఇప్పటం ఎవరి ఇల్లూ కూల్చలేదు రోడ్డు విస్తరణకు ఆక్రమణల తొలగింపు కోసం పూర్వం వేసిన సర్వే హద్దు రాళ్లను ప్రామాణికంగా తీసుకున్నారు. హద్దు దాటి కట్టిన నిర్మాణాలను మాత్రమే తొలగించారు. ఇళ్లు ఎవరికి వారు తమ సొంత స్థలంలోనే కట్టుకుని అవకాశం ఉన్నవారు గోడలు, షెడ్లు రోడ్డు ఆనుకుని నిర్మించారు. రెండు నెలల క్రితం తొలగించినప్పుడు ఎలాంటి వివాదం లేదు. ఎవరి ఆస్తులూ పోకపోయినా ఇప్పుడు గొడవలు సృష్టించారు. మా ఇంటి గోడ కూడా ప్రభుత్వ స్థలంలో కట్టిందే. దాన్ని తొలగించి డ్రైనేజీ కట్టారు. – మున్నంగి సాంబిరెడ్డి, బాలకోటిరెడ్డి, ఇప్పటం ప్రభుత్వానిది కాబట్టి ఇచ్చేశాం రోడ్డు ఆనుకుని చిల్లర కొట్టు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాం. ఆ స్థలం ప్రభుత్వానిది అని తెలుసు. ఖాళీగా ఉందని షెడ్డు వేసుకున్నాం. సర్వే చేసి దాన్ని తొలగిస్తామని అధికారులు ముందుగానే చెప్పి నోటీసులిచ్చారు. ఇంటికి వచ్చి కూడా చెప్పారు. ఇంటిని మాత్రం ముట్టుకోలేదు. ఆ స్థలం ఏదో రోజు తప్పకుండా తీసుకుంటారని తెలుసు. అందుకే అడ్డు చెప్పలేదు. – వీరంకి సుమలత, ఇప్పటం రెండు నెలల క్రితమే 8 ప్రహరీల తొలగింపు ఆది నుంచి టీడీపీ మద్దతుదారులైన యామినేని వెంకట కృష్ణారావు, మల్లిఖార్జునరావు నివాసాలు ఇవి. ఇప్పటంలో కొత్తగా రూ.1.65 కోట్లతో నిర్మించ తలపెట్టిన రహదారి అవసరాల మేరకు అక్రమణలను తొలగించాల్సి వస్తే ఈ ఇద్దరు అన్నదమ్ముల ఇంటి గుమ్మం కూడా కూల్చివేతల పరిధిలోకే వస్తుంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వీరిద్దరి ఇళ్లలో ముందువైపు గదుల్లో సగం దాకా ఆక్రమణలు తొలగించాలి. కానీ మానవత్వంతో వ్యవహరించిన ప్రభుత్వం శ్లాబ్ భాగం ఉండే ఇంటిని కూల్చకుండా గుమ్మం ముందు దాదాపు రెండు అడుగుల స్థలం కూడా వదిలేసి మిగిలిన ప్రహరీ గోడను మాత్రమే తొలగించింది. మొత్తం 54 భవనాలు ఆక్రమణల తొలగింపు పరిధిలోకి రాగా అందులో ఎనిమిది ఇళ్ల ప్రహరీలను రెండు నెలల కిత్రమే ఆగస్టు 28వ తేదీన తొలగించారు. ఇళ్లను తాకలేదు మా నాన్న సమయం నుంచి మేం టీడీపీ అభిమానులం. ఆక్రమణల తొలగింపు సమయంలో అధికారులు మా ఇంటికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ప్రహరీ మాత్రమే తొలగించారు. చాలా మంది ఇళ్లు ప్రభుత్వ స్థలంలోకి వచ్చినా అధికారులు వాటిని తాకలేదు. కేవలం ప్రహరీలే తీసేశారు. – యామినేని వెంకట కృష్ణారావు, ఇప్పటం -
దారంతా హడావుడే
సాక్షి, అమరావతి: మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో అధికారులు రోడ్డు పక్కన ఉండే ఆక్రమణలు తొలగించడంపై జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్.. పార్టీ నాయకులను, కార్యకర్తలను వెంట బెట్టుకొని వెళ్లి హడావుడి చేశారు. ఆక్రమణలు తొలగింపులో భాగంగా అధికారులు కొన్ని ఇళ్ల ప్రహరీ గోడలను మాత్రమే కూల్చివేయగా, గ్రామంలోని తమ పార్టీ అభిమానుల ఇళ్లను ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చి వేసిందంటూ హంగామా చేశారు. అధికారులు శుక్రవారం రోడ్లకు ఇరువైపుల ఉన్న ఆక్రమణలు తొలగించిన ఇప్పటం గ్రామంలో శనివారం పవన్‌కళ్యాణ్ పర్యటించారు. ఉదయం మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి నడుచుకుంటూ బయలుదేరిన ఆయన.. కాసేపటి తర్వాత తాను ప్రయాణించే కారు పైకెక్కి కూర్చొని ఇప్పటం గ్రామం వైపు వెళ్లారు. మధ్యలో నార్త్‌జోన్ డీఎస్పీ రాంబాబు శాంతిభద్రతల సమస్య గురించి పవన్‌కు నచ్చచెబుతుండగా వినిపించుకోకుండా.. ‘ఊరుకోండి సార్ మీరు చెబుతారు.. రేప్ చేసిన వారిని రక్షిస్తారు.. కూలగొట్టిన వారికి అండగా ఉంటారు’.. అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. గ్రామంలోకి చేరుకున్నాక, తొలగించిన ఆక్రమణల శిథిలాలను పరిశీలిస్తూ.. కొద్దిమంది స్థానికులతో తీవ్రంగా స్పందించి.. జనసేన అభిమానుల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చివేసిందంటూ ఆరోపించారు. ఆ సమయంలో ఆ పార్టీ నేత ఒకరు.. ‘నేను ఈ రోజు మీతో కలిసి ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడతానని చాలెంజ్ చేశాను’ అంటూ చెప్పగా.. ‘మాట్లాడు’ అంటూ పవన్ ఆవేశంగా ఆయనను మీడియా వైపు చూపించారు. ఇదేమైనా రాజమండ్రా.. రోడ్డు వెడల్పు చేయడానికి ఇదేమన్నా కాకినాడా.. లేదంటే రాజమండ్రినా అంటూ పవన్ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డు 15 అడుగుల పరిధిలోనే ఉందని.. అక్కడ ఇలాంటివి వర్తించవా అని అన్నారు. మార్చిలో జరిగిన తమ పార్టీ ఆవిర్భావ సభకు ఈ గ్రామస్తులు స్థలం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి మొన్న ఏప్రిల్‌లో ఆక్రమణల తొలగింపు పేరిట నోటీసులిచ్చారని చెప్పారు. ‘వైసీపీ గూండాలకు చెబుతున్నా.. మీరు ఇలాగే చేస్తా ఉండండి.. ఇడుపులపాయలో మీ మీద హైవే వేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వాన్ని కూల్చి పడదొబ్బాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. రూ.వెయ్యి కోట్లిచ్చి రెక్కీ నిర్వహించుకోండి.. హైదరాబాద్‌లో తన ఇంటి దగ్గర కొందరు తాగుబోతులు గొడవ చేయడాన్ని ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ.. ‘మీరు నన్ను ఏదో చేయడానికి రెక్కీలు, సుపారీలు, సున్నాలు, కన్నాలు ఏవేవో ప్లాన్ చేస్తున్నారు. రెక్కీ నిర్వహించుకోవడానికి రూ.250 కోట్లు కాకపోతే రూ.వెయ్యి కోట్లు ఇచ్చుకోండి’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పిచ్చి పనులకు పవన్‌కళ్యాణ్ గానీ, జనసేనగానీ భయపడదన్నారు. తాము వెనకడుగు వేసే ప్రసక్తేలేదు, గుర్తుపెట్టుకోండన్నారు. మరోవైపు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని.. ఎవరి ప్రాణాలు పోయినా అన్నింటికీ సజ్జలదే బాధ్యత అని హెచ్చరించారు. వారి భాషలోనే మాట్లాడండి ఇప్పటం గ్రామ పర్యటన అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మరోసారి పవన్ మాట్లాడుతూ.. ‘జన సైనికులకు చెబుతున్నా, ఇక నుంచి వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య భాషలో మాట్లాడితే అలాగే మాట్లాడండి. కాదు కూడదు అంటే వారి భాషలోనే మీరూ మాట్లాడండి. కేసులు, బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తామంటే వాటిని ఎదుర్కోవడానికి మీతో పాటు నేను సిద్ధంగానే ఉన్నాను. ఎంతకాలం వీరి అరాచకాలకు భయపడితే అంతకాలం వీరి రాక్షసత్వానికి అంతుండదు. ప్రతి లెక్కకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది’ అని అన్నారు. కాగా, పరామర్శ కోసం గ్రామానికి విచ్చేసిన పవన్‌కళ్యాణ్‌పై పలుచోట్ల పార్టీ శ్రేణులు పూలు చల్లడంపై గ్రామంలో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే, ఎంపిక చేసిన కొన్ని ఇళ్ల వారిని పవన్ పరామర్శించినా, వారికి ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో ఆయన పర్యటనపై గ్రామస్తులు పెదవి విరిచారు. గ్రామానికి ఇస్తానన్న రూ.50 లక్షలు ఇవ్వకుండా ఈ హంగామా ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు: ఇప్పటం గ్రామస్తులు
-
ఇప్పటం: ‘పవన్.. ఆ 50 లక్షలు ముందు తీసుకురండి’
సాక్షి, గుంటూరు: పవన్ కల్యాణ్‌పై ఇప్పటం గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటంలో ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. రోడ్ల విస్తరణకు ప్రహారీ గోడలు, మెట్లు మాత్రమే తొలగించారు. గ్రామ అభివృద్ధిని పవన్ కల్యాణ్ అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాలు తొలగించడానికి అధికారులు ఫిబ్రవరిలోనే మార్కింగ్ చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలంటూ ఏప్రిల్, మే నెలలోనే అధికారులు నోటీసులు ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఇప్పుడు పవన్ వచ్చి కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటం అభివృద్ధికి రూ. 50 లక్షలు ఇస్తానన్న పవన్ ఇప్పటికీ ఇవ్వలేదు. పవన్‌కు ఇప్పటంలో పర్యటించే అర్హత లేదంటు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటంలో అధికారులు అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నారని స్థానికులు స్పష్టం చేశారు. పథకం ప్రకారమే ఇప్పటంపై జనసేన కుట్ర చేస్తోంది. మా గ్రామం గురించి పవన్‌కు ఏమీ తెలియదు. ఇప్పటం గ్రామ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. 6కోట్ల నిధులు కేటాయించారు అని గ్రామస్తులు తెలిపారు. ఇది కూడా చదవండి: ‘పవన్ కల్యాణ్ పనికిమాలిన పిచ్చికూతలు కూస్తున్నాడు’ -
గన్ షాట్ : మంగళగిరిలో లోకేష్ పరిస్థితి దారుణంగా ఉందా..?
-
ఆ రెండు నియోజకవర్గాలపై చంద్రబాబుకు దిగులు
సాక్షి, అమరావతి: కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలపై టీడీపీ అధినేతకు దిగులు పట్టుకుందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి. విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రెండు చోట్ల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే పరువుపోతుందనే దిగులు చంద్రబాబుకు పట్టుకుందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన సందర్భంగా వచ్చిన జనం స్థానికులు కాదనే మాటతోపాటు అనేక అభాండాలు వేశారని.. తన పాత నియోజకవర్గం చంద్రగిరి మాదిరిగానే కుప్పం కూడా వచ్చే ఎన్నికల్లో తనను ఓడిస్తుందనే భయం బాబుకి పట్టుకున్నట్లు కనిపిస్తోందన్నారు. ఇక 2019 ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోయినప్పటి నుంచి మంగళగిరిలో పార్టీ కార్యక్రమాలు పెరిగిపోయాయని ఇటీవల సమీక్షలో చంద్రబాబు తెగ సంబరపడిపోయారన్నారు. పొత్తుల కారణంగానే మంగళగిరిలో టీడీపీ బలహీనపడిందని, గత ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. వాస్తవానికి తెలుగదేశం పుట్టినప్పటి నుంచి చూస్తే, మిత్రపక్షాలైన సీపీఎం, బీజేపీకి మంగళగిరి సీటు కేటాయించింది కేవలం నాలుగుసార్లు మాత్రమేనని తెలిపారు. -
AP: మంగళగిరి టౌన్షిప్లో ప్లాట్లకు ఈ–వేలం.. వారికి 20 శాతం రాయితీ
సాక్షి, అమరావతి: మధ్య ఆదాయ వర్గాలకు అనువుగా మంగళగిరిలో అభివృద్ధి చేసిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లోని ప్లాట్లను ఈ–వేలం వేయనున్నట్టు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సులభ వాయిదాల్లో నగదు చెల్లించే సౌలభ్యం కల్పించినట్టు పేర్కొన్నారు. ఎంఐజీ లే అవుట్–2లో మొత్తం 267 ప్లాట్లు ఉన్నాయని, వీటిలో 200 చదరపు గజాల్లో 68, 240 చదరపు గజాల్లో 199 ఉన్నాయన్నారు. చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు లే–అవుట్‌లోని 10 శాతం ప్లాట్లు రిజర్వు చేయడంతో పాటు 20 శాతం రాయితీ కల్పించామని, విశ్రాంత ఉద్యోగులకు 5 శాతం ప్లాట్లను రిజర్వు చేసినట్టు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్లాట్ ధరలో 10 శాతం మొత్తం చెల్లించి ప్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. అందిన దరఖాస్తులకు ఈ–లాటరీ నిర్వహిస్తామని, అందులో ఎంపికైనవారు ప్లాట్ కేటాయించిన నెలలోపు ఒప్పందం చేసుకుని ధరలో 30 శాతం సొమ్ము చెల్లించాలన్నారు. అనంతరం 6 నెలల్లో మరో 30 శాతం మొత్తం, ఏడాదిలోపు మిగిలిన 30 శాతం మొత్తం ధర చెల్లించవచ్చన్నారు. ప్లాట్‌కు మొత్తం ధర చెల్లించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు ప్రకటించారు. 40 శాతం మినహాయింపు ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం నికర అమ్మకపు ధరలో 60 శాతం మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయని, మిగిలిన 40 శాతంపై రిజి స్ట్రేషన్ చార్జీలను మినహాయింపు ఇచ్చిందని వివేక్‌యాదవ్ తెలిపారు. ప్లాట్ పొందిన వారు ధర మొత్తం ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తున్నట్టు వివరించారు. అన్నిరకాల ప్రభుత్వ అనుమతులు ఉన్న ఈ ప్లాట్లకు సమీపంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్లాట్లు పొందాలనుకునే వారు పది శాతం ప్రారంభ ధర చెల్లించి నవంబర్ 19వ తేదీ లోగా https://migapdtcp.ap.gov.in లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 0866–2527124 నంబర్లో సంప్రదించాలని సూచించారు. చదవండి: ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి! -
Pawan Kalyan: రెచ్చిపోయిన పవన్.. బూతులు మాట్లాడుతూ..
సాక్షి, మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి రెచ్చిపోయారు. తనదైన సినిమా స్టైల్లో ఆవేశంతో ఊగిపోతూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. కాగా, పవన్ మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో మంగళవారం మాట్లాడారు. నా** అంటూ రాయలేని భాషలో బూతులు వల్లించారు. పొలిటికల్ లీడర్ అనే స్పృహ లేకుండా.. ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్స్ చేశారు. అక్కడే ఫలితంలేకనే విజయవాడకు పయనం.. ఇదిలా ఉండగా.. విశాఖ గర్జన సందర్భంగా జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈనెల 16న జనవాణి కోసం 15వ తేదీ సాయంత్రం ఆయన విశాఖ వెళ్లారు. అదే రోజు మంత్రుల కార్లపై విశాఖ విమానాశ్రయంలో జనసేన రౌడీమూకలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అనంతరం, పవన్ హోటల్‌కు వెళ్లిపోవడం.. ఆ మర్నాడు జనవాణి జరిగే పోర్టు స్టేడియం వద్ద ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో జనవాణిని నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో దానిని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రుల కార్లపై దాడులకు పాల్పడి అరెస్ట్ అయిన రౌడీ మూకలను విడిచిపెట్టే వరకు విశాఖలోనే ఉంటానని పవన్ బీరాలు పలికారు. ఇలా, మూడు రోజుల పాటు విశాఖలో మకాం వేసి హంగామా చేసిన పవన్ తాను ఆశించిన ఫలితం దక్కకపోవడంతో విజయవాడకు తిరిగొచ్చారు. ఇది కూడా చదవండి: ‘ పవన్.. ఓపెనింగ్ షాట్లు, క్లైమాక్స్ డైలాగులు తప్ప నువ్వేమీ పీకలేవు’ -
కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ బూతులు
-
లోకేష్ పోటీ చేసేది అక్కడినుంచేనా.. ఆ నియోజకవర్గ సర్వేల్లో తేలిందేంటి?
ఆయన ఒక మాజీ సీఎం కుమారుడు. ఒకసారి దొడ్డిదారిలో మంత్రిగా కూడా వెలగబెట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థం కావట్లేదు. అందుకే కొంచెం గ్యారెంటీ ఉండే సీట్ కోసం వెతుక్కుంటున్నారు. ఇందుకోసం సర్వేలు కూడా చేయించుకున్నారట. ఇంతకీ ఆయనెవరో, ఆయన కథేందో తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గాన్ని వెతుక్కుంటున్నారనే ప్రచారం టీడీపీలో జోరుగా నడుస్తోంది. లోకేష్ చేసిన వ్యాఖ్యలతోనే పార్టీలో ప్రచారం ఊపందుకుంది. ఇటీవల మంగళగిరిలో జరిగిన ఓ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తానని మాత్రం చెప్పలేదు.దీంతో మంగళగిరిలో గెలుస్తాననే నమ్మకం లేకనే వేరే నియోజకవర్గం వెతుక్కుంటున్నారనే ఊహాగానాలు టీడీపీలో ఊపందుకున్నాయి. 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి బరిలోకి దిగారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత మూడేళ్లపాటు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. కరోనాకు భయపడి లోకేష్.. చంద్రబాబుతో కలిసి హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. పార్టీ ఓటమి తర్వాత నియోజకవర్గ నాయకులతో, కార్యకర్తలతో కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి లోకేష్ అప్పుడప్పుడు వచ్చినా నియోజకవర్గంలో మాత్రం అడుగుపెట్టేవారు కాదు. దీంతో సొంతపార్టీ నేతల్లోనే లోకేష్ తీరుపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. సీఎం వైఎస్ జగన్ బడుగు బలహీన వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. కీలకమైన పదవుల్లో బీసీలకు వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా, బీసీలకు చేయలేని ఎన్నో పనులను సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. దీనికితోడు మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యమైన బీసీ నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వారంతా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి.. పార్టీ సీనియర్ నేత మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వంటి వారితోపాటు క్షేత్రస్థాయి టీడీపీలో కూడా అనేక మంది వైఎస్సార్సీపీలో చేరారు. మంగళగిరిలో టీడీపీ రోజురోజుకు బలహీనపడుతున్న నేపథ్యంలో మళ్లీ ఓటమి తప్పదని భావించిన లోకేష్ వేరే నియోజకవర్గం వెతుక్కునే పనిలో ఉన్నట్లు సమాచారం. తాను పోటీచేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందో లోకేష్ వివిధ రూపాల్లో సర్వేలు చేయించుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. విజయవాడ తూర్పు, పెనుమలూరు, విశాఖసిటీలోని సెగ్మెంట్లు, భీమిలీ, హిందూపురం నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరం అయితే హిందూపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తన మామ బాలకృష్ణను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించి తాను హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ ఆశాకిరణం చెప్పుకునే లోకేష్ ఉన్న నియోజకవర్గంలో పోటీ చేయలేక మరో నియోజకవర్గం కోసం రాష్ట్రమంతా వెతుక్కునే పరిస్థితి ఏర్పడిందని పార్టీలో చర్చించుకుంటున్నారు. -
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు 12 నుంచి గ్రామసభలు
తాడికొండ: రాజధానిలో 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గతంలో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని రాజధాని పూలింగ్‌కు భూములిచ్చిన 29 గ్రామాలతో అమరావతి మెట్రోపాలిటన్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించగా తుళ్ళూరు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటూ రాజధాని అభివృద్ధికి అడుగులు వేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని నాన్ పూలింగ్ గ్రామాల ప్రజలు తమను కూడా మున్సిపాలిటీలో చేర్చాలని కోరిన నేపథ్యంలో ఆయా గ్రామాలను కూడా మున్సిపాలిటీలో కలిపేందుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా తుళ్ళూరు మండలంలోని పూలింగ్‌కు భూములిచ్చిన 16 గ్రామాలతో పాటు నాన్ పూలింగ్ గ్రామాలైన పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు గ్రామ పంచాయతీలను కలుపుతూ 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా శుక్రవారం గ్రామసభల షెడ్యూల్ ప్రకటించారు. ఈ గ్రామసభల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, వివరణలు సేకరించి తీర్మానం చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. తుళ్ళూరు ఎంపీడీవో శ్రీనివాసరావు శుక్రవారం ఈవోఆర్డీ సత్యకుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు సమావేశమై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12వ తేదీ సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. గ్రామసభల షెడ్యూల్ 12వ తేదీ లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రపురం, 13వ తేదీ దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, 14వ తేదీ వెంకటపాలెం, మందడం, ఐనవోలు, 15వ తేదీ నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, రాయపూడి, 16వ తేదీ మల్కాపురం, వెలగపూడి, పెదపరిమి, 17వ తేదీ శాఖమూరు, నేలపాడు, తుళ్ళూరు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల ప్రజలు గ్రామసభలకు హాజరై వారి అభిప్రాయాలను తెలపాలని ఎంపీడీవో కోరారు. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం 712వ రోజు రిలే నిరాహార దీక్షల్లో బహుజన పరిరక్షణ సమితి నాయకులు అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 712వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహర దీక్షల్లో శుక్రవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అమరావతి రైతులను మోసగించి మూడుపంటలు పండే 33 వేల ఎకరాలను పూలింగ్‌కు తీసుకున్న చంద్రబాబు వారికి ఏం న్యాయం చేశాడో చెప్పాలన్నారు. (క్లిక్ చేయండి: టీడీపీ నేత అనితకు బ్యాంకు నోటీసులు) రాష్ట్రంలోని 5 కోట్లమంది ప్రజల సంపదను ఒక ప్రాంతంలోనే కుమ్మరిస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహా నగరాల సరసన అమరావతిని చేరుస్తానంటూ మోసపూరిత హామీలతో చంద్రబాబు 29 గ్రామాల రైతులతో పాటు రాష్ట్ర ప్రజలను నమ్మించి భారీ అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలు వడివడిగా కొనసాగుతున్నాయని చెప్పారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
మంగళగిరిలో 51 అడుగుల పరమ శివుడి విగ్రహం.. ఆవిష్కరించిన దత్తన్న
మంగళగిరి (గుంటూరు): మంగళగిరిలో గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి (శివాలయం) వద్ద దాతలు మాదల వెంకటేశ్వరరావు, గోపికృష్ణ, వెంకటకృష్ణ దంపతులు నిర్మించిన 51 అడుగుల పరమ శివుడి విగ్రహాన్ని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ సభలో పేర్లు చదివే సమయంలో ఒక్క మహిళ పేరు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. తాను గతంలో మంగళగిరి విచ్చేసిన సందర్భంలో నృసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. 51 అడుగుల పరమశివుడి విగ్రహాన్ని నిర్మాణం చేసిన మాదల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తనచేత ఆవిష్కరింపచేయడం సంతోషంగా ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సహకరిస్తానని తెలిపారు. తొలుత బీజేపీ నాయకుడు జగ్గారపు శ్రీనివాసరావు నివాసంలో అల్పాహారం స్వీకరించి అనంతరం లక్ష్మీనృసింహస్వామి వారిని, గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకోగా ఆలయ ఈఓలు ఏ.రామకోటిరెడ్డి, జేవీ నారాయణలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, మార్కెట్ యార్డు చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి, శివాలయం ట్రస్ట్ బోర్టు చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మీరాధిక, బోర్డు సభ్యులు కొల్లి ముసలారెడ్డి, కొల్లి వెంకటబాబూరావు, అద్దంకి వెంకటేశ్వర్లు, నక్కా సాంబ్రాజ్యం, రేఖా వకులాదేవి, జంపని చిన్నమ్మాయి తదితరులు పాల్గొన్నారు. పరమ శివుడి విగ్రహ ఆవిష్కరణ అనంతరం కొబ్బరికాయ కొట్టిన గవర్నర్ దత్తాత్రేయ దేశం సుభిక్షంగా ఉండాలన్నదే ఆకాంక్ష.. గుంటూరు మెడికల్: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారని, దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డులోని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు గృహంలో ఆయన విందు స్వీకరించారు. పలువురు బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ గుంటూరు నగర బీజేపీ నేతలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో మాదిరిగా అలై బలై కార్యక్రమాన్ని ఏపీలో కూడా నిర్వహిస్తామన్నారు. గుంటూరులో ఉన్న శ్రేయోభిలాషులను కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ నేతలు మాగంటి సుధాకర్ యాదవ్, జూపూడి రంగరాజు, యడ్లపాటి స్వరూపారాణి, మాధవరెడ్డి, రంగ, వెలగలేటి గంగాధర్, విజయ్, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, పారిశ్రామిక వేత్త అరుణాచలం మాణిక్యవేల్, విశ్రాంత డీఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, ఉన్నారు. -
టీడీపీకి గంజి చిరంజీవి రాజీనామా
మంగళగిరి: టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సహా ఏ ఒక్క సామాజికవర్గానికి గౌరవం లేదని మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీలో పెత్తనమంతా ఒకే సామాజిక వర్గానిదేనని ఆరోపించారు. తనకు జరిగిన అవమానానికిగానూ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మంగళగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన తనకు పార్టీలో జరిగిన అవమానంపై కన్నీటి పర్యంతమయ్యారు. 2014లో సీటు ఇచ్చినట్లే ఇచ్చి తనను సొంత పార్టీ నేతలే ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఓడించిన వారే ఇప్పుడు పార్టీని నడిపిస్తూ దాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నుంచి దూరం చేసేందుకే తనకు పార్టీ రాష్ట్ర పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. మంగళగిరి ప్రజల నుంచి తనను ఎవరూ దూరం చేయలేరన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీలకు గౌరవం లేదన్నారు. అవమానాలకు గురిచేస్తూ బీసీలను ఏమి ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. చేనేత నాయకుడుగా ఉన్న తనను పార్టీ నుంచి దూరం చేసేందుకు మానసికంగా హత్య చేశారన్నారు. 2019లో చివర వరకు తనకే సీటు అని చెప్పి మోసం చేసినా పార్టీ కోసం భరించాననన్నారు. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు, కుట్రలు తట్టుకోలేకే టీడీపీకి రాజీనామా చేస్తున్నానన్నారు. తన ఆవేదన గురించి లోకేష్‌తో పాటు టీడీపీ నాయకులందరికి తెలిసినా పట్టించుకోలేదని వాపోయారు. ఎన్టీఆర్ ఆశయాలకు వెన్ను పోటు పొడిచి పార్టీలో బీసీలకు స్థానం లేకుండా చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో బీసీ, ఎస్టీ, ఎస్టీలతోపాటు అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసేవారితో కలిసి నడుస్తానని తెలిపారు. -
నిచ్చెనలాగి.. కూలీలతో కలిసి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి (గుంటూరు): ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) వ్యవసాయ సీజన్ వస్తే రైతుగా పొలంలో పనులు చేస్తుంటారు. ఎమ్మెల్యే ఆర్కేకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. రాజకీయాలలో, ప్రజాసేవలో నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూనే తనకెంతో మక్కువైన వ్యవసాయ పనులను రాజీపడకుండా చేస్తుంటారు. అందులో భాగంగా గురువారం ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలోని తన పొలంలో కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేశారు. కలుపు ఏరి పొలంలో నాట్లు వేయడానికి మెరకపల్లాలను చదును చేయడానికి నిచ్చెనలాగారు. అనంతరం నారుమడికి విత్తనాలు చల్లి, కంది నాటారు. వ్యవసాయ కూలీలతో కలిసి పొలంలోనే వారితోపాటు భోజనం చేసి వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు. -
వివాదంలో మంగళగిరి టీడీపీ కార్యాలయం
సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వివాదంలో చిక్కుకుంది. పార్టీ కార్యాలయం నిర్మించిన కాంట్రాక్టర్‌కు డబ్బులు ఎగ్గొట్టింది పార్టీ. దీంతో వ్యవహారం కోర్టుకు చేరింది. పార్టీ కార్యాలయం నిర్మాణ బాధ్యతల్ని ఎస్ఆర్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించింది టీడీపీ. ప్రెకా సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సబ్ కాంట్రాక్టు ఇచ్చింది ఎస్ఆర్ఆర్ కంపెనీ. రూ. 21 కోట్లతో మంగళగిరిలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించింది ప్రెకా సొల్యూషన్. నిర్మాణ బిల్లులను చెల్లిస్తామని ప్రెకా సొల్యూషన్కు చెప్పిన టీడీపీ.. బిల్లు చెల్లింపుల్లో ఎస్ఆర్ఆర్ లిమిటెడ్‌కు సంబంధం లేదని తేల్చేసింది. అయితే బిల్లులు చెల్లించాలని ప్రెకా సొల్యూషన్ అడిగినా పట్టించుకోలేదు టీడీపీ. దీంతో ప్రెకా సొల్యూషన్స్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో పాటు ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టు లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. అయితే కోర్టు నోటీసులు ఇచ్చినా జాప్యం చేయడంతో ఆర్బిటర్ పిటిషన్ దాఖలు చేసింది ప్రెకా. వివాద పరిష్కారానికి రిటైర్డ్ జస్టిస్ స్వరూప్రెడ్డిని నియమించింది తెలంగాణ హైకోర్టు. -
గుంటూరులో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్ బుల్స్, రూపెక్స్ యాప్స్ నుంచి రూ.20,000 లోన్ తీసుకుంది. రూ.20 వేల రుణానికి లోన్ యాప్స్ నిర్వాహకులు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. అయినా ఇంకా డబ్బులు కట్టాలని, లేకుంటే ప్రైవేటు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని కేటుగాళ్లు బెదిరించారు. రుణం తీర్చకపోతే బంధువులకు ఫోన్ చేసి చెప్తానని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. వాట్సాప్‌లో అసభ్యకర మెసెజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రత్యూష ఇంటిపైన ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు తల్లిదండ్రులకు, భర్తకు సెల్ఫీ వీడియో పంపింది. ఈ మేరకు ప్రత్యూష భర్త మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: పట్టమంటాడు... వదలమంటాడు! ►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి
-
నారా లోకేశ్ టీమ్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
సాక్షి, మంగళగిరి: టీడీపీ నేత నారా లోకేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. లోకేశ్‌పై మంగళగిరి మండల టీడీపీ మాజీ అధ్యక్షురాలు కృష్ణవేణి తీవ్ర విమర్శలు చేశారు. ట్విటర్లో మార్ఫింగ్‌తో తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్, అతని ఐటీ టీంపై చర్యలు తీసుకోవాలని ఆమె.. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
లోకేశ్‌పై మంగళగిరి మండల టీడీపీ మాజీ అధ్యక్షురాలు కృష్ణవేణి తీవ్ర విమర్శలు
-
సినిమాను మించిన పవన్ ‘పవర్’ డ్రామా
సాక్షి, అమరావతి: తెలంగాణలో తన పర్యటనను ముగించుకుని అకస్మాత్తుగా మంగళగిరికి వచ్చి కరెంట్ కోతలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరి సమీపంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో 5 నిమిషాలపాటు ట్రిప్ అయి కరెంట్‌పోతే ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగానే ఉందని.. పవన్ ‘పవర్’ డ్రామా సినిమాను మించిందని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేశారు. ఫొటోలు తీయండి.. జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద జనరేటర్ ఉన్నప్పటికీ కరెంట్ అంతరాయం వచ్చినప్పుడు ఓ 5 నిమిషాలపాటు దానిని ఆన్ చేయకుండా ఉంచారు. సరిగ్గా ఆ సమయానికి ప్రత్యేకంగా పిలిపించుకున్న కొద్దిమంది విలేకరులకు అదంతా చూపించి ‘ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?’.. అంటూ పవన్ తన డ్రామాను రక్తికట్టించారు. అదే సమయంలో పవన్‌కల్యాణే ‘ఫొటోలు తీయండి’ అంటూ పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు. ఇదంతా పూర్తయ్యాక జనరేటర్‌ను ఆన్ చేయించారు. ఆ తర్వాత కరెంట్ వచ్చినప్పటికీ 20 నిమిషాల పాటు కావాలనే జనరేటర్ నడిపించారు. వాస్తవానికి పవర్‌కట్ అయితే 5 నిమిషాలకే తిరిగి కరెంట్ సరఫరా మొదలవదు. కానీ, జనసేన కార్యాలయానికి కరెంట్‌ను సరఫరా చేసే తెనాలి రోడ్డులోని మంగళగిరి 33/11 కేవీ సబ్ స్టేషన్లో ఈదురుగాలులకు రాత్రి 8.30–8.35 మధ్య 5 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడినట్లు సబ్‌స్టేషన్ రికార్డుల్లో నమోదైంది. అంటే సాంకేతిక కారణాలతో అంతరాయం ఏర్పడినట్లు తెలిసిపోతోంది. తెలంగాణ పర్యటనకు వచ్చిన పవన్ అది ముగించుకుని హడావుడిగా మంగళగిరికి బయల్దేరి మధ్యలో కొంతమంది మీడియా ప్రతినిధులకు మాత్రమే సా. 5.30కు ఫోన్లుచేసి ‘పవన్‌కల్యాణ్ మీతో ప్రత్యేకంగా మాట్లాడతారు.. 6.30 కల్లా పార్టీ కార్యాలయానికి రావాలి’.. అంటూ సమాచారమిచ్చారు. కానీ, శుక్రవారం ఎంపిక చేసుకున్న విలేకరులకు ఫోన్లుచేసి పిలిపించుకున్నారు. పవర్ కట్ కాదు.. ఫీడర్ ట్రిప్ అయ్యింది విద్యుత్ అంతరాయంపై పవన్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, కోత అనేది అసలు లేనే లేదని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జే పద్మజనార్దనరెడ్డి స్పష్టంచేశారు. ఓవర్ లోడ్‌తో ఫీడర్ ట్రిప్ అయ్యిందని, షిఫ్ట్ ఆపరేటర్ వెంటనే గుర్తించి ఐదు నిమిషాల్లో సరిచేశారని.. 20 నిమిషాలు పట్టిందనడం అవాస్తవమన్నారు. ఇదే అంశంపై ఏపీసీపీడీసీఎల్ మంగళగిరి ఏడీఈ ఏ సత్యనారాయణ కూడా స్పందిస్తూ.. జనసేన కార్యాలయం ఉన్న ప్రాంతంలో ఎటువంటి విద్యుత్ కోతలు విధించలేదన్నారు. -
ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు.. సినిమా మధ్యలో భర్త బయటకువచ్చి..
మంగళగిరి(గుంటూరు జిల్లా): భర్త అదృశ్యంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలోని భార్గవపేటకు చెందిన పడవల బాలసుబ్రహ్మణ్యం శనివారం భార్య బేబి అఖిలతో కలసి విజయవాడ సినిమాకు వెళ్లాడు. సినిమా మధ్యలో బయటకు వచ్చిన సుబ్రహ్మణ్యం నేరుగా మంగళగిరిలోని తన ఇంటికి చేరుకుని బ్యాగు సర్దుకుని ఎటో వెళ్లిపోయాడు. చదవండి: మరో మహిళతో ఆర్ఎంపీ సహజీవనం, భార్యకు విషయం తెలియడంతో.. సినిమా హాలులో ఉన్న భార్య బేబి అఖిల ఎంత సేపటికీ భర్త హాలులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి చేరుకుని చూడగా అప్పటికే భర్త బ్యాగు సర్దుకుని వెళ్లిపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు: వాసిరెడ్డి పద్మ
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత బోండా ఉమాకు నోటీసులు ఇచ్చామని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. నోటీసులకు నిరసనగా టీడీపీ మహిళలతో ధర్నాలు చేయిస్తోందని మండిపడ్డారు. మహిళా కమిషన్‌ను చంద్రబాబు గౌరవిస్తారని అందరూ భావించారు. కానీ, అలా జరగలేదన్నారు. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలని చెప్పడానికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇవాళ ధర్నాలకు పిలుపునివ్వడం, మహిళా కమిషన్ దగ్గర ఆందోళన చేయడం సరికాదని వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. హాస్పిటల్లో నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. అత్యాచార బాధితుల పట్ల ఎలా ఉండాలనేది చెప్పాలనుకున్నామని తెలిపారు. చంద్రబాబు, బోండా ఉమా చేసిన తప్పులు ఏంటో మీడియా ద్వారా చెప్తున్నామని అన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరులవి పది తప్పులు ఉన్నాయని ఆమె మీడియాకు వివరించారు. మొదటి తప్పు: పదుల సంఖ్యలో బాధితురాలి దగ్గరికి వెళ్లడం రెండో తప్పు: గుంపులుగా వచ్చి గట్టిగా అరవడం మూడో తప్పు: బాధితురాలిని భయకంపితులు చేయడం నాలుగో తప్పు: సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మంది మార్బలంతో వచ్చారు ఐదో తప్పు: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను అడ్డుకోవడం ఆరో తప్పు: తనను పరామర్శ చేయకుండా అడ్డుకోవడం ఏడో తప్పు: తనను బెదిరించడం, విధులను అడ్డుకోవడం ఎనిమిదో తప్పు: చంద్రబాబు వ్యక్తిగతంగా నన్ను బెదిరించడం తొమ్మిదో తప్పు: బోండా ఉమా అనుచిత పదజాలంతో దూషించడం పదో తప్పు: కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తిప్పడం అయితే ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్తామని ఆమె తెలిపారు. అంతకు ముందు మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు, వంగలపూడి అనిత ముట్టడించడానికి యత్నించారు. విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను కలిసి టీడీపీ మహిళా నేతలు.. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చాంబర్‌కు వెళ్లి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అయితే అక్కడితో ఆగకుండా ఆమె చాంబర్లో వాసిరెడ్డి పద్మతో టీడీపీ మహిళా నేతలు వాగ్వాదానికి దిగి నానా రచ్చ చేశారు. -
సీఎం జగన్‌ను కలిసిన క్రీడాకారిణి షేక్ సాదియా అల్మస్
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ విన్నర్ షేక్ సాదియా అల్మస్ కలిశారు. షేక్ సాదియా అల్మస్ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2021 డిసెంబర్లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించారు. షేక్ సాదియాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ ప్రకటించారు. అదే విధంగా మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, షేక్ సాదియా తండ్రి సంధాని, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
స్నేహితుడి భార్యపై కన్నేశాడు.. గోవా ట్రిప్ ప్లాన్ చేసి..
సాక్షి, గుంటూరు: రెండు సంవత్సరాల కిందట తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఇద్దరు యువకుల మిస్సింగ్ కేసును ఛేదించినట్లు నార్త్ జోన్ డీఎస్పీ జే రాంబాబు తెలిపారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన శాఖమూరి అజయ్‌సాయి, గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన చల్లపల్లి ఫణికృష్ణ(25)లు స్నేహితులు. వారిద్దరూ స్నేహితులతో కలిసి మద్యం సేవించేవారు. ఈ నేపథ్యంలో హతుడు చల్లిపల్లి ఫణికృష్ణ, నిందితుడు అజయ్‌సాయి భార్యపై కన్నేశాడు. ఈ విషయాన్ని సాయికి చెప్పడంతో పాటు ఆమె డెలివరీకి వెళ్లిన సమయంలో ఎప్పుడూ వస్తుందంటూ వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఫణికృష్ణను అంతమొందించేందుకు సాయి ప్రణాళిక రూపొందించాడు. ఇద్దరూ కలిసి గోవా ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 16వ తేదీన రాత్రి 11 గంటలకు కారులో ఇద్దరూ బయలేదేరారు. మంజునాథ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వేసిన స్థలాలలో పిచ్చి మొక్కలు పెరిగి ఉండడంతో ఖాళీ స్థలంలో కూర్చుని ఇద్దరూ మద్యం సేవిస్తున్నారు. చదవండి: (కోడి కూరతో అన్నం పెట్టమన్నాడు.. ఆ మాటకు గొడ్డలితో నరికేశాడు) అజయ్‌సాయి భార్య గురించి అసభ్యంగా మాట్లడడంతో ఆగ్రహం చెందిన అతను పక్కనే ఉన్న రాయితో కృష్ణ తలపైన కొట్టి చంపాడు. ముందుగా అనుకున్న ప్రకారం కారులో తెచ్చుకున్న పెట్రోల్‌తో హతుడిని తగులపెట్టి సమీపంలో తన పర్సు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డు వదిలి కారులో తన బట్టల బ్యాగ్‌ను వుంచి హతుడికి చెందిన బట్టల బ్యాగ్, సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్, ఎస్డీ కార్డు తీసుకుని పారిపోయాడు. చదవండి: (వివాహేతర సంబంధం.. ఒకే గదిలో ముగ్గురు.. చివరకు..) అదే నెలలో 19వ తేదీన సాయి తల్లి శైలజ తన కుమారుడితోపాటు అతని స్నేహితుడు ఫణికృష్ణ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి అజయ్‌సాయి అదృశ్యమయ్యాడు. చివరకు ఈనెల 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య చేసిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో నిందితుడిని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ వి భూషణం, తాడికొండ ఎస్ఐ వెంకటాద్రి, సిబ్బంది పాల్గొన్నారు. -
గుంటూరు జిల్లా మంగళగిరిలో గ్రీన్ ఛానల్
-
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
-
ఏపీ: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ నూతన డీజీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆయన 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. చదవండి: (సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్) -
ఇస్కాన్ సంకల్పం