రాజకీయాలు చేయడానికే మా ఇళ్లకు వచ్చారా?.. జనసేన నాయకులపై లబ్ధిదారుల ఫైర్‌

TIDCO houses Beneficiaries fires on Janasena Leaders at Mangalagiri - Sakshi

సాక్షి, గుంటూరు: మంగళగిరిలో జనసేన నాయకులపై టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లను పరిశీలించడానికి జనసేన కార్యకర్తలు మంగళగిరిలోని జగనన్న నగర్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులను లబ్ధిదారులు అడ్డుకున్నారు.

ప్రభుత్వం మాకు అన్ని సదుపాయాలతో టిడ్కో ఇళ్లు అందిస్తుంటే.. మీరెందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాలు చేయడానికే మా ఇళ్లకు వచ్చారా అంటూ జనసేన నాయకులను లబ్ధిదారులు నిలదీశారు. జగనన్న నగర్‌ నుంచి జనసేన నాయకులు వెంటనే వెళ్లిపోవాలని లబ్ధిదారులు నినాదాలు చేశారు. 

చదవండి: (ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top