Mangalagiri MLA Alla Ramakrishna Reddy Denied Yellow Media Rumours - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి ఎవరూ నన్ను దూరం చేయలేరు: ఎమ్మెల్యే ఆర్కే

Apr 4 2023 1:22 PM | Updated on Apr 4 2023 4:08 PM

Mangalagiri MLA Alla Ramakrishna Reddy denied yellow media rumours - Sakshi

ఆ కారణాలతోనే మీటింగ్‌కు రాలేకపోయా. దానికే ఎల్లో మీడియా ఇష్టమొచ్చినట్లు.. 

సాక్షి, గుంటూరు: ‘‘రాజకీయాల్లో ఉన్నంత కాలం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే కొనసాగుతా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎవరూ నన్ను దూరం చేయలేరు’’.. కీలక సమావేశానికి గైర్హాజరు కావడంతో తనపై ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఒక్క స్టేట్‌మెంట్‌తో కొట్టిపాడేశారు మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి. 

సోమవారం జరిగిన ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం ఉంది.  పంటికి సర్జరీతో పాటు ఇంట్లో శుభకార్యం ఉండటం వల్ల మీటింగ్‌కి వెళ్లలేకపోయా. దానికి ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు పిచ్చిపిచ్చి రాతలు రాసింది. ఒక వర్గం మీడియా పనికట్టుకుని విష ప్రచారం చేసింది. వ్యక్తులు, కులాల మధ్య చిచ్చులు పెట్టి మనిషి మనిషిని విడదీసి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నాడు అంటూ ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. 

అసలు చంద్రబాబు మీటింగ్ పెడితే ఎవరెవరు వచ్చారో.. ఎవరెవరు రాలేదో యెల్లో మీడియా ఎందుకు రాయదు. గత ప్రభుత్వంలో మూడు శాఖల మంత్రిగా పనిచేసిన నారా లోకేష్.. ఏనాడైనా మంగళగిరి మున్సిపల్ సమావేశానికి వచ్చాడా?. జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చాడా?.  మరి లోకేష్ గురించి ఎందుకు ఎల్లో మీడియా ప్రస్తావించిందా? అని నిలదీశారాయన. చంద్రబాబు నాయుడు-ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ నుంచి పేదల్ని విడదీయలేరని, మంగళగిరిలో మళ్లీ గెలిచేది వైఎస్సార్‌సీపీనే అని ఎమ్మెల్యే  ఆర్కే  ఘంటా పథంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement