వైఎస్సార్‌సీపీ వెంకటగిరి సమన్వయకర్త రామ్‌ కుమార్‌రెడ్డిపై అక్రమ కేసు | Illegal case file against Venkatagiri YSRCP Incharge Nedurumalli Ramkumar Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ వెంకటగిరి సమన్వయకర్త రామ్‌ కుమార్‌రెడ్డిపై అక్రమ కేసు

Feb 22 2026 2:34 PM | Updated on Feb 22 2026 2:55 PM

Illegal case file against Venkatagiri YSRCP Incharge Nedurumalli Ramkumar Reddy

సాక్షి,నెల్లూరు: వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. విద్యుత్‌ ఛార్జీలపై పెంపుపై చేపట్టిన నిరసనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ అక్రమ కేసుపై నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి స్పందించారు. ‘2024 డిసెంబర్‌లో జరిపిన నిరసనకు నేడు నోటీసులు పంపించారు. 2024లో జరిగిన నిరసన ఘటనలో పోలీసులు నాపై అక్రమ కేసు నమోదు చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు’అని వ్యాఖ్యానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement