మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం ప్రారంభం

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రతి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరుగుతోందన్నారు.
రాష్ట్రంలో ఇంత గొప్ప పరిపాలన ఎప్పుడూ చూడలేదన్నారు. నేను 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడూ రాలేదంటూ పొగడ్తలు కురిపించారు. చంద్రబాబు, పవన్‌లు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఎవరెన్ని మాట్లాడినా ప్రజల అండతో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.
చదవండి: (యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్)
మరిన్ని వార్తలు :