వైఎస్‌ జగన్‌పై ఈర్ష్య.. ‘సచివాలయం’ పదం తొలగింపు | Change of names of village and ward secretariats | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై ఈర్ష్య.. ‘సచివాలయం’ పదం తొలగింపు

Feb 13 2026 5:13 AM | Updated on Feb 13 2026 5:13 AM

Change of names of village and ward secretariats

గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు 

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుగా నామకరణం

సాక్షి, అమరావతి: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల ముందుకు తెచ్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పా­టు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవ­స్థను నీరుగార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. సచివాలయం అనే పదాన్ని తొలగిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణ­యం తీసుకుంది. గ్రామ సచివాలయాన్ని ‘స్వర్ణ గ్రామ’­గా, వార్డు సచివాలయాన్ని ‘స్వర్ణ వార్డు’గా మార్పు చేశారు. అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను సైతం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖగా మార్చారు. 

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌లో మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ గురువా­రం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2019 అక్టోబర్‌ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సేవలన్నింటినీ వారి ఇంటి వద్దనే అందించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును కొనసాగిస్తే వైఎస్‌ జగన్‌ గుర్తుకు వ­స్తారనే ఈర్ష్య ­తోనే చంద్రబాబు సర్కారు పేర్లను మా­ర్చిందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చినప్పటికీ ప్రజలందరూ గ్రామ, వార్డు సచివాలయాలనే పిలుస్తారని, పేరు మార్చినంత సులభంగా ప్ర­జ­ల మన­సు­ల నుంచి ఆ ముద్రను తొలగించలేరని ఉన్నతాధి­కా­రి ఒకరు వ్యాఖ్యానించారు. గ్రామ, వా­ర్డు సచివాలయాల వ్య­­వస్థను ఎవరు ఏర్పాటు చేశా­ర­నేది రాష్ట్ర చరిత్ర­లో చిరస్థాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేశాయి. చంద్రబాబు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను రద్దు చేయడం లేదా మార్పు చేయ­డం తప్ప ఆ పథకా­ల­ను అమలు చేయడం లేదనే విషయం ప్రజలు గుర్తించారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement