మంగళగిరిలో కొకైన్‌ ఎలా దొరికింది? | Liberation Congress Vijay Kumar Serious On CBN Govt | Sakshi
Sakshi News home page

మంగళగిరిలో కొకైన్‌ ఎలా దొరికింది?

Jun 29 2025 8:04 AM | Updated on Jun 29 2025 12:06 PM

Liberation Congress Vijay Kumar Serious On CBN Govt

దీనివెనుక ఎవరున్నారో ఎందుకు తేల్చలేదు

సీఎం నియోజకవర్గం కుప్పంలో గంజాయి కోసం టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు

రాయదుర్గంలో టీడీపీ నేత మామిడి తోటలో గంజాయి సాగు 

రాష్ట్రంలో నెలకు రూ.2 వేల కోట్ల గంజాయి వ్యాపారం 

మాఫియా నుంచి ప్రభుత్వంలోని పెద్దలకు కమీషన్లు.. అందుకే ఉదాసీనం

లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జీ.ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌. విజయ్‌కుమార్‌

సాక్షి, అమరావతి: ‘నగరాల్లో డ్రగ్స్‌ మాఫియా విక్రయించే కొకైన్‌ మంగళగిరిలాంటి పట్టణంలో ఎలా దొరికింది? దీని వెనుక ఎవరున్నారో ఎందుకు తేల్చలేదు?’ అని కూటమి ప్రభుత్వాన్ని లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ జి.ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌.విజయ్‌కుమార్‌ నిలదీశారు. 

తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని... గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో ఒక్క డీ–అడిక్షన్‌ సెంటర్‌ కూడా లేదని, సీఎం నియోజకవర్గం కుప్పంలో గంజాయి మత్తులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారని పేర్కొన్నారు. రాయదుర్గం టీడీపీ నేత మామిడి తోటలో గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. లిక్కర్‌ స్కామ్‌ అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం అంతకుమించిన స్థాయిలో గంజాయి దందా జరుగుతుంటే ఏం చేస్తోందని ప్రశి్నంచారు. కూటమి సర్కారు వచ్చాక నెలకు రూ.2 వేల కోట్ల గంజాయి వ్యాపారం జరిగిందని దీనిపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ వేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు. 

పోలీసు శాఖలోని కొన్ని కలుపు మొక్కల కారణంగా డ్రగ్స్, గంజాయి మాఫియా విస్తరించి యువత జీవితాలను నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాలో తాడేపల్లి ప్రేమ్‌ కుమార్, దాసరి సురేష్‌ కుమార్‌ (ఎస్సీ), లంకా పవన్, పట్నాల చిన్న సత్యనారాయణ (బీసీ), దారపు దుర్గ, తమ్మకట్ల అశోక్‌ కుమార్‌ ను గంజాయి అక్రమ కేసులో ఇరికించారని, బొమ్మూరు సీఐ లక్ష్మణరెడ్డి, రాజానగరం సీఐ సుభాష్‌ మధ్య జరిగిన సంభాషణ సంచలనం రేపుతోందని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. అధికారంలోకి వచి్చన వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామన్న మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం.. అమాయకులపై అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. కొత్త కొత్త దారుల్లో గంజాయి సరఫరా అవుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డ్రగ్స్‌ కట్టడికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో తెస్తే.. ఈ సర్కారు ఈగల్‌ ను తీసుకొచి్చందని, ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం ఈవెంట్లు, స్టేట్‌ మెంట్లకే పరిమితవుతోంది తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. గంజాయి మాఫియా కమీషన్ల కోసమే ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కమీషన్లలో 30 శాతం పోలీసులకు.. మిగిలింది అధికారంలో ఉన్నవారికి వెళ్తోందన్నారు. గంజాయి స్మగ్లింగ్‌ లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయిందని పేర్నొన్నారు. 

పాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకొచి్చన సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాలను పటిష్ఠంగా నిర్వహించాలని విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. యువత కోసం, వారి భవిష్యత్తు నిరీ్వర్యం కాకుండా పోరాటం చేస్తామని.. ప్రభుత్వం మెడలు వంచి యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా కార్యాచరణతో ముందుకెళ్తామని తేలి్చచెప్పారు.   

Advertisement
 
Advertisement
Advertisement