నిప్పులు చెరిగిన స్టార్క్‌.. 64 పరుగులకే కుప్పకూలిన బంగ్లా | Starc-6-Wkts-Cummins-3-Wkts-Bangladesh 64 Runs All-out Vs AUS 2nd Test | Sakshi
Sakshi News home page

నిప్పులు చెరిగిన స్టార్క్‌.. 64 పరుగులకే కుప్పకూలిన బంగ్లా

Aug 22 2026 9:32 AM | Updated on Aug 22 2026 10:07 AM

Starc-6-Wkts-Cummins-3-Wkts-Bangladesh 64 Runs All-out Vs AUS 2nd Test

Photo Credit: Twitter

మాకే వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ 64 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ బౌల‌ర్లు మిచెల్ స్టార్క్‌, క‌మిన్స్ బంతితో నిప్పులు చెర‌గ‌డంతో బంగ్లా బ్యాట‌ర్లు విల‌విల్లాడిపోయారు. షోరిఫుల్ ఇస్లామ్ (14) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వగా, ఆసీస్ బౌల‌ర్ల ధాటికి న‌లుగురు బంగ్లా బ్యాట‌ర్లు డ‌కౌట్‌గా వెనుదిర‌గ‌డం గ‌మ‌నార్హం. మ‌రో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమిత‌మ‌య్యారు.

స్టెయిన్‌ను అధిగమించిన స్టార్క్‌
ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ ఆరు వికెట్ల‌తో చెల‌రేగితే, క‌మిన్స్ మూడు, హాజిల్‌వుడ్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. ఈ క్ర‌మంలో స్టార్క్ టెస్టుల్లో మ‌రో రికార్డు అందుకున్నాడు. ఆరు వికెట్లు తీసిన స్టార్క్ టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్‌-10లోకి ప్ర‌వేశించాడు. 107 టెస్టుల్లో 441 వికెట్లు తీసిన స్టార్క్.. ఈ క్ర‌మంలో సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్ డేల్ స్టెయిన్ (440 వికెట్లు)ను అధిగ‌మించాడు. 

ఇక ముర‌ళీధ‌ర‌న్ (800 వికెట్లు) తొలి స్థానంలో ఉండ‌గా, షేన్ వార్న్ (708 వికెట్లు), అండ‌ర్స‌న్ (704 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం టాప్‌-10లో ఉన్న బౌల‌ర్లలో నాథ‌న్ లియోన్ (568 వికెట్లు) , స్టార్క్ మాత్ర‌మే యాక్టివ్‌గా ఉన్నారు.  ఇక టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు ఇది నాలుగో అత్యల్ప స్కోరు. అనంతరం ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.

చదవండి: ఇంగ్లండ్‌ చేతిలో చావుదెబ్బ; భార‌త్‌కు క‌లిసొచ్చిన పాక్‌ ఓటమి!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement