సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌ పరాజయం | Satwik and Chirag defeated in Hong Kong Open semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌ పరాజయం

Nov 22 2026 4:15 AM | Updated on Nov 22 2026 4:15 AM

Satwik and Chirag defeated in Hong Kong Open semi finals

కౌలూన్‌: హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌లు సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి, లక్ష్యసేన్‌ పరాజయం పాలయ్యారు. శనివారం పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 18–21, 19–21తో మాన్‌ వె చోంగ్‌–కాయ్‌ వున్‌ టీ (మలేసియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.

పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో భారత నంబర్‌వన్‌ లక్ష్యసేన్‌ 13–21, 13–21తో ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడాడు. గత రెండు వారాలుగా అపజయం ఎరగకుండా హైలో ఓపెన్, జపాన్‌ మాస్టర్స్‌ గెలిచిన లక్ష్యసేన్‌... ఈ మ్యాచ్‌లో అదే జోరు కనబర్చలేకపోయాడు. దీంతో ఈ టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement