అక్రమ వలసలపై దూకుడు ఎక్కువైంది!  | Donald Trump says mass deportations may have hurt Republicans in midterms | Sakshi
Sakshi News home page

అక్రమ వలసలపై దూకుడు ఎక్కువైంది! 

Nov 10 2026 6:04 AM | Updated on Nov 10 2026 6:04 AM

Donald Trump says mass deportations may have hurt Republicans in midterms

మధ్యంతర ఎన్నికల్లో ఓటమిపై ట్రంప్‌ 

వాషింగ్టన్‌: మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ హౌస్, సెనేట్‌ రెండింటిలో ఆధిక్యం కోల్పోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటిసారి స్పందించారు. అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే విషయంలో ప్రభుత్వ అధికారులు దూకుడుగా వ్యవహరించడం ఓటర్లకు నచ్చకపోయి ఉండవచ్చునని విశ్లేషించారు. ఈ అంశానికి సంబంధించి డెమోక్రాట్లతో పనిచేసేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. ఆదివారం సీబీఎస్‌ ఛానల్‌ ‘60 మినిట్స్‌’లో ఆయన మాట్లాడుతూ ‘‘డెమోక్రాట్లతో ఆచరణ సాధ్యమైన పరిష్కారం దొరుకుతుందనే అనుకుంటున్నా’’అన్నారు. ఈ ఇంటర్వ్యూ ముగిసిన కొంత సమయానికి వలసదారులపై కఠినమైన చట్టాన్ని రూపొందించిన స్టీఫెన్‌ మిల్లర్‌ను కొత్త చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement