ఆసీస్‌ను గడగడలాడించిన షొరీఫుల్‌.. పోరాడుతున్న బంగ్లాదేశ్‌ | Australia vs Bangladesh, 2nd Test Day 1 Stumps | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ను గడగడలాడించిన షొరీఫుల్‌.. పోరాడుతున్న బంగ్లాదేశ్‌

Aug 22 2026 1:23 PM | Updated on Aug 22 2026 1:27 PM

Australia vs Bangladesh, 2nd Test Day 1 Stumps

source: X

ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ మధ్య మెక్‌కే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌ తొలి రోజే ఏకంగా 18 వికెట్లు నేలకూలాయి. తొలుత ఆసీస్‌ బౌలింగ్‌ చేసి బంగ్లాదేశ్‌ను 64 పరుగులకే కుప్పకూల్చగా.. ఆతర్వాత బంగ్లాదేశ్‌ కూడా అద్భుతంగా పోరాడి ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ షొరీఫుల్‌ ఇస్లాం (6-35) ధాటికి ఆసీస్‌ 148 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కెమరూన్‌ గ్రీన్‌ (51 నాటౌట్‌), నాథన్‌ లియోన్‌ (10 నాటౌట్‌) ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 101 పరుగుల కీలక ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో గ్రీన్‌, లియోన్‌తో పాటు హెడ్‌ (22), స్టీవ్‌ స్మిత్‌ (42) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రెన్‌షా (8), లబూషేన్‌ (4), క్యారీ (5), స్టార్క్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం కాగా.. వెబ్‌స్టర్‌, కమిన్స్‌ డకౌట్లయ్యారు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్‌తో పాటు తస్కిన్‌ అహ్మద్‌ (1-41), మెహిది హసన్‌ మిరాజ్‌ (1-4) వికెట్లు తీశారు.

నిప్పులు చెరిగిన స్టార్క్‌
అంతకుముందు మిచెల్‌ స్టార్క్‌ (10-6-12-6) నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్‌ 64 పరుగులకు కుప్పకూలింది. కమిన్స్‌ 3, హాజిల్‌వుడ్‌ ఓ వికెట్‌తో స్టార్క్‌కు సహకరించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లు కాగా.. మెహిది హసన్‌ (11), హసన్‌ మహమూద్‌ (10), తైజుల్‌ ఇస్లాం (11 నాటౌట్‌), షొరీఫుల్‌ ఇస్లాం (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో పర్యాటక బంగ్లాదేశ్‌ తొలి టెస్ట్‌లో సంచలన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement