ఇటు స్టార్క్‌... అటు షరీఫుల్‌ | Bangladesh first innings 64 all out | Sakshi
Sakshi News home page

ఇటు స్టార్క్‌... అటు షరీఫుల్‌

Aug 23 2026 3:59 AM | Updated on Aug 23 2026 3:59 AM

Bangladesh first innings 64 all out

చెరో 6 వికెట్లు తీసిన పేసర్లు 

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 64 ఆలౌట్‌ 

ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌ 165/8

మెక్‌కాయ్‌ (ఆ్రస్టేలియా): సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న ఆ్రస్టేలియా జట్టు... రెండో టెస్టులో సత్తా చాటింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో కంగారూ పేసర్లు నిప్పులు చెరిగారు. దీంతో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌటైంది. పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షరీఫుల్‌ (14) టాప్‌ స్కోరర్‌. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 10 ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి 6 వికెట్లతో అదరగొట్టగా... కెప్టెన్‌ కమిన్స్‌ 3 వికెట్లు తీశాడు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా తడబడింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ (81 బంతుల్లో 51 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో రాణించగా... స్టీవ్‌ స్మిత్‌ (42) ఫర్వాలేదనిపించాడు. దీంతో తొలి రోజే 18 వికెట్లు నేలకూలాయి. బంగ్లా బౌలర్లలో షరీఫుల్‌ ఇస్లామ్‌ 6 వికెట్లు తీశాడు. చేతిలో రెండు వికెట్లు ఉన్న ఆసీస్‌ ప్రస్తుతం 101 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement