పీతలు కూడా వలస వెళతాయా!? | Christmas Island Red Crab Migration | Sakshi
Sakshi News home page

పీతలు కూడా వలస వెళతాయా!?

Nov 28 2026 1:59 PM | Updated on Nov 28 2026 2:41 PM

Christmas Island Red Crab Migration

సాధారణంగా పీతలు కనిపిస్తే సముద్ర తీరంలోనో, నీటి గుంటల్లోనో ఉంటాయని అనుకుంటాం. కానీ ఆస్ట్రేలియాలోని ఓ ద్వీపంలో కోట్లాది పీతలు ఒకేసారి వలస వెళ్తుంటాయి. సైనికుల కవాతును తలపించే ఈ దృశ్యం ప్రకృతి సృష్టించిన అద్భుతాల్లో ఒకటి!

సైనికులు కవాతు చేసినట్టు అన్నీ కలిసి నడుచుకుంటూ అలా వలస పోతూనే ఉంటాయి. ఈ దృశ్యం ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. అక్కడి ‘క్రిస్మస్‌ ఐలాండ్‌’లో ఎర్ర పీతలు ఉంటాయి. ఇవి ఏడాదిలో ఎక్కువ కాలం ద్వీపంలోని అడవుల్లోనే నివసిస్తాయి. వర్షాకాలం మొదలవగానే, గుడ్లు పెట్టడం కోసం  సముద్ర తీరానికి వలస వెళ్తాయి.

ఈ సీజన్‌ లో దాదాపు 10 కోట్లకు పైగా ఎర్ర పీతలు ఒకేసారి కదులుతాయి. రోడ్లు, ఇళ్లు, తోటలు.. ఏదొచ్చినా ఆగవు. కొన్నిచోట్ల వీటి కోసం ప్రత్యేకంగా వంతెనలు, క్రాసింగ్‌లు కూడా ఏర్పాటు చేస్తారు. సముద్రంలో గుడ్లు వదిలాక, చిన్న పీతల పిల్లలు మళ్లీ అడవిలోకి చేరుకుంటాయి. ప్రకృతిలో జరిగే ఇలాంటి వింత వలసలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

ఇదీ చదవండి: ఇంజినీర్‌ నుంచి హాస్యనటుడిగా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement