థాంక్యూ చెప్పడం మీకు అలవాటు ఉందా? | Power Of Saying Thank You | Sakshi
Sakshi News home page

థాంక్యూ చెప్పడం మీకు అలవాటు ఉందా?

Nov 28 2026 11:44 AM | Updated on Nov 28 2026 11:44 AM

Power Of Saying Thank You

మనకు ఎవరో చిన్న సాయం చేస్తారు. దారి చెబుతారు. మన కోసం ఓ నిమిషం సమయం కేటాయిస్తారు. అవసరమైనప్పుడు ఓ మంచి మాట చెబుతారు. అంతే.. వెంటనే మన నోటి నుంచి ‘థ్యాంక్యూ’ అనే మాట వస్తుంది. కొందరైతే ఒకసారి చెప్పి ఊరుకోరు. మళ్లీ మళ్లీ ధన్యవాదాలు చెబుతూనే ఉంటారు. చూసేవారికి ఇది కాస్త ఎక్కువ అనిపించొచ్చు. కానీ ఆ చిన్న మాట వెనుక ఎంతో అందమైన భావం దాగుంది.

ఎదుటివారు చేసిన పనిని మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న శ్రద్ధను, ఆ΄్యాయతను గుర్తించే మనసు అది. నిజానికి ‘థ్యాంక్స్‌’ అనేది ఓ మర్యాదపూర్వకమైన మాట మాత్రమే కాదు. మనుషుల మధ్య అనుబంధాలను పెంచే ఓ మధురమైన వ్యక్తీకరణ కూడా.

అయితే ఆ భావాన్ని వ్యక్తీకరించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌ ఉంటుంది. కొందరు మాటల రూపంలో ధన్యవాదాలు చెబుతారు. మరికొందరు చిన్న సందేశం పంపుతారు. ఇంకొందరు అవసరమైనప్పుడు తిరిగి సాయం చేస్తారు. వ్యక్తీకరణలు వేరైనా భావం ఒక్కటే. మన కోసం ఎవరైనా చేసిన మంచిని గుర్తుపెట్టుకోవడం. దానికి తగిన విలువ ఇవ్వడం. ఎదుటివారి సమయాన్ని, శ్రమను గౌరవించడం.. ఈ భావాలన్నింటినీ ఒక్కమాటలో వ్యక్తపరిచే పదమే ‘థ్యాంక్స్‌’.

కృతజ్ఞతలు చెప్పడానికి పెద్ద సందర్భాలు కూడా అవసరం లేదు. మన కోసం డోర్‌ తీసిన వ్యక్తికైనా.. మన బాధను విన్న స్నేహితుడికైనా.. మనకు దారి చూపిన అపరిచితుడికైనా ఓ చిన్న ‘థ్యాంక్స్‌’ చె΄÷్పచ్చు. ఆ మాట ఖరీదు లేనిదే కావచ్చు. కానీ దాని విలువ మాత్రం ఎంతో గొప్పది. ఎందుకంటే మనిషికి మనిషిని దగ్గర చేసేది, బంధాలను పదిలం చేసేది పెద్ద పెద్ద కానుకలు కాదు.. మనస్ఫూర్తిగా పలికే  థ్యాంక్స్, సారీ లాంటి చిన్న మాటలే!

ఇదీ చదవండి: ఒకే చీర.. ఎన్నో స్టైల్స్‌.. ఒక్కో కట్టులో ఒక్కో ప్రత్యేకత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement