'ఎలా ఉన్నారు?' అని అడిగితే.. 'బాగున్నాను!' అంటారు... | Employee Mental Health Workplace Stress | Sakshi
Sakshi News home page

'ఎలా ఉన్నారు?' అని అడిగితే.. 'బాగున్నాను!' అంటారు...

Nov 28 2026 11:54 AM | Updated on Nov 28 2026 11:56 AM

Employee Mental Health Workplace Stress

ఆఫీసులో నవ్వుతూ పలకరిస్తారు. అప్పగించిన పనులను పూర్తి చేస్తారు. కొలీగ్స్‌తో కలిసిమెలిసి ఉంటారు. ‘ఎలా ఉన్నారు?’ అని ఎవరైనా అడిగితే ‘బాగున్నాను’ అని అంటారు. కానీ ఆ మాట వెనుక ఎన్నో మానసిక సంఘర్షణలు దాగి ఉండొచ్చునని చెబుతున్నాయి 

తాజా సర్వేలు. పని ఒత్తిడి, లక్ష్యాల భారం, వ్యక్తిగత సమస్యలు, నిద్రలేమి, ఆందోళనతో సతమతమవుతున్నా బయటపడనివారు చాలామందే. 2025లో నిర్వహించిన నౌకరీ సర్వే ప్రకారం.. భారతీయ ఉద్యోగుల్లో దాదాపు 75 శాతం మంది మానసిక ఆరోగ్య కారణాలతో లీవ్‌ తీసుకుంటున్నట్లు తేలింది.

అయితే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పేందుకు సైతం ఇష్టపడటం లేదు. 45 శాతం మంది దీనిని సాధారణ అనారోగ్య సెలవుగా తెలుపుతున్నారు. ఉద్యోగుల నుంచి కేవలం పనితీరునే కాదు.. వారి మానసిక స్థితినీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత సంస్థలపై ఉంది. అవసరమైన సహకారం అందిస్తూ.. వ్యక్తిగత విషయాల గోప్యతకు భరోసా ఇవ్వడం ముఖ్యం.

ఇదీ చదవండి: థాంక్యూ చెప్పడం మీకు అలవాటు ఉందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement