పిల్లలూ... మీకు అంతరిక్షం అంటే వెంటనే గుర్తొచ్చే పేరు నాసా. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చాలా పెద్దది. చాలా శక్తివంతమైనది. కానీ ఇప్పుడు చైనా కూడా చాలా వేగంగా దూసుకెళ్తోంది. చైనా చంద్రుడి మీదకు ‘చాంగ్ ఇ’ అనే వ్యోమనౌకలను పంపింది. చంద్రుడి వెనుక వైపున దిగిన మొదటి దేశం చైనానే. అలా దిగడం చాలా కష్టమైన పని.
అక్కడి నుంచి మట్టి కూడా తెచ్చుకుంది చైనా. అంతేకాదు, చైనాకు సొంత అంతరిక్ష కేంద్రం ఉంది. దాని పేరు ‘టియాంగాంగ్’. అంటే ‘స్వర్గపు భవనం’ అని అర్థం. అందులో వ్యోమగాములు నెలల తరబడి ఉంటున్నారు. ఇప్పుడు ‘షెంఝౌ–24’ అనే వ్యోమనౌకలో ముగ్గురు వ్యోమగాములు వెళ్లారు. అందులో పాకిస్థాన్ వ్యోమగామి కూడా ఉన్నారు.
ఇప్పటికి అనుభవంలో అమెరికానే ముందు. కానీ వేగంలో చైనా ముందుంది. ప్రతి ఏడాది చైనా ఎక్కువ రాకెట్లు పంపుతోంది. పిల్లలూ... ఇది పోటీ కాదు. పరుగు పందెం లాంటిది. రేపు మీరు కూడా వ్యోమగాములు కావచ్చు. అప్పుడు చైనా, అమెరికా కాదు... మన భారతదేశం కూడా ఈ పరుగులో ముందుంటుంది!
– నిర్వహణ: కె
ఇదీ చదవండి: పీతలు కూడా వలస వెళతాయా!?


