ఫొటో.. వికాస్ పవార్ కెమెరాలో బంధించిన బివర్ మూన్...
హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ నెలలో కనిపించే ఫుల్ మూన్‌ను బివర్ మూన్ అంటారని నగరానికి చెందిన ప్రకతి ప్రేమికుడు, ఎక్స్‌జెన్ జీనోమిక్స్ సంస్థ సీవోవో వికాస్ పవార్ తెలిపారు. మంగళవారం ఆయన బివర్ మూన్‌ను తన కెమెరాలో బంధించారు.
బంగారు వర్ణంలో ఉన్న ఈ చంద్రుడు కొద్దిసేపు ఆకాశ హర్మ్యాలపై ప్రకాశవంతంగా దర్శనమిచ్చి అనంతరం మేఘాల చాటుకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. నగర భవనాల మధ్య బంగారు వర్ణంలో ప్రకాశించిన చంద్రుడిని చూసి నగరవాసులు సైతం ముచ్చటపడ్డారు.


