123456 | Millions using 123456 as password | Sakshi
Sakshi News home page

123456

Nov 25 2026 5:59 AM | Updated on Nov 25 2026 5:59 AM

Millions using 123456 as password

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 

లక్షలాది మంది వాడుతున్న పాస్‌వర్డ్‌ ఇదే 

సులభమైన పాస్‌వర్డ్‌లతో హ్యాకింగ్‌ ముప్పు పొంచి ఉంది 

నార్డ్‌పాస్‌ మోస్ట్‌ కామన్‌ పాస్‌వర్డ్స్‌ నివేదికలో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంక్‌ ఖాతా, స్మార్ట్‌ఫోన్, జీమెయిల్, ఫేస్‌బుక్‌ మొదలైన వాటికి మీరు వేసిన ‘తాళం’ఎంత గట్టిది? ఎందుకంటే.. భారత్‌లో 109 కోట్ల మంది సహా ప్రపంచవ్యాప్తంగా 612 కోట్ల మంది నెటిజన్లు ఉండగా వారిలో నేటికీ లక్షలాది మంది సులభంగా హ్యాక్‌ కాగల పాస్‌వర్డ్‌లను వాడుతున్నట్లు ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ నార్డ్‌పాస్‌ తాజా నివేదికలో వెల్లడించింది. 

2026 మోస్ట్‌ కామన్‌ పాస్‌వర్డ్స్‌ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 123456 అనే అతిసాధారణ పాస్‌వర్డ్‌ను 72.3 లక్షల మందికిపైగా వాడుతున్నారు. ప్రపంచంలో వరుసగా ఏడోసారి ఈ పాస్‌వర్డ్‌ అతిసాధారణమైనదిగా మొదటి స్థానంలో నిలిచింది. 

అలాగే భారత్‌లో  Admin@123,  Welcome@123 వంటి ప్రత్యేక చిహ్నాలు ఉన్న పాస్‌వర్డ్‌లను వాడుతున్నప్పటికీ అవి కూడా హ్యాకర్లు ఊహించదగినవేనని నివేదిక పేర్కొంది. హ్యాకర్లకు ఇవి ఒక సెకను కంటే తక్కువ సమయంలో ఛేదించగల తాళం చెవుల వంటివని... 2025 సెపె్టంబర్‌ నుంచి 2026 సెపె్టంబర్‌ వరకు 44 దేశాల్లో జరిగిన డేటా లీక్‌లు, డార్క్‌ వెబ్‌ సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. 

నిరంతరం సైబర్‌ నేరగాళ్ల ప్రయత్నాలు.. 
హ్యాకర్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ల సాయంతో సెకనుకు లక్షలాది సాధారణ పాస్‌వర్డ్‌లను ప్రయతి్నంచి మీ ఖాతాను క్షణాల్లో తెరవగలరు. ముఖ్యంగా చాలా మంది ఒకే పాస్‌వర్డ్‌ను జీమెయిల్, ఫేస్‌బుక్, బ్యాంక్‌ యాప్‌లకు వాడుతుంటారు. అయితే ఏదైనా వెబ్‌సైట్‌ నుంచి డేటా లీక్‌ అయినప్పుడు ఆ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి నేరగాళ్లు ప్రధాన బ్యాంక్, సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాక్‌ చేసి ఫొటోలు, వ్యక్తిగత చాట్‌లు దొంగిలించి బ్లాక్‌మెయిల్‌ చేయడం ద్వారా వసూళ్లకు లేదా మోసాలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉంది. 

సురక్షిత పాస్‌వర్డ్‌ పెట్టుకోవడం ఎలా? 
⇒ పాస్‌వర్డ్‌ కనీసం 15 అక్షరాల పొడవు ఉండాలి. అందులో పెద్ద అక్షరాలు ( A&Z), చిన్న అక్షరాలు (a&z), అంకెలు (0–9), ప్రత్యేక చిహ్నాలు (@, #, $) ఉండాలి. మీకు ఇష్టమైన మూడు నాలుగు సంబంధం లేని పదాలను కలిపి ఒక వాక్యంగా (ఉదాహరణకు:  Blue@Tiger#Runs99) పెట్టుకోవడం చాలా సురక్షితం.

⇒ ఈమెయిల్, బ్యాంక్, సోషల్‌ మీడియా ఖాతాలకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను వాడాలి. అలాగే జీమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాల సెట్టింగ్స్‌లోకి వెళ్లి 2-Step Verification లేదా 2FAను తప్పనిసరిగా ఆన్‌ చేయాలి. దీనివల్ల ఎవరైనా పాస్‌వర్డ్‌ తెలుసుకున్నా, మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ లేకుండా లాగిన్‌ కాలేరు.

⇒ అన్ని పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకోవడం కష్టమైతే గూగుల్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్‌ లేదా సురక్షిత యాప్‌లను వాడాలి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఫింగర్‌ ప్రింట్‌ లేదా ఫేస్‌ ఐడీ ఆధారిత ‘పాస్‌కీ’సదుపాయాన్ని ఉపయోగించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement