లీటరుపై రూ.2 పెంపు.. నేటి నుంచే అమలు
లాలాపేట: సామాన్య వినియోగదారులకు తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (విజయ తెలంగాణ) షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పలు రకాలైన విజయ పాల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన కొత్త ధరలు ఈనెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సంస్థ జనరల్ మేనేజర్ ఒక ప్రకటన జారీ చేశారు. అయితే సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 150 మి.లీ, 200 మి.లీ చిన్న ప్యాకెట్లు, 500 మి.లీ. స్టాండర్డైజ్ పాల ధరల్లో ఎలాంటి మార్పు లేదని వారు స్పష్టంచేశారు.
పాల ధరలు ఇలా ఉన్నాయి..
⇒ డబుల్ టోన్డ్ మిల్క్ 500 మి.లీ. పాత ధర రూ.30, కొత్త ధర రూ.31
⇒ కౌ మిల్క్ 500 మి.లీ. పాత ధర రూ.32, కొత్త ధర రూ.33
⇒ టోన్డ్ మిల్క్ 500 మి.లీ. పాత ధర రూ.32, కొత్త ధర రూ.33
⇒ టోన్డ్ మిల్క్ 1000 మి.లీ. పాత ధర రూ.64, కొత్త ధర రూ.66
⇒ టోన్డ్ మిల్క్ 6 లీటర్లు పాత ధర రూ.372, కొత్త ధర రూ.396
⇒ ఎస్‌పీఎల్ టీఎమ్ 500 మి.లీ. పాత ధర రూ.31, కొత్త ధర రూ.32
⇒ హోల్ మిల్క్ 500 మి.లీ. పాత ధర రూ.40 కొత్త ధర రూ.41


