క్లీన్‌స్వీప్‌పై క‌న్నేసిన జింబాబ్వేకు షాక్‌! | Reason-Zimbabwe Captain-Ngarava-Not-Playing-3rd-ODI Vs Bangladesh | Sakshi
Sakshi News home page

క్లీన్‌స్వీప్‌పై క‌న్నేసిన జింబాబ్వేకు ఊహించని షాక్‌!

Jul 11 2026 1:42 PM | Updated on Jul 11 2026 2:04 PM

Reason-Zimbabwe Captain-Ngarava-Not-Playing-3rd-ODI Vs Bangladesh

బంగ్లాదేశ్‌పై మూడో వ‌న్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాల‌ని భావిస్తోన్న జింబాబ్వే జ‌ట్టుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఆ జ‌ట్టు కెప్టెన్ రిచ‌ర్డ్ న‌గ‌ర‌వా మూడో వ‌న్డేకు దూర‌మ‌య్యాడు. అత‌డి స్థానంలో సికంద‌ర్ ర‌జా స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే  మ్యాచ్‌లో రిచ‌ర్డ్ న‌గ‌ర‌వా ఆడ‌క‌పోవ‌డంపై టాస్ స‌మ‌యంలో సికంద‌ర్ ర‌జా క్లారిటీ ఇచ్చాడు. 

వ‌ర్క్‌లోడ్ కార‌ణంగానే రిచ‌ర్డ్ న‌గ‌ర‌వాకు జ‌ట్టు మేనేజ్‌మెంట్ విశ్రాంతి క‌ల్పించిన‌ట్లు సికంద‌ర్ ర‌జా పేర్కొన్నాడు. న‌గ‌ర‌వాతో పాటు జ‌ట్టుకు ఆయువుప‌ట్టు అయిన బ్లెసింగ్ ముజ‌ర‌బానీతో పాటు న్యూమ‌న్ నైమురీకి కూడా మూడో వ‌న్డేకు విశ్రాంతి ఇచ్చిన‌ట్లు తెలిపాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి రిచ‌ర్డ్ న‌గ‌ర‌వా రెస్ట్ లేకుండా అన్ని మ్యాచ్‌లు ఆడుతూనే వ‌స్తున్నాడు. 

రాబోయే రోజుల్లో భార‌త్‌తో కీల‌క‌మైన టీ20 సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొనే బోర్డు ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంద‌ని సికంద‌ర్ ర‌జా వెల్ల‌డించాడు. ఇక బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో జింబాబ్వే కెప్టెన్ రెండో లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా ఉన్నాడు. బంగ్లా బౌల‌ర్ న‌హీద్ రానా 7 వికెట్ల‌తో టాప్‌లో ఉండ‌గా, రిచ‌ర్డ్ న‌గ‌ర‌వా ఆరు వికెట్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. 

మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. 8 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. కాయా (4), క్రెయిగ్‌​ ఇర్విన్‌ (0) క్రీజులో ఉన్నారు. 

తుదిజట్లు:
బంగ్లాదేశ్: తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, నూరుల్ హసన్(వికెట్ కీప‌ర్‌), మొసద్దెక్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్(కెప్టెన్‌), మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, తన్వీర్ ఇస్లాం

జింబాబ్వే : బెన్ కుర్రాన్, బ్రియాన్ బెన్నెట్, ఇన్నోసెంట్ కైయా, క్రెయిగ్ ఎర్విన్, సికందర్ రజా(కెప్టెన్‌), వెస్లీ మాధవెరె, క్లైవ్ మదాండే(వికెట్ కీప‌ర్‌), బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, ఎర్నెస్ట్ మసుకు, తనకా చివాంగా

చదవండి: ఫిక్సింగ్‌ ఆరోపణలు.. కప్పు గెలవొద్దనే ఇలాంటి కుట్రలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement