breaking news
Richard Ngarava
-
బంగ్లాదేశ్‌కు మరో షాకిచ్చిన జింబాబ్వే
బంగ్లాదేశ్‌పై టెస్ట్, వన్డే సిరీస్‌ల విజయాల జోరు కొనసాగించిన జింబాబ్వే టీ20 సిరీస్‌ను కూడా ఘనంగా ప్రారంభించింది. బులవాయో వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో పర్యాటక జట్టును 32 పరుగుల తేడాతో ఓడించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. పేసర్లు బ్లెస్సింగ్ ముజరబానీ (4/17), రిచర్డ్ నగరవా (4/26) అద్భుత బౌలింగ్‌తో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు.బెన్నెట్ మెరుపులుటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 44 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, టాడివానాషే మరుమానీ కూడా మెరుపులు (2 సిక్సర్లు) మెరిపించాడు. మధ్యలో ర్యాన్ బర్ల్ 30 పరుగులతో జట్టును నిలబెట్టాడు. చివర్లో బ్రాడ్ ఇవాన్స్ అజేయంగా 19 పరుగులు చేసి స్కోరును 20 ఓవర్లలో 170/6కు చేర్చాడు.బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రాణా మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ, చివరి ఓవర్లో వరుస బౌండరీలు ఇవ్వడంతో జింబాబ్వే భారీ స్కోరు సాధించింది.ముజరబానీ, నగరవా ధాటికి కుప్పకూలిన బంగ్లాదేశ్171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిచర్డ్ నగరవా వరుసగా రెండు వికెట్లు తీయగా, వెంటనే ముజరబానీ మరో దెబ్బ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 43/3తో కష్టాల్లో పడింది.యాసిర్ అలీ (54), తౌహిద్ హృదయ్ కలిసి పోరాడినా, కీలక సమయంలో భాగస్వామ్యం విరగడంతో మ్యాచ్ పూర్తిగా జింబాబ్వే వైపు మళ్లింది. చివర్లో ముజరబానీ, నగరవా మరోసారి వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను 19 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 జులై 17న జరుగనుంది. -
క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన జింబాబ్వేకు షాక్!
బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోన్న జింబాబ్వే జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ రిచర్డ్ నగరవా మూడో వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సికందర్ రజా స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే మ్యాచ్‌లో రిచర్డ్ నగరవా ఆడకపోవడంపై టాస్ సమయంలో సికందర్ రజా క్లారిటీ ఇచ్చాడు. వర్క్‌లోడ్ కారణంగానే రిచర్డ్ నగరవాకు జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి కల్పించినట్లు సికందర్ రజా పేర్కొన్నాడు. నగరవాతో పాటు జట్టుకు ఆయువుపట్టు అయిన బ్లెసింగ్ ముజరబానీతో పాటు న్యూమన్ నైమురీకి కూడా మూడో వన్డేకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్ నుంచి రిచర్డ్ నగరవా రెస్ట్ లేకుండా అన్ని మ్యాచ్‌లు ఆడుతూనే వస్తున్నాడు. రాబోయే రోజుల్లో భారత్‌తో కీలకమైన టీ20 సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొనే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుందని సికందర్ రజా వెల్లడించాడు. ఇక బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో జింబాబ్వే కెప్టెన్ రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. బంగ్లా బౌలర్ నహీద్ రానా 7 వికెట్లతో టాప్‌లో ఉండగా, రిచర్డ్ నగరవా ఆరు వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. 8 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. కాయా (4), క్రెయిగ్ ఇర్విన్ (0) క్రీజులో ఉన్నారు. తుదిజట్లు:బంగ్లాదేశ్: తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మొసద్దెక్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్(కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, తన్వీర్ ఇస్లాంజింబాబ్వే : బెన్ కుర్రాన్, బ్రియాన్ బెన్నెట్, ఇన్నోసెంట్ కైయా, క్రెయిగ్ ఎర్విన్, సికందర్ రజా(కెప్టెన్), వెస్లీ మాధవెరె, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, ఎర్నెస్ట్ మసుకు, తనకా చివాంగాచదవండి: ఫిక్సింగ్ ఆరోపణలు.. కప్పు గెలవొద్దనే ఇలాంటి కుట్రలు! -
బంగ్లాదేశ్‌పై జింబాబ్వే సంచలన విజయం
జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ ఎదురైంది. సొంతగడ్డపై పాకిస్తాన్, ఆస్ట్రేలియాలను చిత్తు చేసిన బంగ్లాదేశ్ జింబాబ్వే పర్యటనలో మరో ఓటమిని చవిచూసింది. ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో దారుణ పరాజయం మూటగట్టుకున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌ను కూడా ఓటమితోనే ప్రారంభించింది. సోమవారం హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌పై 25 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయాన్ని సాధించింది. 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 33.1 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో నురుల్ హసన్ (31), తౌహిద్ హృదోయ్ (25), మెహదీ హసన్ (10) మినహా మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ రిచర్డ్ నగరవా, బ్రాడ్ ఎవన్స్ చెరో మూడు వికెట్లు తీయగా, బ్లెసింగ్ ముజరబానీ, న్యూమన్ నైమూరి రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 36.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. న్యూమన్ నైమూరి (33) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ రిచర్డ్ నగరవా (27), ఇన్నోసెంట్ కైయా (26) పర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రానా 6 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కెప్టెన్ నగరవా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జింబాబ్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జూలై 9న జరగనుంది.Read: సంజూపై వేటు.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్


