మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరకుండానే హర్మన్ సేన ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా భారత మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై లార్డ్స్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఈ మ్యాచ్ ద్వారా ఇరుజట్ల తరఫున ముగ్గురు ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. భారత్ తరఫున తెలుగుతేజం శ్రీ చరణి టెస్టు క్రికెట్‌లో డెబ్యూ చేసినట్లు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తెలిపింది. ఇక శ్రీ చరణితో పాటు యస్తిక బాటియా కూడా తుది జట్టులోకి తిరిగివచ్చినట్లు పేర్కొంది. ఇంగ్లండ్ తరఫున ఎలీస్ కాప్సీ, మాడీ డివిలియర్స్ అరంగేట్రం చేశారు.
పురుషుల క్రికెట్ మాదిరి కాకుండా మహిళల టెస్టు మ్యాచ్ నాలుగురోజులు మాత్రమే జరుగుతుంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 15 టెస్టు మ్యాచ్‌లు జరిగితే.. ఇందులో భారత్ మూడు గెలవగా, ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలిచింది. మిగిలిన 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, సయాలీ సత్ఘరే, శ్రీ చరణీ, క్రాంతి గౌడ్
ఇంగ్లండ్: టామీ బ్యూమాంట్, మైయా బౌచియర్, హెదర్ నైట్, నాట్ సైవర్-బ్రంట్(కెప్టెన్), ఆలిస్ క్యాప్సీ, అమీ జోన్స్(వికెట్ కీపర్), మాడీ విలియర్స్, సోఫీ ఎక్లెస్టోన్, ఇస్సీ వాంగ్, లారెన్ బెల్, లారెన్ ఫైలర్


