మన మట్టిలో పుట్టిన ఆట.. ఊగిపోతున్న స్పెయిన్‌! | Indian Oldest Traditional Karra Billa Game Shakes Spain Country | Sakshi
Sakshi News home page

మన మట్టిలో పుట్టిన ఆట.. ఊగిపోతున్న స్పెయిన్‌!

Jul 10 2026 1:44 PM | Updated on Jul 10 2026 2:05 PM

Indian Oldest Traditional Karra Billa Game Shakes Spain Country

క‌ర్రా బిల్లా (గిల్లి-దండ‌) ఆట పరిచయం అక్కర్లేని పేరు. భార‌త్‌లో తాతల కాలం నుంచే ఈ ఆట మనకు సుప్ర‌సిద్ధం. భార‌తీయ చ‌రిత్ర‌లో పురాత‌న ఆట‌ల్లో ఒక‌టిగా ఉన్న క‌ర్రా బిల్లా ఇవాళ ఒక దేశంలో పాపుల‌ర్ ఆట‌గా మారిపోయిందంటే న‌మ్ముతారా? కానీ ఇది అక్ష‌రాల నిజం. స్పెయిన్‌లో ఇప్పుడు మ‌న కర్రా బిల్లా ఆట 'బిల్లార్డా' పేరుతో మోస్ట్ పాపుల‌ర్ గేమ్‌గా మారిపోయింది. 

ఫుట్‌బాల్‌కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ఉండే స్పెయిన్‌లో బిల్లార్డా (క‌ర్రా బిల్లా) రూపంలో అక్క‌డి యువ‌త‌కు ఇష్ట‌మైన ఆట‌గా మారిందంటే అదంతా మ‌న భార‌త్ చ‌లువే అని చెప్పొచ్చు.

క‌ర్రా బిల్లా అంటే?
భార‌త్‌లో తాత‌ల కాలం నుంచే ప్రాచుర్యంలో ఉన్న క‌ర్రా బిల్లా ఆట‌కు చాలా పేర్లే ఉన్నాయి.  గోణి బిల్లా, గూటి బిల్లా, బిల్లా కర్ర, చిల్లంగోడు, కోడింబిల్లా, చిల్లగాల, బిల్లంగోడు పేర్ల‌తో ప్రచారంలో ఉంది. సుమారు 4 అంగుళాలు ఉన్న కర్ర ముక్క, రెండు అడుగులు పొడవుగల కర్ర ఒకటి ఈ ఆటకు ఉపయోగిస్తారు. వీటిలో చిన్న దానిని ‘బిల్లా' అని, పెద్దదాన్ని ‘కర్ర’ అని పిలుస్తారు. అందుకే ఈ ఆటకు ‘కర్ర బిల్లా' అని పేరు వ‌చ్చింది. 

నేలమీద చిన్న ‘కంచా‘ (గుంట) త‌వ్వి ఈ కంచా మీద ‘బిల్ల‌‘ను ఉంచి కర్రతో కొట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. దీనిని ‘గూటుట‘ అని పిలుస్తారు. సాధారణంగా ఈ ఆటను ఇద్దరు లేక నలుగురు ఏక‌కాలంలో ఆడ‌వ‌చ్చు. ఇక తాజాగా స్పెయిన్‌లో బిల్లార్డా గేమ్ ఆడుతున్న విధానం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది  చూసిన కొంత‌మంది అభిమానులు ఈ గేమ్‌ను ఒలింపిక్స్‌లో ప్ర‌వేశ‌పెడితే మనమంతా ఒక జ‌ట్టుగా ఏర్ప‌డి భార‌త్‌కు ప‌త‌కాలు తేవొచ్చు అని కామెంట్లు ప‌ట్ట‌డం ఆస‌క్తి క‌లిగించింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement