57 శాతం ఉత్పత్తులపై సున్నా సుంకాలు!  | 57percent of New Zealand exports to India will be tariff-free | Sakshi
Sakshi News home page

57 శాతం ఉత్పత్తులపై సున్నా సుంకాలు! 

Jul 10 2026 4:59 AM | Updated on Jul 10 2026 4:59 AM

57percent of New Zealand exports to India will be tariff-free

భారత మార్కెట్‌లో మా ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం  

న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌ వెల్లడి 

వెల్లింగ్టన్‌: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కింద తమ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి జరిగే ఉత్పత్తుల్లో 57 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయని న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్టుచేశారు. ఇరుదేశాల మధ్య ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సున్నా శాతం సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందంతో న్యూజిలాండ్‌ వ్యాపారాలు భారీగా వృద్ధి చెందనున్నాయని తెలిపారు. 

భారత మార్కెట్‌లో న్యూజిలాండ్‌ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10, 11న న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. భారత ప్రధాని న్యూజిలాండ్‌కు వెళ్తుండడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌తో వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై ప్రధాని మోదీ దృష్టిపెట్టనున్నారు. అంతేకాకుండా వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న భారత్, న్యూజిలాండ్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement