breaking news
tariff reduction
-
అమెరికాపై సుంకాలు ఎత్తేసిన ఇజ్రాయెల్
జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికలు పని చేస్తున్నాయి. అమెరికా దిగుమతులపై అన్ని సుంకాలను ఇజ్రాయెల్ ఎత్తేసింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘అమెరికా వస్తువులపై కస్టమ్స్ సుంకాలను రద్దు చేయడమంటే మార్కెట్‌ను ఒక దశాబ్దం పాటు పోటీకి తెరవడం. ఆర్థిక వ్యవస్థకు వైవిధ్యాన్ని పరిచయం చేయడం. జీవన వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ఎంచుకున్న విధానాల్లో ఇది అదనపు దశ. మార్కెట్‌కు, ఇజ్రాయెల్ పౌరులకు ప్రయోజనం చేకూర్చేది. ఇజ్రాయెల్, అమెరికాల సంబంధాలను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుంది’’ అని ‘ఎక్స్’లో నెతన్యాహు ప్రకటించారు.40 ఏళ్ల స్వేచ్ఛా వాణిజ్యంఇజ్రాయెల్, అమెరికా మధ్య 40 ఏళ్లుగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లో ఉంది. 99 శాతం అమెరికా దిగుమతులను ఇజ్రాయెల్ ఇప్పటికే సుంకాల నుంచి మినహాయించింది. ఈ నేపథ్యంలో తాజా చర్యను ఆర్థిక చర్యగా కంటే దౌత్య, రాజకీయ చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వ్యవసాయోత్పత్తులపై ఇజ్రాయెల్ ఏటా 42 మిలియన్ షెకెల్స్ (సుమారు 1.15 కోట్ల డాలర్ల) సుంకాలు వసూలు చేస్తోంది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2024లో ఆ దేశం మొత్తం ఎగుమతుల విలువ 172 కోట్ల డాలర్లు. అమెరికా నుంచి దిగుమతుల విలువ 92 కోట్ల డాలర్లు. -
బంగారం దిగుమతి సుంకాల తగ్గింపు?
ముంబై: స్మగ్లింగ్‌ను నిరోధించే దిశగా పసిడి దిగుమతులపై సుంకాలను తగ్గించాలని యోచిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం 10 శాతంగా ఉన్న దీన్ని 6 శాతానికి తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. రికార్డు స్థాయిలోని కరెంటు అకౌంటు లోటును భర్తీ చేసుకునేందుకు, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు 2013లో ప్రభుత్వం పసిడి దిగుమతి సుంకాన్ని మూడు సార్లు పెంచింది. దీంతో పసిడి దిగుమతులు భారంగా మారడంతో .. స్మగ్లింగ్‌కు ఊతమిచ్చినట్లయిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. సుంకాల విధానం పారదర్శకతను పెంచే విధంగానే ఉండాలి తప్ప స్మగ్లింగ్‌కు ఊతమిచ్చేలా ఉండకూడదని వ్యాఖ్యానించాయి. గతేడాది దాదాపు 120 టన్నుల బంగారం దిగుమతి స్మగ్లింగ్ జరగ్గా ఈ ఏడాది ఈ పరిమాణం మరింత పెరిగి 140 టన్నుల నుంచి 160 టన్నుల దాకా ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా. వివిధ అంశాల కారణంగా ఈ ఏడాది దేశీయంగా పసిడి వినియోగం ఏడేళ్లలో కనిష్ట స్థాయికి తగ్గిపోవచ్చని..సుమారు 650 టన్నుల నుంచి 750 టన్నుల దాకా మాత్రమే ఉండొచ్చని డబ్ల్యూజీసీ నవంబర్‌లో అంచనా వేసింది.