
దీపావళి వేడుక అంటే..మోద మోగిపోవాల్సిందే.. ఆ పండుగ సంబంరం అలా ఇలా ఉండదు. టపాసులు, బాణసంచా వెలుగులు విరజిమ్ముతూ..అదిరిపడే శబ్దాలతో ఆనంద హేళిలా సాగిపోతుంది. అలాంటి వేడుకలో కాల్చే బాణసంచా కాల్చడం తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇదెలా వాడుకలోకి వచ్చింది, ఎలా మొదలైంది అంటే..
ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన బాణసంచా మ్యూజియం. ఈ మ్యూజియం జపాన్ రాజధాని టోక్యో పరిధిలోని ర్యోగోకు జిల్లాలో ఉంది. ‘ర్యోగోకు హనాబి’ పేరుతో సుమిదా నది ఒడ్డున ఈ మ్యూజియం 1733 సంవత్సరంలో ఏర్పాటైంది.
జపాన్‌లో పదహారో శతాబ్ది నుంచి బాణసంచా వాడుక మొదలైంది. పలు వేడుకల్లో జపాన్ ప్రజలు బాణసంచా కాలుస్తుంటారు.
(చదవండి: ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారంటే..!)