
పండగలకు, సంప్రదాయ వేడుకలకూ నిండైన హుందాతనాన్ని తీసుకువచ్చేలా కట్టూ బొట్టు విషయంలో అతివలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ దీపావళి వేళ మరింత స్పెషల్‌గా కనిపించాలనుకునే వారికోసం బెంగాలీ చీరకట్టు ఆధునికతనూ అద్దుకొని కొంగొత్తగా మెరిసి΄ోతుంది.
సెలబ్రిటీ లూ ముచ్చటపడే ఈ కట్టుకు వారు జోడించే హంగులు ఇవి...
పండగలు, ఇతర సంప్రదాయ వేడుకలలో బెంగాలీ స్టైల్ చీర కట్టును దేశవ్యాప్తంగా మహిళలు ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఉత్తేజాన్ని కలిగించే ఎరుపు–తెలుపు కాంబినేషన్‌లో ఉండే ఈ చీర కట్టు, నుదుటన పెద్ద బిందీ, శంఖం ఆకృతిలో నెక్ డిజైన్, చీర పల్లూకున్న అందమైన డిజైన్.. ఇవన్నీ పండుగను మరింత ప్రత్యేకంగా చేస్తాయి.
దుర్గాపూజల సమయాల్లో ఈ రంగు చీరలను బెంగాలీలు ప్రత్యేకంగా ధరిస్తారు. ఆ స్టైల్ కట్టును ఇప్పుడు లక్ష్మీ పూజలు, వివాహ వేడుకల సమయాల్లో ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ కట్టును మనం అనుసరించాలంటే మాత్రం ఈ సూచనలు తప్పక అవసరం.
ఎంపికలో సరైన చీర
పూజలు, నోములు, వ్రతాల సమయంలో ఎరుపు అంచుతో ఉన్న తెలుపు లేదా ఆఫ్–వైట్ బేస్ చీరను ఎంచుకోవాలి. అంచు ఉన్న కాటన్, పట్టు లేదా టస్సర్ చీరలు ఈ బెంగాలీ లుక్‌కు సరైనవి. వీటిలో మనవైన చేనేతలు కూడా ఉండవచ్చు. ఈ చీరకట్టు సౌకర్యంగా ఉండటమే కాకుండా పూజ, పండగల సమయాల్లో రోజంతా ధరించడం సులభం కూడా.
కట్టుతో కట్టడిబెంగాలీ స్టైల్‌లో నిజమైన ఆకర్షణ
దాని డ్రేపింగ్ శైలిలోనే ఉంటుంది. చీర కుచ్చిళ్ల నుంచి ఎడమ వైపుగా, పొడవాటి పల్లూను ఛాతీ మీదుగా భుజం వరకు తీసుకుంటూ వెళ్లాలి. పొడవాటి పల్లూ భాగాన్ని కుడి చేతి భుజం కిందుగా తీసి, పైకి అంచు భాగం కనిపించేలా బ్లౌజ్‌కు జత చేయాలి. పొడవుగా తీసుకున్న కొంగు భాగాన్ని కుడి చేత్తో ముందుకు తీసుకువచ్చి పట్టుకోవడం కూడా ఈ కట్టులో అందంగా కనిపిస్తుంది.
భుజం మీదుగా తీసిన పల్లూని కొప్పుకు అటాచ్ చేసి, ఎడమ భుజం కిందుగా తీసుకురావచ్చు. ఈ కట్టు లలనల రూపాన్ని మరింత సంప్రదాయంగా మారుస్తుంది. డ్రేపింగ్ చేసేటప్పుడు, కుచ్చుల భాగం మడతలు లేకుండా సెట్ చేసి, పల్లూ చాలా తేలికగా ఉన్నట్టు చూసుకోవాలి.
నగలపై ప్రత్యేక శ్రద్ధ
పెద్ద పెద్ద చెవి΄ోగులు, గాజులు, నెక్లెస్‌లు ఈ స్టైల్ చీరకట్టుకు రాయల్ టచ్‌ను జోడిస్తాయి. హెవీగా ఆభరణాలు అక్కర్లేదు అనుకుంటే పెద్ద చెవి΄ోగులు, గాజులు ఈ అలంకరణకు సరి΄ోతాయి.
గుండ్రని వెడల్పాటి బిందీబెంగాలీ స్టైల్ డ్రేపింగ్ సంపూర్ణం కావాలంటే నుదుటన పెద్ద, గుండ్రని ఎరుపు బిందీ తప్పక ఉండాలి. ఇది పండుగల రోజుల్లో మొత్తం మేకప్‌ను పూర్తి చేస్తుంది. నుదుటిపై బిందీతో పాటు సిందూర్ చుక్కలను కూడా అదనంగా పెట్టడం వల్ల లుక్ మరింత మెరుగవుతుంది. ఈ లుక్‌కి ఎరుపు లేదా ముదురు గులాబీ రంగు బిందీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
హెయిర్ స్టైల్– మేకప్
హెయిర్ స్టైల్ కోసం ఒక బన్ తయారు చేసి, దానిని మల్లె పువ్వులు లేదా ఎరుపు, తెలుపు పువ్వులతో అలంకరించవచ్చు. పువ్వులతో కాకున్నా హెయిర్ బన్‌కు హెయిర్ పిన్ జ్యువెలరీని జోడించడం ద్వారా అందాన్ని పెంచుకోవచ్చు.
మేకప్ కోసం ఎరుపు లిప్‌స్టిక్, తేలికపాటి ఐ మేకప్ సరిపోతాయి. ధరించిన చీరకు మేకప్ సెట్ అవుతుందా అనేది సరి చూసుకుంటే చాలు. మెడలోనూ, చేతులకు ఎక్కువ నగల లేకుండా చూసుకుంటే చాలు. మీ రూపం ఆధునికతను అద్దుకున్న సంప్రదాయంతో కొంగొత్తగా మెరిసిపోతుంది.
(చదవండి: బహుశా ఇదే చివరి దీపావళి పండుగ..! సమయం మించిపోతోంది.)