
దీపావళి పండుగ అంటే చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాంటి పండుగను ఈ యువకుడు ఇదే తనకు ఆఖరి దీపావళి ఏమో అంటూ భావేద్వేగంగా పోస్టు పెట్టాడు. హృదయాన్ని మెలిపెట్టే అతడి కథ నెట్టింట వైరల్‌గా మారడమే కాదు ప్రతి ఒక్కరిని కదిలించింది. పైగా బ్రో నీకేంకాదు అంటూ..ధైర్యం చెబుతూ పోస్టులు వెల్లువెత్తాయి.
అసలేం జరిగిందంటే..21 ఏళ్ల వ్యక్తి హృదయ విదారక పోస్ట్ నెట్టింట ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టేలా చేసింది. ఆ పోస్ట్‌లో అంతలా ఏముందంటే..అతడు 2023 నుంచి స్టేజ్4 కొలొరెక్టల్ కేన్సర్(colorectal cancer)తో పోరాడుతున్నట్లు వెల్లడించాడు. నెలలతరబడి కీమోథెరపీలు, ఆస్పత్రుల్లో గడిపిన తదనంతరం వైద్యులు ఈ ఏడాదికి మించి బతకలేడని నిర్థారించారని షేర్ చేసుకున్నాడు.
"దీపావళి పండుగ సమీపిస్తుండటంతో బహుశా ఇదే నా చివరి దీపావళి పండుగ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. త్వరలో దీపావళి రాబోతోంది అంతా దీపాలు వెలిగించి..సందడిగా ఉంటే..తన హృదయ దీపం ఆరిపోయి..జీవితం ముగిసిపోనుంది అని భావోద్వేగంగా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. నా జీవితం ముగిసిపోతుంది అని తెలిసి కూడా ఎలా సాగుతుందో చూడటం వింతగా ఉంది. వచ్చే ఏడాది నా స్థానంలో మరొకరు దీపాలు వెలిగిస్తారు.
సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, ఓ కుక్కను పెంచుకోవాలనుకున్నా నా కల, ఆకాంక్షలు అన్ని జారిపోతున్నట్లుగా ఉంది. ఆలోచనలన్నీ మసకబారుతున్నాయి. నా తల్లిదండ్రుల ముఖాలో తీవ్ర దుఃఖం కనిపిస్తుంది. అయినా ఇదంతా నేనెందుకు పోస్ట్ చేస్తున్నానో కూడా నాకు నిజంగా తెలియదు. బహుశా నిశబ్దంగా వెళ్లిపోవడం ఇష్టం లేక ఇలా పోస్ట్‌లో బిగ్గరగా చెప్పలనేమో." అంటూ తన పోస్ట్‌ని ముగించాడు.
ఈ పోస్ట్ నెట్టింట వేలాదిమంది నెటిజన్ల హృదయాలను తాకింది. చాలామంది ఉన్న సమయం ఉపయోగించుకోండి, ధైర్యంగా ఉండండి అని భరోసా ఇవ్వగా మరికొందరూ మాత్రం ఏదైనా మిరాకిల్ జరగొచ్చు కేన్సర్ మీ నుంచి దూరంగా వెళ్లిపోవచ్చు అని ఆశను రెకెత్తించేలా పోస్టుల పెట్టారు.
(చదవండి: జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్‌ని తలపించేలా..)