పార్థ్ మానియార్ అనే భారతీయ వ్యక్తి న్యూయార్క్‌లోని టైమ్ స్కేర్‌లో తన భాగస్వామికి చేసిన ప్రపోజల్ సినిమాని తలపించే రోమాంటిక్ సన్నివేశం అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. బిజీ బిజీగా ఉండే టైమ్ స్కేర్‌కాస్తా మూవీ సెట్‌గా మారిపోయింది. అక్కడొక వ్యక్తి తన గర్లఫ్రెండ్‌కి ప్రపోజల్ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.
ఒక్కసారిగా అక్కడ బాలీవుడమూవీ షూటింగ్ జరుగుతుందా అనే ఫీల్ కలుగుతంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ మూవీ కుచ్ కుచ్ హోతా హైలో కోయి మిల్ గయా అనే పాటకు పురుషుల, అమ్మాయిల బృందంతో హీరో రేంజ్‌లో డ్యాన్స్‌లు చేస్తూ తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేశాడు.
మొదట దాన్ని చూసి అయోమయంగా చూస్తుండిపోతుంది అతడి స్నేహితురాలు, ఆ తర్వాత తన అక్కా చెల్లెళ్లను తీసుకొచ్చి డ్యాన్స్ చేస్తూ కనపించడంతో విస్తుపోతుంది. అతడి ప్రపోజ్ చేసిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడమే కాదు నెటిజన్లు మనసును కూడా దోచుకుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
(చదవండి: పెళ్లిపై నటి జయ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు..! అది పాతబడిన వ్యవస్థ)


