టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతిమంధాన పెళ్లి చేసుకోవాలనుకున్న సంగీత దర్శకుడు , చిత్రనిర్మాత పలాష్ ముచ్చల్‌కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది.
పలాష్ స్మృతిని మోసం చేసిన కారణంగానే పెళ్లి ఆగిపోయిందనే పుకార్లుబాగా వినిపిస్తున్నాయి. ఈ పుకారపై గురించి ప్రస్తుతానికి ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ పలాష్ మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫోటో, బిర్వా షాకి ప్రపోజ్ చేసిన వడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017 నాటి పోస్ట్‌లో మోకాళ్లపై వంగి అత్యంత రొమాంటిక్ వాతావరణంలో పలాష్ ఆమెకు ప్రపోజ్ చేస్తూ ఉన్నట్లు మనం చూడవచ్చు.
Palash Muchhal and his ex Birva Shah👀 pic.twitter.com/0nVRaia3CQ https://t.co/T8kNaz2REU
— Mention Cricket (@MentionCricket) November 25, 2025
స్మృతిమంధానకు సోషల్ మీడియాలో సపోర్ట్
మరికొన్ని గంటల్లో తనను ప్రేమించిన వాడితో ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతిమంధాన వివాహం రద్దు కావడంతో అటు అభిమానులు, ఇటు సామాన్యం జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. పలాష్ ముచ్చల్ దారుణంగా ఆమెను మోసం చేశాడంటూ సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. మరోవైపు ధైర్యంగా ఉండు, స్మృతి.. మంచే జరిగింది. ఆ మోసగాడి గురించి ముందే తెలిసింది అంటూ ఎక్స్ ద్వారా ఆమెకు మద్దతుగా నిలిచారు. దీనికి సంబందించి మెన్షన్ క్రికెట్ అనే ట్విటర్ హ్యాండిల్‌లో అనేక పోస్టులు, వీడియోలు వైరల్‌గా మారాయి. పుకార్లు నిజమే, పలాష్ నిజానికి స్మృతిని మోసం చేశాడన్న పోస్ట్‌కు భారీ స్పందన లభిస్తోంది.
ఇదీ చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్ : వైరల్ స్ర్కీన్ షాట్స్, ఎవరీ మేరీ డికోస్టా
>In 2019, Palash broke with his fiance. >Started dating to Smriti Mandhana,
>Relationship with her for 6 years,
>Got the fame,
>Decided to marry for money,
>Cheated on her just before wedding night.
I wonder what smriti saw in him. pic.twitter.com/KCkTsk0x3v— `S.🚀 (@ThodaSaSanskari) November 25, 2025
పాపం పాలక్
మరోవైపు పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ పట్ల సానుభూతి వ్యక్తమౌతోంది. ఈ పుకార్లు నిజమైతే సొంత సోదరుడి వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందంటూ మరికొంతమంది కామెంట్స్ చేశారు. ఇండియాలో ఉత్తమ మహిళా నేపథ్య గాయకులలో ఒకరామె. పైగా పేద పిల్లల గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చడానికి ఒక NGOను నడుతున్న మంచిమనసున్న అద్భుతమైన వ్యక్తి అంటూ పేర్కొనడం విశేషం.
See this 👀👇🏻https://t.co/H5kpT5LcaV
— Mention Cricket (@MentionCricket) November 25, 2025


