మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలతో సందడి సందడిగా ఉన్న పెళ్లి మండపం ఒక్కసారిగా స్థంభించిపోయింది. పెళ్లి కుమార్తె తండ్రికి గుండెపోటు అంటూ పెళ్లి వేడుకలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఆ తరువాత వరుడు కూడా ఆసుపత్రిలో చేరినట్లు కూడా వెల్లడైంది. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. అవును.. టీమిండియా మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా గురించే. తన జీవితంలో బిగ్ డే కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తోంది స్మృతి. సన్నిహితులు, క్రికెట్ సహచరులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నవంబరు 23న మహారాష్ట్రలోని సాంగ్లిలో పలాష్ ముచ్చల్‌తో ఆమె పెళ్లి వేడుక ముగియాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడమే పెద్ద చర్చగా మారింది. ఆమె వెళ్లి వాయిదాతో నెటిజన్లు షాక్ అయ్యారు. దీనికి తోడు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో ఇండియా భారీ విజయానికి దోహదపడిన క్రికెటర్ స్మృతి, పలాష్ ముచ్చల్‌తో ఉన్న తన ఫోటోలన్నింటినీ సోషల్ మీడియా నుండి తొలగించడం నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది.

అది పాత కథ.. నీతో పిల్లల్ని కంటా..
తొలుత స్మృతి తండ్రి అనారోగ్యమే ఇందుకు కారణమని అందరూ భావించినా, క్రమంగా పలాష్ ముచ్చల్ కొరియాగ్రాఫర్తో డర్టీ మెసేజెస్ వెలుగులోకి వచ్చాయి. వీటిని స్వరయంగా మేరీ డి'కోస్టా షేర్ చేసింది. తనతో పలాష్ ముచ్చల్‌తో చాట్‌ల యొక్క అనేక స్క్రీన్‌షాట్‌లను పంచుకుంది. ఈ స్క్రీన్‌షాట్‌లు నిజమైనవో కాదో ఇంకా నిర్ధారణ కానప్పటికీ, పలాష్ పేరు, ఐడీ ఉన్నాయి గమనార్హం. ఈ చాట్ ప్రకారం తనను కలమని మేరీని అడిగాడు. మరి స్మృతి రిలేషన్ గురించి ఆమె ప్రశ్నించగా, అదొక పాత బంధం అని తేలిగ్గా కొట్టి పారేశాడు. పదే పదే స్మృతి ‘డెడ్’ అని సంబోధించడం, ఆమెను కలవని ఒత్తిడి చేయడం ఈ చాట్‌లో చూడవచ్చు. ఈమె వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్ అని తెలుస్తోంది. పలాష్ - స్మృతి వివాహానికి కొరియోగ్రఫీకి ఒప్పుకుందట.
దీంతోపాటు రెడ్డిట్‌లో, పలాష్ ఒక అమ్మాయికి దగ్గరగా కనిపించాడని చాలా మంది యూజర్స్ పేర్కొన్నారు. వివాహానికి ముందు జరిగిన కార్యక్రమంలో జరిగిన ద్రోహాన్ని తొలుత స్మృతి తండ్రే గుర్తించారట. దీంతో ఇద్దరి మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ కారణంగానే, అతనికి గుండెపోటు వచ్చిందనేది ప్రముఖంగా వినిపిస్తోంది.అయితే ఈ పుకార్లపై ఇరు వర్గాలు అధికారికంగా దృవీకరించనూలేదు, ఖండించనూ లేదు. అయితే పలాష్ స్మృతిని మోసం చేశాడనే ధృవీకరించని ఊహాగానాల మధ్య పలాష్ ముచ్చల్‌తో ఉన్న తన ఫోటోలన్నింటినీ తన సోషల్ మీడియా నుండి తొలగించడం ఈ అనుమానాలకు మరింత బలం పెరిగింది.
పలాష్ ముచ్చల్ స్మృతి మంధాన
స్మృతి - పలాష్ తమ పరస్పర స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారి 2019నుంచీ డేటింగ్ ప్రారంభించారు. క్రికెట్, సంగీతంపై వారి ఉమ్మడి ఆసక్తి వీరి మనసులు కలిసేలా చేసింది. 2024లో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించగా, పలాష్ తన చేతికి స్మృతి జెర్సీ నంబర్ 'SM18' టాటూ వేయించుకున్నాడు. మరి అంత ప్రేమ కురిపించిన పలాష్, తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్మృతిని ఇంత దారుణంగా మెసం చేస్తాడా? మేరీ కాకుండా ఇంకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ప్రస్తుతం కోట్లాది మంది స్మృతి అభిమానుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు.


