బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈమె కంటే ముందు చెల్లి నుపుర్ సనన్ ఓ ఇంటిది కాబోతుంది. గత కొన్నాళ్లు వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ సింగర్ స్టెబిన్ బెన్‌ని ఈమె పెళ్లి చేసుకోనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఫొటోలు కూడా పోస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి)
కృతి సనన్ మొదట తెలుగు సినిమాలు చేసి ఆపై బాలీవుడ్‌కి షిఫ్ట్ అయింది. చెల్లి నుపుర్ సనన్ కూడా అలానే చేయాలనుకుంది. మొదటగా టాలీవుడ్‌లో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. సినిమా ఫ్లాప్ కావడంతో మరో అవకాశం రాలేదు. ఒకటిరెండు ఆల్బమ్ సాంగ్స్‌లో కనిపించింది. కెరీర్ పరంగా వెనకబడినప్పటికీ లైఫ్‌లో ముందడుగు వేసింది. పెళ్లికి సిద్ధమైంది.
ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్‌ని నుపుర్ సనన్ పెళ్లి చేసుకోనుంది. జనవరి 11న ఈ శుభకార్యం జరగనుందని ఇదివరకే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు గానీ తేదీ లాంటివి ఏం ప్రకటించలేదు. నుపుర్‌కి స్టెబిన్ పెళ్లి ప్రపోజల్ చేస్తున్నట్లు, ఆమె అంగీకరించినట్లు ఉన్న ఫొటోలని నుపుర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!)




