పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీకి నేత ఒకరు హత్యకు గురయ్యారు,. తంగ్ తారన్ జిల్లా వాల్టోహా గ్రామ సర్పంఛ్ చేస్తున్న జర్మల్ సింగ్(50)ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పి చంపారు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన క్రమంలో ఈ హత్య జరిగింది. అమృత్‌సర్ జిల్లా, వెర్కా బైపాస్ దగ్గర ఉన్న ఒక రిసార్ట్‌లో పెళ్లి వేడుకకు జర్మల్ సింగ్ హాజరయ్యారు. అయితే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెళ్లి అతిథుల్లా లోపలికి వచ్చి, జర్మల్ సింగ్‌ను దగ్గర నుంచి కాల్చి చంపారుఆయన వేడుకలో పాల్గొంటున్న సమయంలో దాడి జరిగింది. తలకు బుల్లెట్ తగిలడంతో జర్మల్ సింగ్ మృతిచెందారు.
కబడ్డీ ఆటగాడు కన్వర్ దివిజయ్ సింగ్ (రాణా బలాచౌరియా) హత్య జరిగిన కొన్ని వారాలకే చోటు చేసుకోవడం వల్ల రాష్ట్రంలో నేరాల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మూడుదఫాలు జర్మల్ సింగ్ హత్యాయత్నం జరిగింది. అయితే ఈసారి జర్మల్ సింగ్‌ను అతి దగ్గరగా కాల్చి చంపడంతో ఆయన మృత్యువాత పడ్డారు. ఈ హత్య రాజకీయ ప్రత్యర్థిత్వం లేదా గ్యాంగ్‌స్టర్ సంబంధాలు కారణమా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..


