ప్రస్తుతం వివాహం అనే పదం ఎలా విలువలేని బంధంగా మారిందో చెప్పొచ్చు. అదీగాక నేటి యువతో వివాహం అనే బంధంలో చాలా చకచక నిర్ణయాలు తీసుకుని ఎలా విచ్ఛినన్న చేసుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం. ఈ జనరేషన్ తీరు భవిష్యత్తుకి భరోసా నిచ్చేలా వెల్ సెటిల్‌మెంట్ తర్వాతే పెళ్లి అని అంటున్నారే గానే బంధాన్ని పదిలంగా కలకాలం నిలిచేలా మైండ్‌ఇన స్ట్రాంగ్ ప్రిపేర్‌చేసుకోవడంలో ఫెయిలవ్వుతున్నారనేది నిపుణుల వాదన. ఇలాంటి సమయంలో బాలీవుడ్ నటి జయబచ్చన్ వివాహ గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. పైగా ఆమె వివాహాన్ని కాలం చెల్లిందిగా పేర్కొనడ సర్వత్ర చర్చనీయాంశమైంది. అందులోనూ ఎంపీ, సీనియర్‌నటి అయిన జయబచ్చన్ ఇలా మాట్లాడటంపై సంప్రదాయవాదులు వ్యతిరేకించగా, స్వేచ్ఛ కోరుకునే మహిళామణులు మాత్రం ఆమెకు మద్దతు పలకడం విశేషం. ఇంతకీ ఆమె ఏం అన్నారు. అది కరెక్టేనా అంటే..
ప్రముఖ నటి జయా బచ్చన్ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వివాహాన్ని కాలం చెల్లినది(Outdated Institution)గా పేర్కొన్నారు. అందుకే తన మనవరాలు నవేలి నందాను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె అన్నారు. 77 ఏళ్ల వయసులో ఉన్న తాను పిల్లల్లను పెంచడంపై యువతకు బోధించగలను కానీ, ఆ సలహాలు వారికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్లు చాలా తెలివిగా ఉంటున్నారు. తన మనవరాలు జనరేషన్‌లో ఉన్న యువత నమ్ముతుందే చెబుతున్నానని అన్నారామె. ఎందుకంటే వివాహ వ్యవస్థ చాలా వేగంగా మారిపోతోందని అన్నారు.
అభ్యంతరంగా అనిపించినా..అదే నిజం!
నవ్య గనుక తన కెరీర్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇంటి బాధ్యతలకు పరిమితమవ్వడం మీకు ఓకేనా అని అడిగినప్పుడూ జయ ఈ విధంగా వ్యాఖ్యానిచ్చారామె. ఏమాత్రం సంకోచం లేకుండా నవ్య వివాహం చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. ఆధునిక సంబంధాలకు చట్టపరమైన ముద్ర అవసరం లేదని, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి కలిసి ఉంటే సరిపోతుందని ఆమె నొక్కి చెప్పారు. ముందుగా యువత జీవితాన్ని ఆస్వాదించమని సలహా ఇచ్చారు. మాతరంలోని సంబంధాలతో ఈ తరం అనుభవిస్తున్నది చాల భిన్నంగా ఉంది.
ఇది అభ్యంతరంగా అనిపించినా..నిజానికి దీర్ఘాకాలిక సంబంధాలను నిలబెట్టుకోవాలంటే శారీర ఆకర్షణ, అనుకూలత చాలా ముఖ్యం కానీ ఈ తరం అది నిజమేనా కాదా అని ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే ప్రేమ కలకాలం కొనసాగాలంటే కొంత సర్ధుబాటు కూడా అవసరం. అది లేకపోతే బంధాన్ని నిలబెట్టుకోలేరని చెప్పుకొచ్చారు జయ. అలాగే ఈ రోజుల్లో చిన్నపిల్లలు చాలా తెలివైనవారు. వారు మనల్ని మించిపోయేలా ఉంటారు అని ఆమె తెలిపారు.
తరాల మధ్య ఆలోచనా విధానంలో వచ్చిన అపారమైన మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు . గతంలో ఉన్న సాంప్రదాయ పద్ధతులు, సామాజిక కట్టుబాట్లు నేటి యువతకు సరిపోవని, ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితాలను, సంబంధాలను తమకు నచ్చిన విధంగా నిర్వచించుకునే స్వేచ్ఛ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
పెళ్లిపై ఆలోచనలు నిజంగా మారుతున్నాయా?
నివేదికల ప్రకారం..భారతదేశంలో మహిళ సగటు వివాహ వయసు 2023లో 22.9 సంవత్సరాలకు పెరిగింది. ఇది మునుపటి కంటే కొంచెం ఎక్కువ. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో విద్య, కెరీర్ లేదా వ్యక్తిగత వృద్ధి కోసం వివాహాన్ని ఆలస్యం చేస్తోంది యువత. అదే విధంగా ఒకప్పుడూ ఎక్కువమంది మహిళలు 18 ఏళ్లకు ముందే వివాహం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆర్థిక స్వాతంత్ర్యంపై పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా వివాహంపై యువత ధోరణిలో పెనుమార్పులు వచ్చినట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇక జయబచ్చన్ వ్యాఖ్యలు చాలా బోల్డ్‌గా ఉన్నా..ఇప్పటికే జరుగుతున్న మార్పునే ప్రతిబింబించారని చెప్పొచ్చు అని అంటున్నారు నిపుణులు. ఇక జయ ఉద్దేశ్యం వివాహ తప్పనిసరి కాదు, కానీ శారీరక అనుకూలత, స్నేహం,సామాజిక బాధ్యత కంటే ముఖ్యమైనది. అలాగే పిల్లలను పెంచడానికి తప్పనిసరిగా సాంప్రదాయ నిర్మాణాలు అవసరం లేదనేది ఆమె అభిప్రాయం. దీన్ని చాలామంచి మహిళామణులు స్వాగతించగా, చాలామంది సంప్రదాయవాదులు ఇది సరైనది కాదని మండిపడుతున్నారు.
(చదవండి: రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి స్క్రాబుల్ గ్రాండ్‌మాస్టర్ టైటిల్! అసలేంటి గేమ్..)


