ఇంట్లో చిన్న పిల్లలు అంటే ఆ ఆనందమే వేరు. వారికి తోడు ఏదైనా పెట్ ఉంటే ఇక ఆ సందడి రెట్టింపు అవుతుంది. చిన్నపిల్లలు, పెంపుడు జంతువులు చాలా స్నేహంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇళ్ళలో పెంచుకునే కక్కలు చిన్నారులను చాలా ప్రేమిస్తాయి. మరో విధంగా చెప్పాలంటే కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. అంతేకాదు ఒక్కోసారి ప్రాణాపాయ ప్రమాదాలనుంచి కాపాడతాయి. పెట్స్‌తో కలిసి చిన్న పిల్లలు చేసే అల్లరి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించి ఒకఫ న్నీ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.
సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తూ అమ్మనుంచి దాక్కునేందుకు చాలా ఎత్తులు వేస్తూ ఉంటారు. వాటిల్లోముఖ్యమైనది దొంగచాటుగా, ఫోన్లలో ఆటలాడుకుంటూ, సరదా రీల్స్ చేస్తూ గడపుతూ ఉంటారు అదీ అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడుతూ. ఈ వీడియోలో చిన్నపిల్లాడికి తోడుదొంగలా నిలిచింది ఓ బుజ్జి కుక్కపిల్ల. ఇద్దరు ముసుగేసుకుని ఎంచక్కా ఫోన్ చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక మహిళ మీ యవ్వారం నాకు తెలుసులో అన్నట్టు వీళ్ల గదిలోకి తొంగి చూస్తుంది. అపుడు ఏమీ ఎరగనట్టు.. ఠక్కున ముసుగేసుకుని పడుకుంటారు. ఈ ఏడాది మేటి నటులు వీళ్లే అనే క్యాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియో 10లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. అదేంటో మీరు కూడా చూసి.. ఎంజాయ్ చేయండి మరి.!
The best actors of the year. ❤️😂 pic.twitter.com/QyfWoKxBTG
— The Figen (@TheFigen_) November 23, 2025


