న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(79) ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఛాతీలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వారం క్రితం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. సోనియా గాంధీ పూర్తి స్థాయిలో కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇంటివద్దే వైద్య చికిత్సలు కొనసాగించాలని ఆమెకు సూచించామని ఓ అధికారి తెలిపారు.


