దశాబ్దాలుగా భారతదేశంలో ఇంజనీరింగ్, వైద్యం వంటి సాంప్రదాయ కెరీర్‌లే ఆధిపత్యం చెలాయించాయి. ప్రస్తుతం భారత్ యువతలో మార్పు సంతరించుకుంది. డిజైన్, ష్యాషన్, యానిమేషన్, క్రియేటివ్ సాంకేతిక కెరీర్‌లను ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది కూడా. ఈ మార్పుని ప్రతిబింబింబించేలా వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్ (WUD) ఈ క్రియేటివ్ రంగం ప్రాముఖ్యతను హైలెట్ చేసేలా హైదరాబాద్‌లో కౌన్సలర్ల సమావేశాన్ని నిర్వహించింది.
ఆంధ్ర తెలంగాణ అంతటా దాదాపు వెయ్యి మందికి పైగా పాఠశాల ప్రిన్సిపాల్‌లు, కౌన్సలర్‌లను అనుసంధానించిన ఈ డ్రైవ్‌లో సృజనాత్మక రంగాలపై పెరుగుతున్న క్రేజ్‌ని చర్చించడమే కాకుండా ఈ జెన్ జెడ్ తన ఆకాంక్షలను ఎలా రూపొందించుకోగలదు అనే దానిపై అంతర్దృష్టిని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు రాష్ట్రం దాటి అవకాశాలను అన్వేషించడంలో తమ వంతు పాత్రను పోషిస్తామని వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్ డీన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ షలీన్ శర్మ అన్నారు.
అలాగే ఈ యూనివర్సిటికి చెందిన విద్యార్థుల్లో సుమారు 12-15% మంది ఆంధ్ర, తెలంగాణకు చెందినవారే కావడం విశేషం. అంతేగాదు ఈ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అవకాశాలను బలోపేతం చేసేలా WUD ఆక్స్‌ఫర్డ్ బ్రూక్స్ విశ్వవిద్యాలయం అండ్ రీడింగ్ UK విశ్వవిద్యాలయం, ఎమిలీ కార్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ అండ్ వాంకోవర్ ఫిల్మ్ స్కూల్, కెనడా; కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ USA; ENSAIT, ఫ్రాన్స్; ఉట్రెచ్ట్ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్; వంటి ప్రముఖ సంస్థలతో కూడా అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.
చివరగా ఈ కౌన్సలర్ల సమావేశం ద్వారా తెలంగాణ, హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులను సాధికారపర్చడానికి WUD తన నిబద్ధతను పునరుద్ఘాటించడమే కాకుండా ఈ డిజైన్ ఎడ్యుకేషన్‌ని పూర్తి స్థాయి కెరీర్ మార్గంగా ఎంచుకునులా ప్రోత్సహిస్తోంది కూడా.
(చదవండి: ఈ పర్ఫెక్ట్ క్రిస్పీ దోసె వెనుక ఇంత సైన్సు ఉందా? సాక్షాత్తు ఐఐటీ ప్రొఫెసర్)


