GHMC: మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్‌’కు గవర్నర్‌ ఆమోదం | Governor approves Municipalities Merger Ordinance in GHMC | Sakshi
Sakshi News home page

GHMC: మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్‌’కు గవర్నర్‌ ఆమోదం

Dec 1 2025 8:52 PM | Updated on Dec 1 2025 8:59 PM

Governor approves Municipalities Merger Ordinance in GHMC

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ లో‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్‌’కు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ ఫైల్‌ ప్రభుత్వానికి చేరడంతో దీనిపై కాసేపట్లో గెలిట్‌ విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. 

ఇటీవల గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ను విస్తరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  హైదరాబాద్‌ తెలంగాణ కోర్‌ అర్బన్‌ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లన్నింటినీ జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌(ఓఆర్‌ఆర్‌)కి లోపల, బయట, దానిని ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపాలిటీల చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని తీర్మానించింది.

జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్న పురపాలికలివే...
మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా : బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తూముకుంట, కొంపల్లి, దుండిగల్‌  

రంగారెడ్డి జిల్లా: బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, నార్సింగి, మణికొండ, ఆదిభట్ల,
తుక్కుగూడ 
సంగారెడ్డి జిల్లా: బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement