తెలంగాణలో ఇటీవల జరిగిన ఐపీఏస్ పోస్టింగులపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. పలు శాఖలలో ఐఏఎస్ అధికారులను నియమించాల్సి ఉండగా వారికి బదులుగా ఐపీఎస్ ఆఫీసర్స్ ని నియమించారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ అంశంపై త్వరలో కోర్టు విచారణ చేపట్టనుంది.