రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఒక ప్రేమ జంట ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అబ్బాయి పేరు ధనుంజయ్ కాగా అమ్మాయి పేరు అనామిక అని తెలుస్తోంది. మృతులిద్దరూ బిహార్ రాష్ట్రానికి చెందిన వారు. వీరిద్దరూ స్థానికంగా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారని సమాచారం. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


