దోసెలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే మెత్తగా నోట్లో కరిగిపోయే వాటికంటే..చక్కగా కరకరలాడే క్రిస్పి దోసెలంటే కొందరికి మహా ఇష్టం. అందులోనూ పైన క్రిస్పీగా లోపల మెత్తగా భలే గమ్మత్తుగా ఉంటుంది ఈ దోసె. అలా రావడానికి పెద్ద సైన్సు సూత్రమే ఉందట. దాన్ని సాక్షాత్తు ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ సోషల్‌మీడియా ఎక్స్ వేదికగా వివరించడంతో నెట్టింట వైరల్‌గా మారింది.
బంగారు రంగులో నోరూరించే ఈ దోసెలకు సైన్సుకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని చెబుతున్నారు పోస్ట్‌లో. సాధారణంగా దోసెలను వేసే ముందు పాన్ లేదా తవాపై ముందుగా నీళ్లు చిలకరిస్తారు గమనించారా..!. అది వేడెక్కిందా లేదా టెస్ట్ చేసుకుని మరి దోసెలు వేస్తుంటారు. దీన్ని లైడెన్‌ఫ్రాస్ట్ ఎఫెక్ట్ అంటారు. ఆ ప్రభావం వల్లే దోసె పైన క్రిస్పీగా లోపల మెత్తగా వస్తుందట. అది ఏవిధంగానో కూడా క్లియర్‌గా వివరించారు.
లైడెన్‌ఫ్రాస్ట్ ప్రభావం అంటే ..
మనం వేడివేడి పాన్ లేదా తవాపై నీళ్లు చిలకరించగానే నీరు ఉబ్బి ఆవిరైపోదు. నీటి బుడగలా వచ్చి.. పాన్ ఉష్ణోగ్రత నుంచి తనను కాపాడు కునేలా ఆవిరి పొరను ఏర్పరుచకుని అటు ఇటు జర్రు జర్రున జారుతూ ఉంటుంది. అదే పాన్ లేదా తవా వేడెక్కకపోతే నీటి బిందువులు పాన్‌కే అతుక్కుపోతుంది. పైగా పాన్ నెమ్మదిగా వెడేక్కగానే గాల్లో ఆ నీరు ఆవిరైపోతుంది. దీని గురించి 18వ శతాబ్దంలోనే జర్మన్ శాస్త్రవేత్తలు వివరించారు గానీ అంతకుమునుపే భారతీయుల వంట గృహాల్లో ఈ సిద్ధాంతంతో ఎంతో సంబంధం ఉంది.
ఇలా ఆదర్శ ఉష్ణోగ్రత వద్ద నీటి బిందువులు పాన్ ఉపరితలంపై జారేందుకు దోహదపడిన ఎఫెక్టే పిండి పాన్‌కి అతుక్కోకుండా చక్కగా వచ్చేందుకు కారణం అవుతుందట. అలాగే పాన్ చుట్టు పిండి స్పెండ్ అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందట. అదే పాన్ గనుక వేడెక్కకపోతే..పాన్‌పై దోసె సరిగా స్ప్రెడ్ అవ్వదు, పైగా పాన్‌కి దోసె అతుక్కుపోయి అట్టులా కాకుండా విరిగిపోతుందని వివరించాడు. ఈ లైడెన్‌ఫ్రాస్ట్ ఎఫెక్ట్ వల్లే అంతలా క్రిస్పీ దోసెలను రుచిగా తినగలమని చెప్పుకొచ్చారు. మన వంటిళ్లు ఫిజిక్స్ సూత్రాల నిలయం కదూ..!.
Ever wondered why a dosa turns out perfectly crispy on the outside and soft inside? The secret goes far beyond culinary instinct driven by physics.
In an authored article for @dt_next @iitmadras, Prof. Mahesh Panchagnula unpacks the science behind this everyday magic. The… pic.twitter.com/ZaiyFjJ6o6— IIT Madras (@iitmadras) November 27, 2025
(చదవండి: సినిమా రేంజ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజల్..! నెటిజన్ల ప్రశంసల జల్లు)


