యోగా గురు బాబా రాందేవ్‌కు భారీ షాక్ తగిలింది. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ద్వారా విక్రయించే ఆవు నెయ్యి (కౌ ఘీ) కల్తీదని తేలింది. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లోని ఒక కోర్టు, పతంజలి మరో ఇద్దరు పార్టీలపై జరిమానా విధించింది.నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించింది.
2020లో పతంజలి ఘీ అధికారిక పరీక్షల్లో నాణ్యతా ప్రమాణాల్లో విఫలమైంది. నాసిరకం ఆవు నెయ్యిని అమ్మినందుకు పితోర్‌గఢ్‌లోని అడ్జుడికేటింగ్ ఆఫీసర్/ADM కోర్టు అహ్మద్‌నగర్‌లోని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు రూ. 1 లక్ష జరిమానా విధించింది. దీనితో పాటు, పంపిణీదారు బ్రహ్మ ఏజెన్సీలకు రూ. 25,000 ,రిటైలర్ కరణ్ జనరల్ స్టోర్‌కు రూ. 15,000 జరిమానా విధించింది. అయితే ఈతీర్పుపై అప్పీల్ దాఖలు చేయనుంది. ఆహార భద్రతా ట్రిబ్యునల్ ముందు అప్పీల్ దాఖలు చేస్తున్నట్లు కంపెనీ పతంజలి అధికారి ఒకరు తెలిపారు.
ఇదీ చదవండి: మహిళా వ్యాపారవేత్తపై ఫార్మా బాస్ నిర్వాకం : తుపాకీతో బెదిరించి, న్యూడ్ వీడియోలు
ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం రెండు సార్లు పరీక్షల్లో పతంజలి నెయ్యి ఫెయిల్ అయింది. అక్టోబర్ 20, 2020న పితోర్‌గఢ్‌లోని కషానీలోని ఒక దుకాణం నుండి ఆహార భద్రతా అధికారి నెయ్యి నమూనాను సేకరించినప్పుడు ఈ కేసు ప్రారంభమైంది. కొనుగోలు బిల్లులో ఉత్పత్తిని బ్రహ్మ ఏజెన్సీస్, ధార్చుల రోడ్ , పతంజలి ఆయుర్వేద లిమిటెడ్, అహ్మద్‌నగర్‌లకు అనుసంధానించారు. అప్పటి పరీక్షల్లో ఈ నెయ్యి నాణ్యత లేనిదిగా తేలింది. తిరిగి ఈ నమూనాను మొదట రుద్రపూర్‌లోని రాష్ట్ర ఆహార , ఔషధ పరీక్ష ప్రయోగశాలకు పంపారు. అక్కడ అది నాణ్యత లేనిదిగా తేలిందని ఆహార భద్రత మరియు ఔషధ పరిపాలన అసిస్టెంట్ కమిషనర్ ఆర్‌కె శర్మ తెలిపారు. 2022 ఫిబ్రవరిలో ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 కింద కేసు దాఖలు చేసి, పతంజలికి నోటీసు జారీ చేసింది. తాజా విచారణలో గురువారం, నవంబర్ 27న, కోర్టు జరిమానాలు విధించి, ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.


