సామూహిక వివాహాల్లోనే తాళి కట్టిన సీఎం కొడుకు | Abhimanyu Yadav Who is Son Of Mohan Yadav MP CM Wedding Viral | Sakshi
Sakshi News home page

సామూహిక వివాహాల్లోనే తాళి కట్టిన సీఎం కొడుకు

Dec 1 2025 10:32 AM | Updated on Dec 1 2025 10:32 AM

Abhimanyu Yadav Who is Son Of Mohan Yadav MP CM Wedding Viral

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన చిన్న కొడుకు అభిమన్యు వివాహాన్ని నిరాడంబరంగా చేశారు. ఈ క్రమంలో అదే వేదికపై మరో 21 జంటలకు వివాహం జరిపించి.. యువతులకు పెళ్లి సారె సైతం అందించారాయన.  

మోహన్‌ యాదవ్‌ చిన్న కొడుకు అభిమన్యు డాక్టర్‌. వధువు ఇషితా పటేల్‌ కూడా వైద్యురాలే. ఈ ఇద్దరు ఆదివారం తన నియోజకవర్గం ఉజ్జయిని(సౌత్‌) క్షిప్రా నది తీరంలో జరిగిన సామూహిక వివాహ వేడుకల కార్యక్రమంలో ఒక్కటయ్యారు. పెళ్లి కొడుకులంతా గుర్రాలపై ఉరేగింపుగా రాగా.. పెళ్లి కూతుళ్లు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా మండపానికి వచ్చారు.  ఈ వేడుకకు ఆధ్యాత్మిక గురువులు, బాబాలు, అతికొద్ది మంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వివాహానికి హాజరైన వీఐపీలకు అక్కడికి వచ్చిన జనాలతో కలిపే భోజనాలు వడ్డించారు.  

అభిమన్యు-ఇషితలకు బాబా రామ్‌దేవ్‌ ఆశీర్వాదం.. చిత్రంలో సీఎం మోహన్‌ యాదవ్‌ కూడా(కుడి చివర)

మిగిలిన జంటలకు కన్యాదాన సామాగ్రి, ఇంటి కానుకలు, మొత్తం వివాహ ఖర్చుతో సహా మొత్తం బాధ్యతను యాదవ్ కుటుంబమే భరించింది. దీనికి తోడు.. ఖరైదీన గిప్ట్‌లు తీసుకురావొద్దంటూ ముందుగానే అందరికీ సమాచారం అందించారు. పాతిక వేల మంది దాకా వివాహానికి హాజరు కాగా.. దగ్గర్లోని ఆలయానికి వచ్చే భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చూసుకున్నారు. 

వివాహాల పేరిట అర్భాటాలకు పోయి ఖర్చులు చేసే బదులు ఇలా వివాహాలు జరిగితే మంచిదని.. ప్రధానమంత్రి చెప్పినట్లుగా పెళ్లిళ్లు సాధారణంగా జరగాలని, ఇలాంటి వివాహాలు సమానత్వానికి ప్రతీకని సీఎం మోహన్‌ యాదవ్‌ సందేశం ఇస్తున్నారు. ఇలాంటి వేదికలతో తన వివాహం జరగడం మరింత సంతోషాన్ని ఇస్తోందంటూ అభిమన్యు చెబుతున్నాడు. వివాహానికి హాజరైన జంటల్లో వివిధ వర్గాల(SC, ST) జంటలు ఉండడంతో సామాజిక సమానత్వం, సామరస్యానికి మోహన్‌ యాదవ్‌ నిదర్శనంగా నిలిచారంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement