బెంగళూరు: ఇటీవలి కాలంలో బెంగళూరు ట్రాఫిక్‌పై పలువురు ప్రముఖులు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ సైతం బెంగళూరులో ట్రాఫిక్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దీ నియంత్రణ కోసం పోలీసులకు తాను ఫోన్ చేసినా స్పందించలేదని మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ బెంగళూరుకు వెళ్లారు. అనంతరం, పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉండగా ఆయన ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. ఇంతలో బెంగళూరు రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది. దీంతో, తాను వెళ్లాల్సిన విమానం మిస్ అవుతుందనే కారణంగా స్థానిక పోలీసులకు సంప్రదించేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. అయితే, తన కాల్‌ను పోలీసులు లిఫ్ట్ చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా రాజీవ్ రాయ్ స్పందిస్తూ.. బెంగళూరులో ట్రాఫిక్ కారణంగా రోడ్లపై నరకం చూడాల్సి వచ్చింది. గౌరవనీయులైన కర్ణాటక ముఖ్యమంత్రి, నన్ను క్షమించండి. బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణ దారుణంగా ఉంది. అత్యంత బాధ్యతారహితమైన, పనికిరాని ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. వారు ఫోన్ కాల్స్ కూడా తీసుకోరు. వారితో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. ఎవరూ నా కాల్‌ను తీసుకోలేదు. రాజ్‌కుమార్ ఘాట్ రోడ్డులో ఒక గంట పాటు ఒకే చోట ట్రాఫిక్‌లో ఉండిపోయాను. ఒకానొక సమయంలో నేను ఢిల్లీ వెళ్లాల్సిన విమానం మిస్ అవుతుందో అని టెన్షన్ పడ్డాను. రోడ్లపై ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. ఈ అసమర్థ అధికారులే బెంగళూరు నగరం పేరును చెడగొడుతున్నారు. ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్ అత్యంత అపఖ్యాతిని పొందింది అనడంలో సందేహం లేదు’ అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hon’ble @CMofKarnataka I m sorry but you have the worst traffic management, and most irresponsible, useless traffic police. They don’t even pick up phone calls, here is the SS of my attempt to speak to them , none of them picked up my call. Last one hour we are stuck at same… pic.twitter.com/GlWjJ4RgKH
— Rajeev Rai (@RajeevRai) November 30, 2025


