కుమారా.. నాకు చెప్పొద్దు: డీకే ధ్వజం
కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చాలా పెద్దమనిషి. ఆయన ఎవరి మద్దతును కూడా పొందడం లేదు. ఒక్కలిగ మఠం, ఒక్కలిగ సంఘం, ఒక్కలిగ కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదు అని డీసీఎం డీ.కే.శివకుమార్ ఎద్దేవా చేశారు. ఆదివారం నగరంలో సదాశివనగర నివాసం వద్ద విలేకరులతో మాట్లాడిన డీకే.. కుమారస్వామిపై విమర్శలు సంధించారు. తాను స్వామీజీలను వాడుకుంటున్నట్లు కుమార ఆరోపించడంపై స్పందిస్తూ ఔను, పాపం కుమారస్వామికి ఒక్కలిగుల రెండో మఠం ఏమిటో తెలియదు, ఒక్కలిగుల సీనియర్ మఠం స్వామీజీలు లేకపోతే దేవేగౌడ సీఎం అయ్యేవారా?, ఆనాడు స్వామీజీలు రోడ్డు మీదకు రాలేదా? అని ప్రశ్నించారు. కొన్ని సమయాల్లో స్వామీజీలు మాట్లాడతారు. అందులో తప్పేముంది అన్నారు. ఢిల్లీలో మంత్రి ప్రియాంక ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యారు, తండ్రీ కుమారుడు కలిస్తే కూడా ఏదో అర్థం తీస్తున్నారా? అన్నారు. నేను, ప్రియాంక్ ఖర్గే ఏఐ టెక్నాలజీ సాధన ప్రారం భోత్సవానికి రాహుల్‌గాంధీని ఆహ్వానించాం. ఆయన రావడం కుదరలేదు అని చెప్పారు.
కుమార


