తుపాను.. చలి భూతం
● బెంగళూరువాసులు ఉక్కిరిబిక్కిరి
యశవంతపుర: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను వల్ల బెంగళూరుతో పాటు కన్నడనాట వానజల్లులు, చలి, పొగ మంచు కమ్ముకొంది. మిట్ట మధ్యాహ్నం కూడా ఎముకలు కొరికే చలి వెంటాడుతోంది. బెంగళూరులో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని బెంగళూరు వాతావారణశాఖ అధికారులు తెలిపారు. పగలు 16 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వచ్చే రెండుమూడు రోజుల్లో 12 డిగ్రీలకు తగ్గవచ్చు. చలితో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కూలీలు చలి మంటలతో వెచ్చదనం పొందారు. ఆదివారం ఉదయం బెంగళూరు కెంగేరితో పాటు పలుచోట్ల తుంపర వానలు పడ్డాయి. తుమకూరు, చిక్కబళ్లాపుర, కోలారు, బెంగళూరు నగర, గ్రామాంతర, రామనగర, మైసూరు, మండ్య, హాసన్, కొడగు, శివమొగ్గ, ఉడుపి, దక్షిణ కన్నడ, దక్షిణ ఒళనాడు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావారణశాఖ తెలిపింది. బెంగళూరులో మరో 2 రోజులు మేఘావృతమై ఉంటుంది. జిల్లాల్లో కోతకు వచ్చిన రాగి పంట వానలకు పాడవుతుందని రైతులు ఆందోళనగా ఉన్నారు.
ఆదివారం సాయంత్రం బెంగళూరులో
పొగమంచు, (ఇన్‌సెట్) జనం చలిమంట
తుపాను.. చలి భూతం


