నటి ఇంట్లో యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

నటి ఇంట్లో యువతి ఆత్మహత్య

Dec 1 2025 7:30 AM | Updated on Dec 1 2025 7:30 AM

నటి ఇ

నటి ఇంట్లో యువతి ఆత్మహత్య

యశవంతపుర: యువతి బంధువుల ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. పాండురంగ నగరలోని బంధువుల ఇంటిలో హాసన్‌కు చెందిన అచల (22) ప్రాణాలు తీసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రముఖ నటి ఆశికా రంగనాథ్‌కు అచల మామ కూతురు అవుతుంది. ఆమె ఇంజనీరింగ్‌ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం కోసం వెతుకుతోంది. తరచూ ఆశికా ఇంటికి వచ్చివెళ్లేది. దూరపు బంధువు మయాంక్‌ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. అతడు ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకొంటానంటూ అచలను లైంగికంగా వేధించేవాడు. అందుకు ఆమె నిరారించటంతో దాడి చేసి కొట్టేవాడని సమాచారం.

మానసికంగా కుంగిపోయి..

డ్రగ్స్‌కు బానిసడైన మయాంక్‌ నిరంతం అచలను వేధించేవాడు. దీంతో పాటు మరో యువతితో మయాంక్‌కు సంబంధం ఉన్నట్లు అచలకు తెలిసింది. ఈ పరిణామాలతో మయాంక్‌ తన జీవితాన్ని నాశనం చేసినట్లు కుంగిపోయింది. అచల 10 రోజుల క్రితం ఆశికా రంగనాథ్‌ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. తమ పరువు పోతుందని భావించి తల్లిదండ్రులు, బంధువులు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు జరిపించారు. అయితే ఆదివారం ఒక్కసారిగా సంగతి బయటపడింది. మయాంక్‌, అతని తల్లి మైనా పై బెంగళూరు పట్టేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. మయాంక్‌ను అరెస్ట్‌ చేయాలని అచల కుటుంబం డిమాండ్‌ చేస్తోంది.

10 రోజుల తరువాత వెలుగులోకి

బంధువుల అబ్బాయి వేధింపులే కారణం

నటి ఇంట్లో యువతి ఆత్మహత్య 1
1/2

నటి ఇంట్లో యువతి ఆత్మహత్య

నటి ఇంట్లో యువతి ఆత్మహత్య 2
2/2

నటి ఇంట్లో యువతి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement