ఫ్లూట్‌లు అమ్ముకునే వ్యక్తి కథ..! | Delhi mans emotional story about flute seller Goes Viral | Sakshi
Sakshi News home page

ఫ్లూట్‌లు అమ్ముకునే వ్యక్తి కథ..! ఈసారి అలా చెయ్యొద్దు..

Apr 4 2026 12:44 PM | Updated on Apr 4 2026 4:52 PM

Delhi mans emotional story about flute seller Goes Viral

సంగీతానికి సంబంధించిన పరికరాలు అమ్మే వ్యక్తి..ఇతర పండ్లు, కూరగాయలు అమ్మే విక్రేతగా అరుస్తూ అమ్మడు. మాధుర్యంగా వాయిస్తూ ప్రజల అటెన్షన్‌ తనపై పడేలా నిశబ్దంగా అమ్ముకుంటాడు. ప్రజలు కూడా ఆ సంగీతానికి పరవశమై కాసేపు జాలీగా, బాధగా చూసి వెళ్లిపోవడమో లేక కుదిరితే కొనడమో చేస్తుంటారు. ఈసారి మాత్రం అలా చెయ్యొద్దు అని చెబుతున్నాడు ప్రభ్‌జోత్‌ సంగ్‌ అనే వ్యక్తి. 

ఇంతకీ ఏం చేయాలంటే..ఢిల్లీకి చెందిన సూరజ్‌ అనే ఫ్లూట్‌లు అమ్మే వ్యక్తి కథను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు ప్రభ్‌జోత్‌ సింగ్‌ అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. సూరజ్‌ అనే ఫ్లూట్‌ల విక్రేత బెలూన్ల తోపాటు ఆ ఫ్లూట్‌లను అమ్మే విధానం ముగ్ధమనోహరంగా ఉంటుంది. అతడు ఫ్లూట్‌ పట్టుకుని వాయిస్తూ ప్రజలందరీ అటెన్షన్‌ తనపై పడేలా వాయించే విధానం ప్రతి ఒక్కరి మనసుని కదిలిస్తుంది. 

అంత అద్భుతంగా వేణువుని ఆలపిస్తాడు సూరజ్‌. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్‌ చేస్తూ..అతను వేణువుని వాయిస్తున్నప్పుడు అందంగా కదిలే ఆ బుడగల దృశ్యం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని రాసుకొచ్చాడు. అతను ఒకేసారి ప్రదర్శకుడిగా, అమ్మకందారుడిగా రెండు పాత్రలను భలే సమతుల్యం చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. అయితే ఆ రెండు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం అతడి కుటుంబ అవసరాలకు ఎంత మాత్రం సరిపడదనేది అందరికీ తెలిసిందే. 

అయితే మనమంతా అలాంటి వ్యక్తుల ప్రతిభను చూసి ఆశ్చర్యపోతూ..జాలిని వ్యక్తం చేసి వదిలేస్తుంటాం. ఎలాంటి సాయం చేయూత అందించే యోచన చేయమని, తాను కూడా మొదటిసారి అలానే చేశానని చెప్పుకొచ్చాడు ప్రభ్‌జోత్‌. అయితే ఈసారి అలా చేయాలనుకోలేదని వివరించాడు. ఈసారి అతడితో కాసేపు ముచ్చటించినట్లు తెలిపాడు. తన తండ్రి వేణువుని వాయించేవాడని, ఇప్పుడు తన కొడుకు కూడా తనలా వాయించేలా నేర్చుకుంటున్నాడని సూరజ్‌ చెప్పుకొచ్చినట్లు వెల్లడించాడు. 

ఇక అమ్మేందుకు ఇలా ప్రదర్శన ఇవ్వడం కాకుండా తన టాలెంట్‌న ప్రదర్శించేందుకు వాయిస్తాడని పోస్టులో రాసుకొచ్చాడు ప్రభ్‌జోత్‌. అంతేగాదు ఇతరులను కూడా అలానే చేయమని ప్రోత్సహిస్తున్నాడు కూడా. వీధి సంగీతకారులను చూసి కేవలం విని వదిలేయొద్దు..వారి దగ్గర నుంచి ఫోన్‌ నెంబర్‌ తీసుకోండి, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్లకో లేదా హౌస్‌ పార్టీలోనే చక్కగా తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇవ్వండి, తోచినంత మొత్తం చెల్లించండి. 

మనం వాళ్లని అమ్మకందారులుగా కాకుండా కళకారులుగా పిలిచి గౌరవిద్దాం అని పిలుపునిస్తున్నా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రభ్‌జోత్‌. నిజానికి మనం మొత్తం వ్యవస్థను మార్చలేకపోవచ్చు..ఇలాంటి చిన్న​ ప్రయత్నాలతో వాళ్ల జీవితంలో వెలుగు రావొచ్చేమో..లేక మార్పు సంతరించుకోవచ్చేమో..! అంటూ పోస్ట్‌ ముగించాడు. నెటిజన్లు సైతం అతడికి మద్దతిస్తూ..ఆలోచన బాగుంది సార్‌ అంటూ పోస్టులు పెట్టారు.  

 

(చదవండి: NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్‌ లుక్‌..!)

 

Advertisement
 
Advertisement
Advertisement