NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్‌ లుక్‌..! | Fashion Tips, Nita Ambani Steals The Spotlight In Molten Gold Silk Saree, Check Out Full Details Inside | Sakshi
Sakshi News home page

NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్‌ లుక్‌..!

Apr 4 2026 11:36 AM | Updated on Apr 4 2026 12:36 PM

fashion Tips: Nita Ambani steals the spotlight in molten gold silk saree

కళలు, సం‍స్కృతికి నిలయమైన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC) మూడో వార్షికోత్సవం ఏప్రిల్‌ 3, 2026న ముంబైలో అ‍ట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె  ఆరుగజాల మెటాలిక​ సిల్క్‌ చీర, దానికి మ్యాచింగ్‌గా ఆభరణాలను ధరించి రాజసం ఉట్టపడే ఆహార్యంతో కట్టిపడేశారు. ఈ వేడుకకు బాలీవుడ్‌ ప్రముఖ తారలంతా విచ్చేశారు. 

ముఖ్యంగా షాహిద్ కపూర్, మీరా కపూర్‌, రణవీర్‌ సింగ్‌, సల్మాన్‌ ఖాన్‌, సిద్ధార్ధ్‌ మల్హోత్ర, కియార అద్వానీ తదితర తారాగణం హాజరయ్యారు. ఈ వేడుకలో నీతా అంబానీ రాజసం ఉట్టిపడే పట్టుచీరలో ధగధగ మెరిసిపోయారామె. సాంప్రదాయ భారతీయ హస్తకళకు అద్భుతమైన నిదర్శనంగా నిలిచింది ఆమె ధరించిన చీర. బంగారు, ముదురు ఎరుపు రంగుల ప్రకాశవంతమైన కలయికతో కూడిన చరీపై ‍క్లిష్టమైన జరీ పని అద్భుతంగా ప్రతిబింబిస్తూ..ద్రవరూపంలో ఉన్న మెరుపని సృష్టిస్తోంది. 

సాంప్రదాయ పైస్లీ నమూనాలతో కూడిన వెడల్పాటి అంచు, చీరకు చక్కటి రూపాన్ని ఇవ్వగా పల్లుపై సూక్ష్మమైన నమూనాలు మరింత హైలెట్‌గా నిలిచాయి. దానికి మ్యాచింగ్‌గా మెరూన్‌ గోల్డ్‌ రంగులో పొట్టిచేతులతో కూడిన బ్లౌజ్‌ చీర లుక్‌ని అమాంతం పెంచేసింది. 

ఆ పట్టుచీరకు తగ్గట్టుగా ప్రకాశవంతమైన పచ్చులు, కెంపులతో పొదిగిన నెక్లెస్‌, చేతులకు బంగారు గాజులు, చెవులకు స్టేమెంట్‌ రింగులతో.. పండుగ వాతావరణాన్ని తలపించే రాయల్‌ లుక్‌లో ఆకర్షణీయంగా కనిపించారు నీతా. సాంప్రదాయ మహిళలా మధ్యపాపిడి చక్కటి కొప్పు, తేలికైన మేకప్‌తో హుందాగా మెరిశారామె. సింపుల్‌గా చెప్పాలంటే ఆమె మొత్తం రూపంలో సాంస్కృతికత ప్రతిధ్వనించింది. 

 

(చదవండి: రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి, మాృతృత్వం కోసం ‍బ్రేక్‌ ఇచ్చి..మళ్లీ..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement